Bigg Boss OTT Telugu: అనిల్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ, ముద్దులతో ముమైత్ ని ఇరిటేట్ చేస్తోన్న ఛాలెంజర్
స్రవంతి, అజయ్ కలిసి అనిల్ ని ఏడిపించడం మొదలుపెట్టారు. అషురెడ్డి, అరియనాలతో ట్రైయాంగిల్ ట్రాక్ ఉన్నట్లు అనిల్ ని ఆటపట్టించారు.
ఈరోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్లకు ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ ఇంట్లో తమకు నచ్చిన, నచ్చని వ్యక్తుల గురించి చెప్పాలని, వారికి థమ్స్ అప్, థమ్స్ డౌన్ బ్యాడ్జీలు పెట్టాలని తెలిపారు. ముందుగా అరియానా తనకు అజయ్‌కు థమ్స్ అప్ ఇచ్చింది. శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చింది. తనని ఓవర్ యాక్షన్ అనడం తట్టుకోలేకపోయానని అరియానా ఫీలయ్యింది. ఆ తర్వాత అఖిల్ కూడా అజయ్‌కు థమ్స్ అప్, శ్రీ రాపాకకు థమ్స్ డౌన్ ఇచ్చాడు. ఈ టాస్క్ పూర్తయిన తరువాత ముమైత్ ఖాన్.. ఛాలెంజర్స్ టీమ్ లో కొంతమంది స్రవంతి, అజయ్, అనిల్ లతో కూర్చొని ముచ్చట్లు పెట్టింది.
స్రవంతి, అజయ్ కలిసి అనిల్ ని ఏడిపించడం మొదలుపెట్టారు. అషురెడ్డి, అరియనాలతో ట్రైయాంగిల్ ట్రాక్ ఉన్నట్లు అనిల్ ని ఆటపట్టించారు. 'నీ లవ్ మేం సెట్ చేస్తామంటూ' స్రవంతి రచ్చ చేసింది. ఆ తరువాత మిత్ర వచ్చి ముమైత్ కి 'ఐ లవ్యూ' చెబుతూ ముద్దులు పెట్టడం మొదలుపెట్టింది. నిన్న కూడా అలానే చేసింది. ముమైత్ కొన్ని విషయాలను మిత్రతో షేర్ చేసుకుంటుంటే.. సడెన్ గా ఆమెకి హగ్గులిచ్చి, ముద్దులు పెట్టింది. ఎంతసేపటికీ ఆపకపోవడంతో ముమైత్ వదలమంటూ నవ్వుతూ చెప్పింది.
కానీ ఈరోజు మాత్రం ముమైత్ చాలా చిరాకు పడింది. అయినప్పటికీ మిత్ర ముద్దులు పెట్టడం ఆపకపోవడంతో ఆమె మెల్లగా తోసేసింది. మొత్తానికి మిత్ర తన బిహేవియర్ తో ముమైత్ బాగా చికాకు పెడుతోంది. ఈ వారం మిత్ర శర్మ కూడా నామినేషన్ లో ఉంది. మరి సేవ్ అవుతుందో.. లేదో చూడాలి. ఇక బెడ్ రూమ్ లో హమీద, సరయు కలిసి క్లీన్ చేస్తుండడంతో ఆర్జే చైతు వచ్చి వాళ్లను ఏడిపిస్తున్నాడు. ఇంతలో సరయు తనదైన స్టైల్ లో బూతులతో సెటైర్లు వేయడం మొదలుపెట్టింది. మధ్యలో సెన్సార్ అంటూ డైలాగ్ కూడా వేసింది.
Mee favourite contestant ki vote cheyyandi. #biggboss #biggbosstelugu #biggbossnonstop @EndemolShineIND @DisneyPlusHS pic.twitter.com/SAtazYdjmJ
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2022
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్:
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5)
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్)