అన్వేషించండి

Director G Mohan Arrested: ప్రసాదంలో గర్భ నిరోధక మాత్రలు కలపండి... కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ అరెస్ట్  

ఇప్పటికే ఓ వైపు తిరుపతి లడ్డూ వివాదం సంచలనం సృష్టిస్తుంటే, మరోవైపు పళని ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుపతి లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రతిష్టాత్మక దేవాలయం గురించి వివాదాస్పద కామెంట్స్ చేసిన దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఆ డైరెక్టర్ ఎవరు? అతను ఏం చేశాడు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రసాదంలో గర్భనిరోధక మాత్రలు 
తమిళ డైరెక్టర్ జి మోహన్ రీసెంట్ గా ఓ వీడియోలో డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ "ఓ ప్రముఖ గుడిలో పంచామృతాన్ని ప్రసాదంగా ఇస్తారు. అయితే అందులో నపుంసకత్వానికి దారి తీసే మాత్రలను కలిపారని నేను విన్నాను. ఆ వార్తను బయటకు రాకుండా దాచి, పంచామృతాన్ని కూడా పారబోశారు. మనం ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు. అయితే దాని గురించి సరైన ఎక్స్ప్లనేషన్ మాత్రం ఇవ్వలేదు. అక్కడ పని చేసే వారు ద్వారా తెలిసింది ఏంటంటే పంచామృతంలో గర్భినిరోధక మాత్రలు కలిపారు. హిందువులపై అటాక్ చేయడానికే ఈ పన్నాగం పన్నారని తెలిసింది" అంటూ షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పిన గుడి మరేదో కాదు తమిళనాడులోనే అత్యంత పాపులర్ అయిన పళని అరుల్మికు తాండాయుతపాణి ఆలయం. అందులో ప్రసాదంగా పంచే పంచామృతం చాలా ఫేమస్. అలాంటిది ఈ ప్రముఖ ఆలయంలోని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు అంటూ అతను చేసిన ఆరోపణలు తమిళనాడుతో పాటు ఒక్కసారిగా దేశాన్ని నివ్వెరపోయేలా చేశాయి. ఇక మోహన్ కామెంట్స్ పై వివాదం చెలరేగుతుండగా, తాజాగా తమిళనాడు పోలీసులు చెన్నైలోని రాయపురంలో ఉన్న అతని నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ ను తిరుచ్చికి తరలిస్తుండగా, మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివాదం గురించి తమిళనాడు హిందూ మత ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ "పళని ఆలయం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ పంచామృతం గురించి తప్పుగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read Also : Bigg Boss 8 Telugu Day 23 Promo: నేను కావాలంటే నిఖిల్‌నే చూస్తా... సోనియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన యష్మి గౌడ

మోహన్ తమిళ దర్శకుడు. 2016లో 'పజయ వన్నారపెట్టై' అనే చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత 2020లో 'ద్రౌపది' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. అది బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడంతో డైరెక్టర్ గా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత మోహన్ రుద్రతాండవం, బకాసురన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన పెద్దగా తెలియదు గానీ తమిళ తంబీలకు మాత్రం తెలిసిన ముఖమే. 

దేవుడి ప్రసాదం చుట్టే రాజకీయం
తెలుగు రాష్ట్రాలలో తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అనే విషయం బయట పడటంతో ఒక్కసారిగా శ్రీవారి భక్తులందరూ ఉలిక్కిపడ్డారు. అప్పటి నుంచే దేవుడి ప్రసాదం చుట్టే రాజకీయం నడుస్తోంది. తిరుపతి కల్తీ లడ్డూ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను దెబ్బతీసే పని చేసింది ఎవరో తెలుసుకోవాలంటూ సిట్ కు ఇప్పటికే బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలోనే లడ్డూ వివాదంపై పలువురు సీనియర్ సెలబ్రిటీలు ఎవరికి నచ్చినట్టుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వివాదంలో వేలు పెట్టిన సెలబ్రిటీల మెడకే కొత్త వివాదం చుట్టుకుంటుండడం గమనార్హం. ఇప్పటికే స్టార్ హీరో కార్తీ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మరోవైపు ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా మారుతోంది పరిస్థితి. ఇక ఇప్పుడేమో తమిళ దర్శకుడి అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. 

Read Also : Bigg Boss 8 Telugu Day 23 Promo 2 : చీఫ్ టాస్క్ తో అగ్నికి ఆజ్యం పోసిన బిగ్ బాస్... కొత్త చీఫ్ ఎవరంటే? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget