Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ డే10 రివ్యూ.. ఇద్దరితో రీతూ పులిహోర.. కెప్టెన్సీ కోసం రేసు మొదలు.. మొదటి ఛాలెంజ్ ఏంటంటే?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోని పదవ రోజు హౌస్‌లో చాలా ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకున్నాయి. సెకండ్ వీక్ కెప్టెన్సీ కోసం రేసు మొదలైంది. అసలు 10వ రోజు ఏం జరిగిందంటే..

Bigg Boss 9 Telugu - Day 10 Episode 11 Review: బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం కెప్టెన్సీ కోసం ఆట మొదలైంది. ముందుగా కెప్టెన్సీ కంటెండర్ల కోసం ఆటను పెట్టాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్ కాకుండా బుధవారం నాడు బిగ్ బాస్ ఇంట్లో చాలానే విషయాలు జరిగాయి. రీతూ, పవన్, కళ్యాణ్ ట్రాక్ కాస్త ముందుకు కదులుతున్నట్టుగానే కనిపించింది. నిరాహార దీక్షను హరీష్ పక్కన పెట్టేశాడు. రెండ్రోజుల నుంచి తినకుండా ఉన్న హరీష్ ఈ రోజు ఎపిసోడ్‌లో తినేశాడు. అలా ఈ రోజు బిగ్ బాస్ ఇంట్లో ఇంకా ఏం జరిగిందంటే..
ఇడ్లీ తీసుకుని పులిహోర ఇస్తావా? అని కళ్యాణ్‌ను రీతూ అడిగింది. దీంతో తనను ఇంప్రెస్ చేస్తాను అంటే ఇస్తాను అని కళ్యాణ్ కండీషన్ పెడతాడు. ఇక రీతూ అయితే కళ్యాణ్‌ను పొగిడింది. ఆ విషయాన్నే ప్రోమోలా కట్ చేసి వదిలారు. ఇక ఈ ట్రాక్ తరువాత డీమాన్ పవన్ రీతూ ట్రాక్ స్టార్ట్ అయింది. రీతూ గురించి డీమాన్, డీమాన్ గురించి రీతూ చెప్పమని ఇమాన్యుయేల్, తనూజ అడిగారు. ఏది ఉన్న మొహం మీదే చెప్పేస్తారు.. అని ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకున్నారు. రీతూ అందంగా ఉంటుంది అని పవన్ సిగ్గు పడుతూ చెప్పేశాడు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
తిండి మానేశారంటూ హరీష్‌తో తనూజ మాట్లాడి సమస్యను సాల్వ్ చేసింది. అలా తనూజ, హరీష్ కాస్త కూల్ అయినట్టుగానే కనిపించింది. ఇమ్ము, తనూజ, రీతూ ముగ్గురూ కూడా తమ మధ్య ఏదో దూరం పెరిగిపోయిందంటూ ఏడ్చేశారు. మీరు నాతో ఉండటం లేదు అని ఇమ్ము ఏడ్చేశాడు. ఇమ్ముని చూసి మిగిలిన ఇద్దరూ ఏడ్చేశారు. కుకింగ్ టీంలోకి సుమన్‌ను సంజనా వేసిన సంగతి తెలిసిందే. క్లీనింగ్ అనే బిగ్ బాంబ్ ఉండటంతో సుమన్ శెట్టి రెండు పనులు చేశాడు. దీంతో చివరకు సంజనా తన నిర్ణయాన్ని మార్చుకుని సుమన్ శెట్టికి కేవలం బిగ్ బాంబ్ టాస్క్‌ని మాత్రమే ఇచ్చింది.
రీతూ ఎందుకో డల్‌గా ఉందని, ఏం జరిగిందో తెలుసుకునేందుకు డీమాన్ నానా తంటాలు పడ్డాడు. తన వల్ల ఏమైనా జరిగి ఉంటుందో ఏమో అని రీతూకి సారీ చెప్పుకొచ్చాడు. కానీ రీతూ మాత్రం అసలు మ్యాటర్ చెప్పలేదు. ఎందుకు డల్‌గా ఉన్నానో కూడా తెలీదా? అంటూ డీమాన్‌తో ఆడుకుంది. ఇక రీతూ అడిగిందని సంజనా వద్ద చాక్లెట్ సంపాదించి తీసుకొచ్చి దొంగతనంగా ఇచ్చాడు డీమాన్. చాక్లెట్ సగం తిని రీతూ ఇస్తే.. ఆ ఎంగిలిని కూడా పవన్ తినేశాడు. ఇక చాక్లెట్ తెమ్మంటే తెచ్చాడు కాబట్టి.. కెప్టెన్ అవ్వు అని కూడా డీమాన్‌ను రీతూ ఎంకరేజ్ చేసింది. నా ప్రయత్నం నేను చేస్తానని డీమాన్ చెప్పుకొచ్చాడు.
Also Read- మొదటి వికెట్‌గా శ్రష్టి వర్మ అవుట్... వెళ్తూ వెళ్తూ ముగ్గురుకి షాక్... భరణికి బంపరాఫర్!
కెప్టెన్సీ టాస్క్.. అంటూ టైం మార్చుకునేందుకు బిగ్ బాస్ గేమ్ పెట్టాడు. కెప్టెన్సీ కంటెండర్స్‌గా నిలిచేందుకు కాలమా? చక్రవ్యూహమా? అని టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా రెండు టీంకు టైమర్‌ను బిగించారు. ఇందులో ఓనర్స్ టీంకు పది గంటల నుంచి, టెనెంట్స్‌కి 12 గంటల నుంచి టైమర్ స్టార్ట్ చేశాడు. చివరకు జీరో ఎవరిది ముందుగా అవుతుందో ఆ టీం విన్ అవుతుందని చెప్పాడు. సమయానుగుణంగా టాస్కులు ఇస్తానని, అందులో ఎవరు ఆడి టైమర్‌ను తగ్గించుకుంటే వాళ్లే విన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు.
Time for the ultimate captaincy war! 👁️🧨
— Starmaa (@StarMaa) September 17, 2025
Who will rise, who will fall? 🏡💥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/6PyA4aMtHa
ఈ క్రమంలో మొదటి ఛాలెంజ్ అని కాల చక్రం టాస్క్ ఇచ్చాడు. ఆ చక్రాన్ని పది మంది కలిసి పట్టుకోవాలి. ఇరు టీంలోంచి ఐదుగురు ఆల్టర్నేట్‌గా పట్టుకోవాలని చెప్పాడు. కాకపోతే ఒకే చేత్తో పట్టుకోవాలని, రెండు చేతులతో పట్టుకుంటే అవుట్ అని చెప్పాడు. ఇక ఈ టాస్కులో చివరకు ఓనర్స్ టీం గెలిచింది. ప్రియా, తనూజ ఈ టాస్కుకి సంచాలకులుగా వ్యవహరించారు. మున్ముందు ఈ ఛాలెంజ్‌లో ఏ టీం గెలుస్తుందో చూడాలి.





















