అన్వేషించండి

Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!

Smartphone Security Tips: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్ ఉందేమో అని మీకు డౌట్‌గా ఉందా? అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే స్మార్ట్ ఫోన్‌లోని మాల్‌వేర్‌ని సులభంగా డిటెక్ట్ చేసి డిలీట్ చేయవచ్చు.

Smartphone Malware: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ పెరుగుతున్న డిజిటల్ కార్యకలాపాలతో స్మార్ట్‌ఫోన్‌లలో మాల్‌వేర్ ప్రమాదం కూడా పెరిగింది. మాల్‌వేర్ మీ ఫోన్ పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించవచ్చు. మీకు ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించవచ్చు. ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇది తరచుగా మీకు తెలియకుండానే ఫోన్‌లో దాగి ఉంటుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ నుండి మాల్‌వేర్‌ను సులభంగా గుర్తించి, తొలగించే కొన్ని సులభమైన మార్గాలను ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాము.

మాల్‌వేర్‌ను ఎలా గుర్తించాలి?
మాల్‌వేర్ మీ ఫోన్‌లో ఉంటే అది విభిన్న లక్షణాలను చూపుతుంది. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఫోన్ స్లో అవుతుంది: ఫోన్ అకస్మాత్తుగా స్లో అవుతుంది లేదా తరచుగా హ్యాంగ్ అవుతుంది.
వేగంగా బ్యాటరీ డ్రెయిన్: బ్యాటరీ సాధారణం కంటే వేగంగా డ్రెయిన్ అవుతుంది.
అనవసరమైన యాప్‌లు కనిపిస్తాయి: మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు మీ ఫోన్‌లో కనిపిస్తాయి.
తెలియని పాప్ అప్ యాడ్లు: పాప్ అప్ యాడ్లు స్క్రీన్‌పై పదేపదే కనిపిస్తాయి.
అధిక డేటా వినియోగం: బ్యాక్‌గ్రౌండ్‌లో మొబైల్ డేటా ఫాస్ట్‌గా అయిపోతుంది.

మాల్‌వేర్ తొలగించడానికి సులభమైన మార్గాలు ఇవే...

సేఫ్ మోడ్‌ని ఆన్ చేయండి
సేఫ్ మోడ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను స్టార్ట్ చేయండి. ఇది అవసరమైన యాప్‌లను మాత్రమే రన్ అవ్వడానికి అనుమతిస్తుంది. మాల్‌వేర్‌ను గుర్తించడం సులభం అవుతుంది.

ప్రస్తుతం మనదేశంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. సైబర్ నేరాల బారిన పడ్డాక బాధ పడేకంటే... పడక ముందే జాగ్రత్త పడటం మంచిది. సైబర్ నేరాల గురించి ప్రభుత్వాలు కూడా ఎంతో అవగాహన కల్పిస్తున్నాయి. కానీ దాని కంటే ముందు మనం జాగ్రత్తగా ఉంటే 99 శాతం నేరాలను జరగకుండా ఆపవచ్చు. కాబట్టి సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

Also Read: 5000 ఎంఏహెచ్, 6000 ఎంఏహెచ్... రెండిట్లో ఏ బ్యాటరీ ఆప్షన్ బెస్ట్!

అనుమానాస్పద యాప్‌లను తీసివేయండి
మీరు ఇన్‌స్టాల్ చేయని లేదా అనుమానాస్పదంగా కనిపించే యాప్‌ల గురించి చూసుకోండి. వీటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

యాంటీవైరస్ యాప్‌ని ఉపయోగించండి
ఫ్రీ లేదా పెయిడ్ యాంటీవైరస్ యాప్‌లను ఉపయోగించండి (కాస్పెర్స్కీ, అవాస్ట్ లేదా నార్టన్ వంటివి). ఇవి మాల్‌వేర్‌ని స్కాన్ చేసి గుర్తించి, తొలగించడంలో సహాయపడతాయి.

గూగుల్ ప్లే స్టోర్ నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేయాలి
గూగుల్ ప్లే స్టోర్ కాకుండా వేరే సోర్స్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం మానుకోండి. మాల్‌వేర్‌ను నివారించడానికి ఇది సులభమైన మార్గం.

ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి (ఆఖరి ప్రయత్నంగా)
సమస్య తీవ్రంగా ఉంటే, ఫోన్‌ని ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఇలా చేయడం వలన మీ మొత్తం డేటా డిలీట్ అవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి బ్యాకప్ తీసుకోవడం మర్చిపోవద్దు. జాగ్రత్తలు తీసుకోవడం, సరైన పద్ధతులను అనుసరించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను మాల్‌వేర్ నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండండి.

Also Read: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Embed widget