అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 51 Day 50: నోరు పారేసుకుంటున్న పృథ్వీ... విష్ణు పసలేని కారణాలు - ఈ వారం ప్రేరణ టార్గెట్

Bigg Boss Telugu Season 8: 'బిగ్ బాస్' ఇంట్లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రాసెస్‌లో రోహిణి వర్సెస్ పృథ్వీ, ప్రేరణ వర్సెస్ విష్ణు, పృథ్వీ.. హరితేజ వర్సెస్ ప్రేరణ ఇలా చాలా మంది మధ్య గొడవలు జరిగాయి.

Bigg Boss 8 Telugu eighth week Nomination Process Pruthvi Vs Rohini: 'బిగ్ బాస్' ఇంట్లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రాసెస్‌లో ఒక్కొక్కరు తమ తమ వాక్చాతుర్యాన్ని బయటపెట్టేశారు. ఇక ఇందులో విష్ణు ప్రియ మాత్రం పస లేని కారణాలతో నస పెట్టింది. రోహిణి వర్సెస్ పృథ్వీ, ప్రేరణ వర్సెస్ విష్ణు, పృథ్వీ.. హరితేజ వర్సెస్ ప్రేరణ ఇలా చాలా మంది మధ్య గొడవలు జరిగాయి. నబిల్, ప్రేరణ నామినేషన్ కాస్త సీరియస్‌గా, కాస్త ఫన్నీగా సాగింది. ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.

మెగా చీఫ్ అయిన గౌతమ్‌ను నామినేట్ చేయడానికి వీల్లేదు అని బిగ్ బాస్ తెలిపాడు. నామినేషన్ షీల్డుని నచ్చిన వారికి ఇవ్వమని గౌతమ్‌కు బిగ్ బాస్ చెప్పాడు. దీంతో ఆ షీల్డుని హరితేజకు ఇచ్చాడు. హరితేజ వద్ద ఆ షీల్డు ఉండటంతో.. ఆమెను నామినేట్ చేసిన ప్రతీ సారి ప్రైజ్ మనీ నుంచి యాభై వేలు తగ్గుతూ వస్తుందని బిగ్ బాస్ చెప్పాడు.

ఈ నామినేషన్ ప్రాసెస్‌ను విష్ణు స్టార్ట్ చేసింది. ముందుగా ప్రేరణని నామినేట్ చేసింది. కిల్లర్ గర్ల్‌గా సరైన నిర్ణయం తీసుకోలేదని, ఫుడ్ విషయంలో కాస్త స్ట్రిక్ట్‌గా ఉంటున్నావ్ అని.. ఇంట్లో అమ్మానాన్నఅక్కాచెల్లి ఉంటే.. అందరూ ఒకేలా తినరు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ తింటారు అని విష్ణు ప్రియ చెప్పింది. ఇది మన సొంతిళ్లు కాదు.. ఇక్కడ అమ్మానాన్నా, అక్కాచెల్లి అని ఉండరు.. రిలేషన్ పెట్టుకోవడానికి రాలేదు ఇక్కడ.. అందరూ సమానం.. అందరికీ సమానమైన ఫుడ్ రావాలి అంటూ విష్ణు ప్రియ తెల్లమొహం వేసేలా ప్రేరణ సమాధానం ఇచ్చింది.

ఆ తరువాత నిఖిల్‌ను నామినేట్ చేసింది విష్ణు ప్రియ. గేమ్ తగ్గినట్టుగా అనిపిస్తోంది.. సిగరెట్ కోసం పాయింట్ ఇచ్చావ్ అని కారణాలు చెప్పింది. నేను సిగరెట్ కోసం ఇస్తే. నువ్వు టిఫిన్ కోసం పాయింట్ ఇచ్చావ్ కదా? అని తిరిగి ప్రశ్నించడంతో విష్ణు ప్రియ ఏం చెప్పలేక నీళ్లు నమిలేసింది. నీ నోటి ధూల వల్ల ఇబ్బంది పడ్డా అని మొదటి వారం పాయింట్ తీసుకొచ్చి మళ్లీ నామినేట్ చేసింది విష్ణు. దీంతో నిఖిల్ నవ్వుకుని వదిలేశాడు. విష్ణు అసలు ఆ ఇంట్లో ఎందుకు ఉంటోందో.. ఏం చేస్తోందో అర్థం కాకుండా ఉంది.

ఆపై రోహిణి అందుకుని నిఖిల్ ఫిజికల్‌ అవుతున్నాడని, ఎవరికి ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని కూడా ఆలోచించడం లేదని చెప్పింది. ఆ తరువాత పృథ్వీని నామినేట్ చేసింది. ఆటలు తప్ప ఇంకెక్కడా కనిపించడం లేదు.. పనులు కూడా చేయడం లేదని రోహిణి అంటే.. ఏం చేయాలి.. కామెడీ చేయాలా? అంటూ రోహిణిని తక్కువ చేసిన మాట్లాడినట్టుగా అనిపించింది. ఎదుటి వారు ఒకటి అన్నారు.. మనం రెండు అనాలి అనే ఉద్దేశం తప్పా.. కరెక్ట్‌గా మాట్లాడటం పృథ్వీకి రానట్టుగా అనిపిస్తుంది. ఓ గౌరవం అనేది ఇవ్వకుండా.. యాటిట్యూడ్ చూపిస్తూ ఎదుటి కంటెస్టెంట్లను తక్కువ చేసి చూడటం అలవాటు అయింది.

రోహిణిని కూడా అలానే చూసినట్టుగా అనిపిస్తుంది. దీంతో రోహిణి ఫైర్ అయింది. ఆ లుక్కెంటి? ఎందుకు అలా చూస్తున్నావ్? బాడీ షేమింగ్ చేస్తున్నావా? అని పృథ్వీపై మండిపడింది. బాడీ షేమింగ్ అనే పదాన్ని తీసి రోహిణి విక్టిమ్ కార్డ్ వాడినట్టుగా కూడా కనిపిస్తోంది. అలా రోహిణి పృథ్వీ మధ్య ఓ రేంజ్‌లో ఫైట్ జరిగింది. తొక్కలో నామినేషన్ అంటూ ఒకరిపై ఒకరు మాటల దాడితో రెచ్చిపోయారు. నయని వచ్చి మెహబూబ్‌ను సెల్ఫిష్‌గా ఆడావ్ అని చెప్పి నామినేట్ చేసింది. నిఖిల్ లైటర్ కోసం పాయింట్ ఇచ్చేశాడని నామినేట్ చేసింది. ఇంకో కారణం ఏదో చెప్పబోయింది. కానీ ఆ కారణం తిప్పి కోట్టేసరికి తెల్లమొహం వేసింది నయని. ఈ నామినేషన్స్‌లో విష్ణు తరువాత నయని వరెస్ట్ అనిపిస్తుంది.

హరితేజ వర్సెస్ ప్రేరణ ఫైట్ బాగానే జరిగింది. ప్రేరణని హరితేజ నామినేట్ చేస్తూ.. చేసిందల్లా రైట్ అనుకుంటావ్.. వెల్కమింగ్‌గా ఉండదు.. యష్మీ విషయంలోనూ అంతా అయ్యాక చెప్పావ్.. ఎంత కనెక్ట్ అవ్వాలని అనుకున్నా అవ్వడం లేదు.. అంటూ ఇలా కారణాలు చెప్పింది. తేజకి పాయింట్ ఇచ్చావ్.. అంటూ ఇలా హరితేజ తన రీజన్స్ చెప్పింది. అందరినీ  ఈక్విల్ చేయాలని తేజకు ఇచ్చాను.. అని ప్రేరణ చెబితే.. ఆ పాయింట్‌ను హరితేజ ఒప్పుకోలేదు. హరితేజ మాటలు ఫ్లిప్ చేస్తుంది అంటూ హరితేజ మీద కౌంటర్లు వేసింది ప్రేరణ. మెహబూబ్.. క్లాన్‌ అన్నాడు.. సెల్ఫీష్‌గా ఆడాడు..నిఖిల్‌ మాతో డీల్ పెట్టుకుంటే.. క్లాన్‌గా అని చెప్పాడు.. తెల్లారితే మాట మార్చాడు.. అంటూ హరితేజ కారణాలు చెప్పింది. బాత్రూం ఏరియాలో ఉండి ఆడాం అంటే ఎలా.. అసలు మీరు ఎక్కడ క్లాన్ కోసం ఆడారు? అంటూ మెహబూబ్ రివర్స్‌లో ప్రశ్నించాడు.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 49 రివ్యూ: ఆట వదిలేసి వెళ్లిపోయిన మణికంఠ, నయని ఏడ్పుల నస, గౌతమ్ గెలిచినా ఓడినట్టే

నబిల్ తన నామినేషన్స్ చెబుతూ.. ప్రేరణ గత వారాల్లో చేసినవన్నీ చెప్పుకొచ్చాడు.. పప్పీ టాస్క్‌లో మెగా చీఫ్ టైంలో తనను చిన్న చూపు చూసిందని, బీబీ టాస్కులో ఇమ్మెచ్యూర్ అందని ఇలా తన కారణాలు చెప్పుకొచ్చాడు. తాను కావాలని చిన్న చూపు చూడలేదని, అది తన ఉద్దేశం కాదని చెప్పింది. చివరకు మాటా మాటా పెరిగి.. ఒకరిని ఒకరు వెక్కిరించుకుంటూ కామెడీ చేసుకున్నారు. ఆ తరువాత నబిల్.. హరితేజను నామినేట్ చేశాడు.. నబిల్ ఇంకా ఓపెన అవ్వడం లేదు.. అర్థం కావడం లేదు.. క్లారిటీ లేదు.. అని అన్నావ్.. అవినాష్‌ను ఎపిసోడ్స్ అన్నీ చూసి రావాల్సింది అన్నావ్.. నువ్వు చెప్పమంటే చూడలేదు.. అక్కడ మాట మార్చినట్టు అనిపించింది అంటూ కారణాలు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వారం నామినేషన్స్‌లో అందరికీ ప్రేరణ టార్గెట్ అయినట్టుగా కనిపిస్తుంది. మంగళవారం నాడు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో ఇంకా ఎవరు ఎవరిని నామినేట్ చేసుకుంటారో చూడాలి.

Also Read: బిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 48 రివ్యూ: ఆటలో వీక్ - డ్రామాలో పీక్ - ఓట్లు వేయకండంటూ దండం పెట్టేసిన మణికంఠ - ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టాడా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు చేసిన అధికారులు
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు చేసిన అధికారులు
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Jailer 2: రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు చేసిన అధికారులు
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు చేసిన అధికారులు
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Andhra Pradesh : వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
Jailer 2: రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
రజనీకాంత్ సినిమాలో మాజీ అల్లుడి స్పెషల్ రోల్... ధనుష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్
Jagityala Politics: మాజీ ఎమ్మెల్యేకి అవమానాలు, ప్రస్తుత ఎమ్మెల్యేపై ఆరోపణలు! జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా?
మాజీ ఎమ్మెల్యేకి అవమానాలు, ప్రస్తుత ఎమ్మెల్యేపై ఆరోపణలు! జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారా?
Teenmar Mallanna : సొంత ప్రభుత్వంపై  ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి  కొరియా టూర్‌పై విమర్శలు
సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తిరుగుబాటు - ఈ సారి కొరియా టూర్‌పై విమర్శలు
Amaravati Drone Summit 2024: ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
ఐటీ మాదిరిగానే డ్రోన్ విప్లవం రాబోతోందీ- అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో చంద్రబాబు కామెంట్స్
Unstoppable 4 Promo: బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
బాలయ్య చమత్కారం, చంద్రబాబు సమయస్ఫూర్తి... తప్పు చేసినోడ్ని వదలను - 'అన్‌స్టాపబుల్ 4' ప్రోమోలో వార్నింగ్
Embed widget