అన్వేషించండి
Advertisement
Bigg Boss OTT Telugu: 'రేయ్ అఖిల్‌గా చెప్పరా' - బిందు వర్సెస్ అఖిల్
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అఖిల్ కి, బిందుకి అసలు పడడం లేదు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఐదు వారాలను పూర్తి చేసుకొని ఆరోవరంలోకి ఎంటర్ అయింది. నిన్నటి ఎపిసోడ్ లో డబుల్ ఎలిమినేషన్ జరగగా.. ముమైత్ ఖాన్, స్రవంతి హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో అఖిల్, బిందు ఒకరినొకరు తిట్టుకున్నారు. నటరాజ్ మాస్టర్, శివల మధ్య కూడా గొడవ జరిగినట్లు ఉంది.
నిజానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అఖిల్ కి, బిందుకి అసలు పడడం లేదు. మధ్యలో ఒకరినొకరు హగ్ చేసుకొని సారీ చెప్పుకున్నప్పటికీ.. ఆ శత్రుత్వం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. చిన్న విషయాలను పట్టుకొని నామినేషన్స్ వరకు వస్తుంటారు వీరిద్దరూ. ప్రతివారం అఖిల్-బిందులకు గొడవ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా 'ఆడ' అనే సెటైరికల్ పదం వాడడంతో బిందుపై అఖిల్ ఓ రేంజ్ లో సీరియస్ అయ్యాడు.
అప్పటినుంచి వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. ఈరోజు జరగబోయే నామినేషన్స్ అయితే వీరిద్దరూ బాగా రెచ్చిపోయారు. కోపం ఎక్కువ అనే కారణంతో బిందు మాధవిని నామినేట్ చేస్తున్నట్టుగా అఖిల్ చెప్పుకొచ్చాడు. గత వారం కూడా అదే కారణంతో చేశాను అని అన్నాడు. బిందు మాధవి కూడా వాదించడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. రేయ్ అఖిల్‌గా చెప్పురా? అని బిందు మాధవి సెటైరికల్‌గా అంటే.. ఒసేయ్.. ఏం చెప్పాలే బిందు అని అఖిల్ మరింతగా రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
"Ey, Bindu! Em cheppaali neeku?!"#BiggBossNonstop house lo choodamanta, oka game janta game janta 😏 @DisneyPlusHS lo 9 PM ki, don’t miss the tamasha 🤓#BiggBoss #BiggBossTelugu @EndemolShineIND pic.twitter.com/hHsuP3LxQB
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 11, 2022
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion