అన్వేషించండి

Bigg Boss 8 : కొత్త చీఫ్‌గా 'కిర్రాక్' సీత - ఇక నుంచి నిఖిల్‌కు చుక్కలే... ముందు నుయ్యి వెనుక గొయ్యి 

బిగ్ బాస్ సీజన్ 8లో తాజాగా కిర్రాక్ సీత కొత్త చీఫ్ కావడంతో పాటు నిఖిల్ కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. శక్తి క్లాన్ లో ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. నామినేషన్ ప్రాసెస్ మొత్తంలో యష్మి గౌడ, సోనియా మధ్య జరిగిన గొడవ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా, తాజాగా హౌస్ లో కొత్త చీఫ్ గా కిర్రాక్ సీత సెలెక్ట్ అయింది. కాకపోతే సీత చీఫ్ కావడం అన్నది నిఖిల్ కు కొత్త తలనొప్పిగా మారే ఛాన్స్ ఉంది. మరోవైపు నిఖిల్ క్లాన్ లోనే ముగ్గురు ఒకరంటే ఒకరికి పడని కంటెస్టెంట్స్ ఉన్నారు. మరి కిరాక్ సీత నిఖిల్ కి చుక్కలు చూపిస్తుందా? నిఖిల్ తన క్లాన్ లోని సభ్యులను ఎలా చూసుకోబోతున్నాడు? అనేది చూడాలి. 

కొత్త చీఫ్ గా సెలక్ట్ అయిన కిరాక్ సీత 
నామినేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కొత్త థీమ్ తో బొమ్మల టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో చివరగా ఎవరి బొమ్మ మిగిల్తే వాళ్లే చీఫ్ అని అనౌన్స్ చేశారు. యాక్షన్ ఏరియాలో మొత్తం పది మంది కంటెస్టెంట్స్ బొమ్మల్ని పెట్టారు. నిఖిల్ ఆల్రెడీ చీఫ్ కాబట్టి ఆయన బొమ్మను అక్కడ పెట్టలేదు. ఇక అక్కడ సుత్తిని ఉంచి, అబ్బాయిలు ఆ సుత్తి కోసం పోరాడాల్సి ఉంటుందని, సుత్తిని దక్కించుకున్న మేల్ కంటెస్టెంట్స్ లేడీ కంటెస్టెంట్స్ లో ఎవరికి కావాలంటే వాళ్లకు ఆ సుత్తిని ఇవ్వచ్చు అని చెప్పారు బిగ్ బాస్. సుత్తిని తీసుకున్న వాళ్లు ఇతర కంటెస్టెంట్స్ లో ఒకరి బొమ్మను పగలగొట్టి ఎందుకు పగలగొడుతున్నారు, వాళ్ళు చీఫ్ ఎందుకు కాకూడదు అనే రీజన్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ థీమ్ బేస్ చేసుకుని గేమ్ మొదలుపెట్టారు కంటెస్టెంట్స్. చివరగా కిరాక్ సీత బొమ్మ మిగలడంతో ఆమెను కొత్త చీఫ్ గా అనౌన్స్ చేశారు. దీంతో హౌస్ ప్రస్తుతం శక్తి క్లాన్, కాంతార క్లాన్ అంటూ రెండు టీమ్స్ గా విడిపోయారు హౌస్ మేట్స్.

Read Also : Director G Mohan Arrested: ప్రసాదంలో గర్భ నిరోధక మాత్రలు కలపండి... కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ అరెస్ట్  

శక్తి క్లాన్లో నిఖిల్ చీఫ్ కాగా... సోనియా, పృథ్వి, మణికంఠ, యష్మి గౌడ క్లాన్ సభ్యులుగా ఉన్నారు. అయితే కాంతారా క్లాన్లో కిరాక్ సీత చీఫ్ కాగా... ప్రేరణ, నబిల్ అఫ్రిది, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ, నైనిక సభ్యులుగా ఉన్నారు. ఈ రెండు టీంలను గమనిస్తే నిఖిల్ టీంలో మాత్రం ఒకరంటే ఒకరికి పడని కంటెస్టెంట్స్ ఏకంగా ముగ్గురు ఉన్నారు. యష్మి గౌడ, సోనియా ఆకుల, నాగ మణికంఠ ముగ్గురూ నిఖిల్ టీమ్ లోనే ఉన్నారు. యష్మి గౌడ ప్రతి వారం నామినేట్ చేస్తానంటూ శపథం చేసిన మణికంఠ, చిన్నోడు - పెద్దోడికి తల్లి చెల్లి అంటూ సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేస్తూ, వాళ్లను వాడుకుంటున్నావు అంటూ ఆమె నామినేట్ చేసిన సోనియా కూడా ఇదే టీంలో ఉంది. ఇలా యష్మికి ఇద్దరితోనూ పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేటంత గొడవలు ఉన్నాయి. మరి వీళ్ళు అసలు కలిసికట్టుగా గేమ్ ఎలా ఆడతారు? నిఖిల్ వీళ్ళని ఎలా మేనేజ్ చేస్తాడు? తనకు రెడ్ ఎగ్ ఇవ్వనందుకు నిఖిల్ పై అలిగిన సీత అతనికి టఫ్ పోటీని ఇవ్వగలుగుతుందా? అనేది ముందు ముందు చూడాల్సిందే.

Read Also : Bigg Boss News: బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ హీరోయిన్ల ఎంట్రీ... మహేష్ బాబు మరదలు కూడా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Embed widget