By: ABP Desam | Updated at : 16 Mar 2022 03:46 PM (IST)
అనిల్ కి షాకిచ్చిన బిగ్ బాస్, కెప్టెన్సీ క్యాన్సిల్ చేసేశారు
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మూడో వారంలోకి ఎంటర్ అయింది. మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. ఇక సోమవారం నాడు జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం పన్నెండు మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వారెవరంటే.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు.
ఇక ఈరోజు హౌస్ లో కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. మార్నింగ్ యాక్టివిటీ టాస్క్ లో భాగంగా.. హౌస్ మేట్స్ ఒకరిపై మరొకరు నిజం కానీ పొగడ్తలు చేసేలా చూడాల్సి ఉంటుంది. ముందుగా ఆర్జే చైతు.. అఖిల్ పై నిజం కానీ పొగడ్తలు చేశాడు. 'అఖిల్ స్మైల్ చేయకపోతే చాలా బావుంటాడు' అనగా.. ఇంతలో తేజస్వి 'బట్టలు లేకపోతే ఇంకా చాలా బావుంటాడు' అంటూ సెటైర్ వేసింది.
'నువ్ కెప్టెన్సీపై చూపించే ఇంట్రెస్ట్ నాకు చాలా ఇష్టం' అని సరయు.. అనిల్ పై కామెంట్ చేస్తుంది. ఆ తరువాత తేజస్వి 'నటరాజ్ మాస్టర్ కి ఇంట్లో అందరి మీద కంటే శివ మీద ప్రేమ ఎక్కువ' అని చెబుతుంది. 'అషు చాలా బావుంటుంది' అని శివ అనగా.. 'నువ్వేం మాట్లాడినా ఏంటో తియ్యగా ఉంటుంది' అని చెబుతుంది అషు.
ఆ తరువాత కెప్టెన్ అనిల్ ని 'ఇంట్లో మీ కెప్టెన్సీ ఎలా సాగుతుంది' అని అడుగుతారు బిగ్ బాస్. అంతా బాగుందని చెబుతాడు అనిల్. హౌస్ మేట్స్ కూడా నేర్చుకుంటూ చేస్తున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఇంతలో బిగ్ బాస్ అనిల్ కెప్టెన్సీలో హౌస్ లో సభ్యులు ఎలా ఉన్నారో వీడియోలో చూపించారు. అందులో కొందరు హౌస్ మేట్స్ డే టైంలో పడుకొని ఉండడం, మైక్ వేసుకోకుండా ఉండడం చేశారు. ఈ వీడియో ఫన్నీగా ఉండడంతో హౌస్ మేట్స్ అంతా నవ్వుకున్నారు. అదే సమయంలో బిగ్ బాస్ అనిల్ కి షాకిచ్చాడు.
కెప్టెన్ గా అనిల్ పనితీరు నచ్చకపోవడంతో అతడిని కెప్టెన్ పదవి నుంచి తీసేశారు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ అరియానాకు సీక్రెట్ టాస్క్ ఒకటి ఇచ్చారు. మరి ఆమె టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి కెప్టెన్ అవుతుందేమో చూడాలి!
The captains are coming under scrutiny! What will their fate be?😳😧
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 16, 2022
Watch the episode at 9PM exclusively on @DisneyPlusHS#BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/kPoFZoeOaj
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!