బిగ్‌బాస్ 8వ సీజన్లో 8వ వారం నామినేషన్స్ లిస్ట్..
బిగ్‌బాస్‌ని కొందరు శనివారం, ఆదివారం చూస్తే.. మరికొందరు సోమవారం చూస్తారు. ఓ రకంగా సోమవారానికే డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి.
సేఫ్ అవుతాడని తెలిసినా.. సెల్ఫ్ నామినేషన్స్‌తో మణికంఠ ఆదివారం బయటకొచ్చేశాడు. దీంతో హోజ్మేట్స్కి ఎవరి నామినేట్ చేయాలో కాస్త కష్టంగానే మారింది.
గంగవ్వ కూడా నాగార్జునతో నన్ను నామినేట్ చేస్తున్నారంటూ చెప్పింది కాబట్టి.. ఈమెను కూడా కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్స్‌లోకి తీసుకురాలేదు. పైగా గంగవ్వకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.
గేమ్స్ బాగా ఆడుతోన్న.. లవ్ ట్రాక్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి గేమ్‌ని సీరియస్‌గా తీసుకోవట్లేదనేది కొందరివాదన. ఈ వారం నామినేషన్స్‌లో విష్ణు ఉంది.
తన నోటి దురుసుతో నాగార్జున నుంచి సైతం పృథ్వీ తిట్లు తినిపించుకోవాల్సి వచ్చింది. గతవారం ఇతను వెళ్లిపోతాడంటూ ప్రచారం గట్టిగా జరిగింది. ఈ వారం నామినేషన్లో కూడా ఇతన ఉన్నాడు. ప్రజలు ఏమి నిర్ణయిస్తారో.
ప్రేరణ కంబం ఎంత మంచిగా ఆడినా.. హోజ్లో ఏదో రకంగా టార్గెట్ అవుతుందనే వాదన ఉంది. కానీ ఎన్నివారాలు ఆమె లిస్ట్‌లో ఉన్న ప్రజలు ఆమెను సేవ్ చేస్తున్నారు. ఈ వారం కూడా ఈమె నామినేషన్లో ఉంది.
టాస్క్‌ల్లో నిఖిల్‌ని టాప్ 1లో ఉంటాడు. అలాగే కాంట్రవర్సీలకు కాస్త దూరంగానే ఉంటాడు. అయితే ఒక్కోసారి జరిగేవాదనల్లో ఇన్వాల్వ్ కావట్లేదంటూ నామినేషన్స్ పడ్డాయి.
క్రై బేబీగా పేరు తెచ్చుకున్న నయని పావని.. గేమ్స్‌లో చాలా బాగా ఆడుతుంది. కానీ ఎక్కువగా ఏడుస్తూ ఉండడం ఆడియన్స్‌కి నచ్చట్లేదు. ఈవారం నామినేషన్స్ బరిలో ఈమె కూడా ఉంది.
కమ్యూనిటీ పేరుతో మాట్లాడిన మెహబూబ్ కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నాడు. మరి ఈ ఇంపాక్ట్ అతనిపై ఎలా పడుతుందో చెప్పలేము.