Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో బిగ్ ట్విస్ట్, సీనియర్ హౌస్ మేట్స్‌కు ఇక చుక్కలే, కొత్త రూల్స్ ఇవే!
కొత్త రూల్స్‌తో సీనియర్ హౌస్‌మేట్స్‌కు బిగ్ బాస్ షాకిచ్చాడు. ఇకపై వారు జూనియర్స్ చెప్పినట్లే నడుచుకోవాలి. తేడా వస్తే పనిష్మెంట్ తప్పదు.
సీనియర్స్ (వారియర్స్)కు ‘బిగ్ బాస్’ షాకిచ్చాడు. ఇకపై ఇంట్లో ఏ ప్రయోజనాలు కావాలన్నా జూనియర్స్ (ఛాలెంజర్స్)పై ఆధారపడాల్సిందే. వారియర్స్ అంటే.. ఇదివరకు ‘బిగ్ బాస్’ సీజన్లో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్లు. ఛాలెంజర్స్ అంటే కొత్తగా ‘బిగ్ బాస్’లోకి వచ్చిన కంటెస్టెంట్లు. ఇక బిగ్ బాస్ పెట్టిన కొత్త రూల్స్‌లోకి వెళ్తే.. బెడ్ రూమ్ యాక్సెస్‌ను వారియర్స్‌కు పరిమితం చేశారు. ఛాలెంజర్స్ అనుమతి లభిస్తేనే బెడ్ రూమ్‌లో నిద్రపోయే అవకాశం వారియర్స్‌కు లభిస్తుంది. అలాగే వారియర్స్ పూర్తి లగేజ్ కూడా ఛాలెంజర్స్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఆ లగేజ్ నుంచి ఒక్క వారియర్ మాత్రమే 5 వస్తువులు తీసుకోవాలి. ఇందుకు వారు ఛాలెంజర్స్ అనుమతి తీసుకోవాలి.
ఛాలెంజర్స్ భోజనం చేశాకే, వారియర్స్ తినాలి: ఇక భోజనం కూడా ఛాలెంజర్స్ తిన్న తర్వాతే వారియర్స్ తినాలి. వారియర్స్ అంతా ఒకే చోటు కూర్చొని తినాలి. వారియర్స్‌లో ఉన్న సభ్యులు పాత హౌస్‌మేట్స్ కాబట్టి.. వారికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఎలా ఉంటుందో తెలుస్తుందని, కాబట్టి ఇంటి పనులన్నీ ఇకపై వారియర్స్ మాత్రమే చేయాలని బిగ్ బాస్ కండీషన్ పెట్టాడు. ఈ రూల్స్ తప్పిన వారియర్స్‌ను శిక్షించే అవకాశాన్ని కూడా ఛాలెంజర్స్‌కే ఇచ్చాడు బిగ్ బాస్. వారియర్స్‌కు పనులు కేటాయించేందుకు బిగ్ బాస్ జాబ్ మేళా పెట్టాడు. ఈ సందర్భంగా వారియర్స్‌ను చాంఫియన్స్ ఇంటర్వ్యూ చేసి పనులు కేటాయిస్తారు. ఆ పనులకు సంబంధించిన ట్యాగ్‌ను వారికి ఇస్తారు. వారియర్స్ సక్రమంగా పనిచేసేందుకు వారిలో ఒకరిని మేనేజర్‌గా ఎంపిక చేస్తారు.
Also Read: అరియానాతో కలిసి గోవాకు వెళ్లా, తేజూతో అసలు విషయం చెప్పేసిన చైతూ
బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే:
వారియర్స్ టీమ్:
1. అషురెడ్డి (సీజన్ 3)
2. మహేష్ విట్టా (సీజన్ 3)
3. ముమైత్ ఖాన్ (సీజన్ 1)
4. అరియనా (సీజన్ 4)
5. నటరాజ్ మాస్టర్ (సీజన్ 5)
6. తేజస్వి మదివాడ (సీజన్ 2)
7. సరయు (సీజన్ 5)
8. హమీద (సీజన్ 5)
9. అఖిల్ సార్థక్ (సీజన్ 4)
Also Read: నన్ను పెళ్లి చేసుకుంటావా? చైతూకు సరయు ఆఫర్, హమీదాకు వాతలు పెడతానన్న నటరాజ్!
ఛాలెంజర్స్:
1. ఆర్జే చైతు (ఆర్జే)
2. అజయ్ కతుర్వర్ (నటుడు)
3. స్రవంతి చొక్కారపు (యాంకర్)
4. శ్రీరాపాక (నటి)
5. అనిల్ రాథోడ్ (మోడల్)
6. మిత్రా శర్మ (నటి, నిర్మాత)
7. యాంకర్ శివ (యూట్యూబ్ యాంకర్)
8. బిందు మాధవి (హీరోయిన్)