అన్వేషించండి

Bigg Boss Telugu Season 8 : ఆట కంటే మాటే ముఖ్యమన్న నబిల్.. యష్మీ రంగు బయటపెట్టిన నాగ్.. ప్రేరణ డేటింగ్ ముచ్చట్లు

Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో9 వ వారంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, తిట్టుకోవడం తరుచుగా జరిగింది. ప్రేరణ మాటలు, గౌతమ్ వ్యాఖ్యలు, నిఖిల్ ఆట , యష్మీ మాటపై నాగార్జున కౌంటర్లు వేశాడు

Nagarjuna About Yashmi Flips And Prerana Gowtham Bad Words Nabil Giveup Game:

బిగ్ బాస్ ఇంట్లో తొమ్మిదో వారంలో నానా రచ్చ జరిగింది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, తిట్టుకోవడం అనేది తరుచుగా జరిగింది. తొమ్మిది వారంలో జరిగిన నామినేషన్ గొడవలు, మెగా చీఫ్ టాస్కుల్లో జరిగిన గొడవల గురించి నాగ్ మందలించాడు. ప్రేరణ మాటలు, గౌతమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నిఖిల్ ఆడిన తీరు, యష్మీ మాటలు మార్చిన విధానం, నయని ఏడ్పుల గోల మీద ఇలా అన్నింటి గురించి నాగార్జున కౌంటర్లు వేశాడు. ఈ శనివారం ఎపిసోడ్‌లో హౌస్ అంతా వేడెక్కి పోయినట్టుగా అనిపించింది.

శుక్రవారం ఎపిసోడ్‌ అంటూ నాగార్జున చూపించిన పుటేజ్‌లో ప్రేరణ డేటింగ్ వ్యవహారం బయట పడింది. కాలేజ్‌లో ఉన్న టైంలో ఫ్రెండ్స్ అని, ఏడేళ్లు డేటింగ్ చేశామని, తన భర్త తన కంటే ఏడు నెలలు చిన్న వాడు అని ప్రేరణ చెప్పింది. డేటింగ్ అంటే ఏంటి? ఏం చేస్తారు? అని తెలియనట్టుగా అవినాష్, తేజ అడిగారు. డేటింగ్ అంటే ముద్దులు పెట్టుకుంటారు? మీకు అవసరమా? అని ప్రేరణ నవ్వేసింది. పార్కుల వెంబడి చాలా తిరిగామని తన ప్రేమ కథను చెప్పింది ప్రేరణ.

ఇక నాగార్జున కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చే పని పెట్టుకున్నాడు. పుడింగి పదంతో ప్రేరణను రోస్ట్ చేయడం ప్రారంభించాడు. అది అవమానించినట్టుగా ఉంది.. అలాంటి పదాలు ఎందుకు వాడుతావ్.. నిన్ను ఎవరైనా ఒక్క మాట అంటే ఫైర్ అవుతావ్.. నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు అనొచ్చా? నిఖిల్ కూడా ఎఫ్ వర్డ్ పెట్టి తిట్టావ్ అంటూ ప్రేరణ మీద మండి పడ్డాడు నాగ్. ఆట బాగానే ఉంది కానీ మాటలే బాగా లేవు అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

నిఖిల్ ఆట బాగానే ఉంది.. అంత అగ్రెషన్ ఎందుకు? ఇన్ని రోజు కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నావ్.. ఎందుకు అంత ఘోరంగా ఆడావ్.. గౌతమ్ ఏదో సైలెంట్‌గా అన్నాడని ఫీల్ అయ్యావా? అంటూ గౌతమ్ వీడియోని ప్లే చేసి చూపించాడు నాగార్జున. అయితే గౌతమ్ మాత్రం తన వర్షెన్‌ను వినిపించాడు. తాను ఏ ఉద్దేశంతో ఏ బూతుని కూడా వాడలేదు అని గౌతమ్ అన్నాడు. తాను తప్పు చేశానని నిరూపిస్తే బయటకు వెళ్తానని గౌతమ్ అన్నాడు. కానీ కంటెస్టెంట్లకు, స్టూడియో ఆడియెన్స్‌కు తప్పుగానే అనిపించింది అంటూ గౌతమ్‌కు కౌంటర్ వేశాడు.

నీ ప్రాబ్లం ఏంటి? అక్కా అంటూ యష్మీ గురించి నాగ్ స్పెషల్‌గా క్లాస్ పీకాడు. మధ్యలోకి ఎందుకు దూరుతున్నావ్.. అలా వెళ్తున్నావ్ కాబట్టే గొడవలు అవుతున్నాయ్ అంటూ గౌతమ్‌కి సపోర్ట్‌గా నాగ్ మాట్లాడాడు. నువ్వు కూడా తమ్ముడు అని అన్నావ్ కదా?.. అసలు ఎల్లో కార్డు రాగానే గౌతమ్‌ని ఎందుకు తీశావ్? అని అడిగాడు నాగ్. ఆట బాగా ఆడలేదనిపించింది.. అందుకే తీసేశామ్ అని యష్మీ చెప్పింది. కానీ నాకు మాత్రం వేరే కారణాలు చెప్పింది అంటూ గౌతమ్ తన వర్షన్ వినిపించాడు. ఇలా ఒక్కొక్కరి ముందు ఒక్కో మాట చెబితేనే ఫ్లిప్ స్టార్ అని అంటారంటూ యష్మీ మీద కౌంటర్ వేశాడు. ఆడియెన్స్ కూడా నీ గురించి అలానే అనుకుంటున్నారు అని స్టూడియో‌లోని ఆడియెన్ మాటల్ని వినిపించాడు నాగ్. తప్పుని కవర్ చేసేందుకు యష్మీ ఏడుస్తుందని ఆడియెన్ అనడంతో ఆమె బాగా హర్ట్ అయినట్టుగా కనిపించింది.

నయని ఏడ్పుల మీద కూడా నాగ్ కౌంటర్లు వేశాడు. ప్రతీసారి అదే ఏడ్పు.. నీ ఏడ్పులకు విలువ లేకుండాపోతోందని నాగ్ కౌంటర్లు వేశాడు. అవినాష్‌కు మాట ఇచ్చావ్ అని ఆట ఆడలేదా? అని నబిల్‌ను అడిగాడు.ఆట ముఖ్యమా? మాట ముఖ్యమా? అని అంటే.. మాటే ముఖ్యం అని నబిల్ అన్నాడు.నీ కోసం నువ్వు ఆడాలి.. అంటూ నబిల్‌కు సలహా ఇచ్చాడు నాగ్. హరితేజ బాగానే ఆడిందని మెచ్చుకున్నాడు. మెగా చీఫ్ అయితే ఆటలు ఆడవా? అని విష్ణుకి కౌంటర్లు వేశాడు నాగ్. పృథ్వీ, నయని, రోహిణి ఒక్క టాస్క్ కూడా గెలవలేదు అని కౌంటర్లు వేశాడు. టేస్టీ తేజ చాలా బాగా ఆడాడు అని మెచ్చుకున్నాడు. ఇక ఈ శనివారం ఎపిసోడ్‌లో టేస్టీ తేజ సేఫ్ అయినట్టుగా చెప్పేశాడు. సీజన్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయిపోయారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Embed widget