Bigg Boss Telugu Season 8: నిఖిల్ నిజ స్వరూపం ఇదే... నోరు జారిన గౌతమ్... నబిల్, ప్రేరణ చేసిన త్యాగం
Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారం ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లోకి వచ్చారని బిగ్ బాస్ ప్రకటించాడు.

Nikhil Vs Gowtham And Nabeel And Prerana Sacrifice: బిగ్ బాస్ ఇంట్లో పద్నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ అనేది పెట్టలేదు. ఫైనలిస్ట్ అవినాష్ తప్ప మిగిలిన వారంతా నామినేషన్‌లోకి వచ్చారు అని బిగ్ బాస్ తెలిపాడు. అయితే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్ల ఫోటోలతో ఫ్రేములను పెట్టాడు. అందులో చివరి వరకు ఎవరి ఫ్రేమ్ కాలిపోకుండా ఉంటుందో వాళ్లే సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు అని అన్నారు. ఈ క్రమంలో అవినాష్ వచ్చి.. విష్ణు ప్రియను రేసు నుంచి తప్పించాడు. ఇంత వరకు ఎక్కువ టాస్కులు ఆడలేదని కారణాలు చెప్పాడు.
ఆ తరువాత విష్ణు వచ్చి గౌతమ్‌ను తీసేసింది. తనతో ఎక్కువగా ఇంటరాక్ట్ కాలేదని పిచ్చి కారణం చెప్పి తప్పించింది. ఆ తరువాత గౌతమ్ వచ్చి నిఖిల్‌ను తీసేశాడు. నామినేషన్స్‌లో సరైన కారణాలు చెప్పడు అని అన్నాడు. నీ గేమ్ కూడా నాకు తెలుసు.. నువ్వు ఫ్రెండ్ అంటూనే వాళ్లతో ఆడుకుంటావ్ అని గౌతమ్‌ని నిఖిల్ అంటే.. నువ్వు యష్మీని వాడుకున్నావ్ అని గౌతమ్ నోరు జారాడు. అలా ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. నిఖిల్ ఇన్ని రోజులు కనిపించని కొత్త యాంగిల్‌ను బయటకు తీసి మాట్లాడాడు.
Also Read: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ 89 రివ్యూ: సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
ఇన్ని రోజులు ఇలా మాట్లాడలేదు కదా.. అది నిజమా? ఇది నిజమా? అంటూ నిఖిల్‌ను గౌతమ్ ఎక్స్ పోజ్ చేసే ప్రయత్నం చేశాడు. మూసుకొని కూర్చో అంటూ నిఖిల్ మీద గౌతమ్ నోరు జారాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. మూసుకుని కూర్చో అని అన్నందుకు నిఖిల్‌కు సారీ చెప్పాడు గౌతమ్. ఆ తరువాత నిఖిల్ వచ్చి రోహిణిని తీసేశాడు. ఇంత వరకు నామినేట్ కాలేదు కదా.. నాకు నబిల్, ప్రేరణలను టాప్ 2లో చూడాలని ఉందని సేఫ్ కారణాలు చెప్పాడు. ఇలా సేఫ్ కారణాలు చెప్పుకుంటూ పోతాడు అని నిఖిల్ గురించి రోహిణి మాట్లాడింది.
చివరకు మిగిలిన నబల్, ప్రేరణలకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చింది. విన్నర్ ప్రైజ్ మనీలోంచి గరిష్టంగా పదిహేను లక్షలు వాడుకుని ఇమ్యూనిటీని కొనుక్కోమని బ్లాంక్ చెక్స్ ఇచ్చాడు. అందులో నబిల్ పది హేను లక్షలు రాశాడు. ప్రేరణ నాలుగున్నర లక్షలు రాసింది. కానీ కంటెస్టెంట్లందరూ కలిసి ఆ ఇద్దర్నీ కన్విన్స్ చేసుకోమని అన్నాడు. అలా అందరూ కలిసి మాట్లాడటంతో నబిల్, ప్రేరణలను ఆ ఇమ్యూనిటీని కొనుక్కోకుండా త్యాగం చేశారు. కష్టపడి సంపాదించిన డబ్బుని వాడుకోలేం అని నబిల్, ప్రేరణ అన్నారు. అలా మొత్తానికి ఈ వారం అవినాష్ తప్పా అందరూ నామినేషన్స్‌లోకి వచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

