Bigg Boss 9 Telugu Today Episode - Day 9 Review: బిగ్‌బాస్ డే9 రివ్యూ... ముగిసిన సెకండ్ వీక్ నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నదెవరంటే?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ముఖ్యంగా హరీష్, భరణి, ఇమ్మానుయెల్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అసలు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందంటే..

Bigg Boss Telugu 9 - Day 9 Episode 10 Review: బిగ్ బాస్ రెండో వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఎపిసోడ్ 9లో హరీష్, ఫ్లోరాలను తనూజ నామినేట్ చేయగా.. భరణి, రీతూ చౌదరిని మనీష్ నామినేట్ చేశాడు. అంతటితో ఎపిసోడ్ 9 ముగిసింది. ఇక పదవ ఎపిసోడ్‌లో కూడా నామినేషన్స్ పర్వం కంటిన్యూ అయింది.
కళ్యాణ్‌తో ర్యాపో సరిగా లేదని, తనకు తగులుకుంటూ వెళ్లాడని నామినేట్ చేశాడు రాము రాథోడ్. రెండో పర్సన్‌గా హరీష్‌ని రాము నామినేట్ చేశాడు. పదే పదే నేను వెళ్లిపోతానని అనడం, ఫుడ్ పెట్టినా తీసుకోకపోవడం నాకు బాధ అనిపించింది. అందుకే హరీష్‌ని నామినేట్ చేశానని రాము రాథోడ్ చెప్పాడు. ఫ్లోరాని, భరణిని ప్రియా నామినేట్ చేశారు. వెళ్లిపోతానని అనడం, అన్నం తినకుండా ఉండటం వంటి కారణాలతో హరీష్‌ని రీతూ చౌదరి నామినేట్ చేసింది. వారిద్దరి మధ్య భారీగా గొడవ జరిగింది. పెద్దపెద్దగా అరుసుకున్నారు. రీతూ ఎమోషనలైంది. తన బట్టలు విసిరేసింది అని ఫ్లోరాని రెండో వ్యక్తిగా నామినేట్ చేసింది. ప్రియాని, మనీష్‌ని సుమన్ శెట్టి నామినేట్ చేశారు. సుమన్ శెట్టి తర్వాత డీమాన్ పవన్ వంతు వచ్చింది. ఫ్లోరాని, భరణిని ఆయన నామినేట్ చేశాడు. వాష్ రూమ్, థమ్సప్ ఇష్యూపై ఫ్లోరాని.. గుడ్డు విషయంలో ప్రవర్తించిన తీరుపై భరణిని నామినేట్ చేసినట్లుగా పవన్ చెప్పాడు.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
ఇమ్మానుయెల్ వచ్చేసి మనీష్, హరీష్‌లను నామినేట్ చేశాడు. హరీష్, ఇమ్ముల మధ్య పెద్ద వాగ్వాదం నడిచింది. రెడ్ ఫ్లవర్, గుండంకుల్ టాపిక్ మధ్య చాలా బిగ్గరగా ఇద్దరూ అరుసుకున్నారు. కుక్ విషయంలో ఉన్న రీజన్స్ చెప్పి ప్రియాను, డీమాన్ పవన్‌ను భరణి నామినేట్ చేశారు. అందరూ తినే ఫుడ్‌లో ప్రియా చెయ్యి పెడుతుందని భరణి అంటే, నేను పెట్టలేదని ఆమె వాదించింది. పవన్ కూడా తనూజ విషయంలో నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదు, లాస్ట్ టైమ్ సారీ చెప్పారు.. మళ్లీ సారీ చెబుతారు అని పెయింట్ పూయించుకున్నాడు. అనంతరం సోల్జర్ కళ్యాణ్ వచ్చి భరణిని, హరీష్‌ని నామినేట్ చేశారు. మీ ప్రవర్తన కరెక్ట్‌గా లేదని భరణిని, షోలో ఉండాల్సిన విధంగా ఉండటం లేదని హరీష్‌ని నామినేట్ చేసినట్లుగా పవన్ చెప్పాడు.
తనూజని, డీమాన్ పవన్‌ని ఫ్లోరా శైనీ నామినేట్ చేశారు. తనని రాంగ్‌గా అర్థం చేసుకుందని తనూజని, సంజన విషయంలో జరిగిన దానికి రియాక్టైన తీరుకు పవన్‌ని నామినేట్ చేస్తున్నట్లుగా ఆమె చెప్పింది. కపటనాటకం ఆడుతున్నారని, ఓవర్ స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారని భరణిని, ఆడవాళ్ల విషయంలో తక్కువగా మాట్లాడుతున్నాడని ఇమ్మానుయెల్‌ని హరీష్ నామినేట్ చేశారు. ఇమ్ము కూడా హరీష్‌తో వాగ్వివాదానికి దిగారు. శ్రీజ దమ్ము వచ్చేసి భరణిని, హరీష్‌ని నామినేట్ చేసింది. నాటకాలు ఆడుతున్నాడని, అబద్దాలు చెబుతున్నారని, టీమ్‌కి సపోర్ట్‌గా ఉండటం లేదని భరణిని నామినేట్ చేస్తే.. నా గేమ్ నేను ఆడినందుకు నన్ను టార్గెట్ చేస్తూ మాటలన్నందుకు హరీష్‌ని నామినేట్ చేశానని చెప్పింది.
ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు భరణి, హరీష్, ఫ్లోరా శైనీ, మనీష్, ప్రియా, పవన్.. అని చెబుతూ, ఇంటి కెప్టెన్ అయిన కారణంగా సంజనకు బిగ్ బాస్ ఓ ప్రత్యేక అధికారం ఇచ్చారు. ఈ స్పెషల్ పవర్‌ని ఉపయోగించి ఒకరిని నేరుగా ఇంటి నుంచి పంపేందుకు నామినేట్ చేయాలని చెప్పారు. సంజన వచ్చేసి సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. తన దగ్గర నుంచి ఎలాంటి ఎమోషన్స్ రాకపోవడం బ్యాడ్‌గా ఫీలవుతున్నానని సంజన రీజన్ చెప్పింది. మీరు చెప్పిన రీజన్ కరెక్ట్‌గా లేదని, పెయింట్ రాయించుకోనని సుమన్ శెట్టి వాగ్వివాదానికి దిగారు. ఎందుకు ఫైర్ అవుతున్నారని సంజన అడిగినా, తన రీజన్ తను చెప్పాడు. ఫైనల్‌గా పెయింట్ రాయించుకున్నాడు.
అనంతరం.. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు భరణి, హరీష్, ఫ్లోరా శైనీ, మనీష్, ప్రియా, పవన్, సుమన్ శెట్టి. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. ఈ నామినేషన్స్ చూస్తే.. కావాలనే భరణిని, ఇమ్మానుయెల్‌ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది. హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన వీరిని త్వరగా బయటికి పంపాలని అందరూ ప్లాన్ చేసి మరీ నామినేట్ చేశారనేది ఈ ఎపిసోడ్ చూస్తుంటే తెలుస్తోంది. మరి ఈ వారం నామినేట్ అయిన ఏడుగురులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాల్సి ఉంది.
Also Read- మొదటి వికెట్‌గా శ్రష్టి వర్మ అవుట్... వెళ్తూ వెళ్తూ ముగ్గురుకి షాక్... భరణికి బంపరాఫర్!





















