Bigg Boss OTT: మిత్రా శర్మ లగ్జరీ లైఫ్ స్టయిల్, వందల కోట్లు ఆస్తులు
హైదరాబాద్ లో ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసింది. వందల కోట్ల ఆస్తులు సంపాదించింది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న మిత్రా శర్మ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు. బిగ్ బాస్ షోతో పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. పదకొండో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది మిత్రా శర్మ. ముంబైలో పుట్టిపెరిగిన మిత్రా శర్మకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె తండ్రి ఎంకరేజ్ చేశారు. కానీ ఆయన మరణించడంతో మిత్రాని బంధువులు దూరం పెట్టారు. ఇక ముంబైలో ఉండలేక నటిగా అవకాశాలు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చేసింది.
అవకాశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగింది. 'తొలి సంధ్యవేళలో'అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రెండు, మూడు సినిమాలు చేసింది కానీ హీరోయిన్ గా ఆమెకి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో తనకు ఇష్టమైన ఇండస్ట్రీలోనే రాణించాలని సొంతంగా 'శ్రీపిక్చర్స్' అనే ప్రొడక్షన్ హౌస్ ని మొదలుపెట్టింది. 'బాయ్స్' అనే సినిమాతో నిర్మాతగా మారింది. తన వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ కోట్లు సంపాదించింది.
హైదరాబాద్ లో ఓ పెద్ద బంగ్లాను కొనుగోలు చేసింది. వందల కోట్ల ఆస్తులు సంపాదించింది. ఆమెకి కార్లంటే చాలా ఇష్టం. ప్రస్తుతం కోటి 20 లక్షల ఖరీదైన బెంజ్ కారు వాడుతుంది. ఈ కారు ఇండియాలో సంపన్నులైన పది మంది దగ్గర మాత్రమే ఉంది. అలాంటి కారు మిత్రా దగ్గర ఉంది. ఈ కారుకి తగ్గట్లే 999 అనే ఫ్యాన్సీ నెంబర్ ని వాడుతుంది. అలానే మిత్రాకు కుక్కలంటే చాలా ఇష్టమట. ఇప్పుడు ఆమె దగ్గర పది నుంచి ఇరవై వరకు వివిధ జాతుల కుక్కలు ఉన్నాయి.
వాటిని ఇంద్రభవనం లాంటి తన ఇంట్లోనే పెంచుకుంటోంది. కుక్కల కోసం సెపరేట్ గా రూమ్స్ కూడా ఉన్నారట. ఇంత లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న మిత్రా కేవలం ఫేమ్ కోసం మాత్రమే బిగ్ బాస్ షోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె పది సినిమాలు చేసినా.. రాని క్రేజ్ బిగ్ బాస్ షోతో సంపాదించేస్తుంది. మరి హౌస్ లో ఆమె ఎన్ని వారాలు ఉంటుందో చూడాలి!
View this post on Instagram
View this post on Instagram