Bigg Boss News: బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ హీరోయిన్ల ఎంట్రీ... మహేష్ బాబు మరదలు కూడా
Bigg Boss 18: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు, నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతోంది అంటూ టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ 18లోకి ఎంట్రీ ఇవ్వనున్నది ఎవరో తెలుసుకుందాం.
Bigg Boss 18 News Updates: తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే 23వ రోజుకు చేరుకుంది. ఇప్పటిదాకా వచ్చిన గత 7 సీజన్లకు కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ షో టిఆర్పి రేటింగ్స్ పరంగా ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. అయితే బిగ్ బాస్ షో అనేది కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా ప్రసారమవుతోంది. అందులోనూ హిందీ బిగ్ బాస్ ఇప్పుడు 18వ సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే హిందీ బిగ్ బాస్ సీజన్ 18 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో మహేష్ బాబు మరదలు కూడా ఉంది అంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోకి మహేష్ బాబు మరదలు
సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హిందీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన రెమ్యూనరేషన్ కూడా సీజన్ సీజన్ కు ఒకసారి డబుల్ అవుతుంది. ఇక హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలో కూడా నిర్వాహకులు ఎంతో ప్లాన్ చేసి మరీ సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ మంచి క్రేజ్ ఉన్న యాక్టర్స్ హౌస్ లోకి అడుగు పెడతారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 18 లో మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతోంది అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
మహేష్, నమ్రత ఫ్యాన్స్ సపోర్ట్
నమ్రత శిరోద్కర్ లాగే గతంలో శిల్పా శిరోద్కర్ కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. తెలుగులో కూడా ఓ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీకి టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదు. ఇక పెళ్లయ్యాక సేమ్ తన సోదరీ నమ్రతాలాగే శిల్పా కూడా పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇన్నాళ్లు కేవలం ఫ్యామిలీకి టైం కేటాయించి గత 10 ఏళ్ల నుంచి సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటూ వస్తున్న శిల్పా చాలా ఏళ్ల తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టనుంది అంటూ వార్తల్లో నిలిచింది. అలాగే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ అమ్మడు. ఇక తాజా రూమర్ల నేపథ్యంలో శిల్పా బిగ్ బాస్ 18లో హౌస్ లోకి అడుగు పెట్టి, ఆ తర్వాత యాక్టింగ్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనక జరిగితే శిల్పాకు అటు నమ్రత ఫ్యాన్స్ తో పాటు ఇటు మహేష్ బాబు అభిమానుల నుంచి గట్టి సపోర్ట్ దొరుకుతుంది.
బిగ్ బాస్ హౌస్ లోకి మాజీ హీరోయిన్లు
సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి భాష ఏదైనా సరే సీరియల్ యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఫామ్ కోల్పోయిన హీరోలు లేదా హీరోయిన్లు అడుగు పెడతారు. కానీ హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం తెలుగు మాజీ హీరోయిన్లు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. శిల్పా శిరోద్కర్ తో పాటు టాలీవుడ్ కు సుపరిచితురాలైన సమీరా రెడ్డి, అనిత అనే మరో హీరోయిన్ కూడా బిగ్ బాస్ లో అడుగు పెట్టబోతున్నారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ పుకార్లు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే బిగ్ బాస్ సీజన్ 18 కంటెస్టెంట్స్ లిస్ట్ అఫిషియల్ గా బయటకు వచ్చేదాకా ఆగాల్సిందే.