వామ్మో అంతమందే..

బిగ్​బాస్ 8వ సీజన్​లో 7వ వారం నామినేషన్స్ లిస్ట్

Published by: Geddam Vijaya Madhuri

నామినేషన్స్ లిస్ట్

బిగ్​బాస్​ సీజన్​లో ఏడవ వారానికిగానూ నామినేషన్స్ జరిగాయి. ఈ వారం మునుపెన్నడూ లేని విధంగా కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్ లిస్ట్​ని ఇప్పుడు చూసేద్దాం.

అశ్వద్ధామ 2.0

బిగ్​బాస్ సీజన్​ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ ఈవారం నామినేషన్స్​లో ఉన్నాడు. గేమ్స్​ బాగా ఆడే ఇతను. అశ్వద్ధామ 2.0 అనే విషయంలో ఇతను బాగా ట్రిగర్ అవుతున్నాడు.

టేస్టీ తేజ..

లాస్ట్​ సీజన్​లో ఫన్ అందించిన టేస్టీ తేజ.. ఈసారి కూడా ఎంటర్​టైన్​మెంట్ అందిస్తున్నాడు కానీ.. గేమ్స్ ఆడే విషయంలో కాంప్రిమైజ్ కావొద్దంటూ అతనిని నామినేట్ చేశారు కంటెస్టెంట్లు.

హరితేజ

సీజన్ 1లో ఆల్​ రౌండర్​గా పేరు తెచ్చుకున్న హరితేజ.. ఈసారి సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉంది.

నబీల్

వరంగల్ కుర్రాడు నబీల్ తన గేమ్​తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు కానీ.. గతవారం అతని పర్​ఫార్మెన్స్ అంతగా కనిపించలేదు. దీంతో అతను కూడా నామినేషన్స్​లోకి వచ్చేశాడు.

మణికంఠ

ఎమోషనల్ స్టార్ మణికంఠ గతవారం నామినేషన్స్​ నుంచి తప్పించుకున్నాడు కానీ.. ఈవారం అతనికి నామినేషన్స్ పడ్డాయి. మరి ఈ వారం సింపతీతో గెలుస్తాడో.. ఆటతో గెలుస్తాడో చూడాలి.

నిఖిల్

నిఖిల్ గేమ్ ఇప్పుడిప్పుడే బాగా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్స్​లో తనదైన శైలిలో విజయాన్ని అందుకునే ఇతనిని కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్​ అంటూనే నామినేట్ చేశారు.

పృథ్వీ

గేమ్ విషయంలో రాజీపడనివారిలో పృథ్వీ కూడా ఒకరు. ఇతను కూడా ఈవారం నామినేషన్స్​లో ఉన్నాడు. అయితే పృథ్వీ.. విష్ణుప్రియని వాడుకుంటున్నాడనే నెగిటివిటీ సోషల్ మీడియాలో ఎక్కువైంది.

ప్రేరణ

సెటిల్​గా గేమ్​ డిస్టర్బ్ కాకుండా ఆడేవారిలో ప్రేరణ కూడా ఒకరు. ఈ భామను కూడా ఈ వారం నామినేషన్స్​లో ఉంచారు.

యశ్మీ

యశ్మీ గౌడ ఎన్నడూ లేనివిధంగా ఈ వారం తన గేమ్​ను బెటర్ చేసుకుని.. మణికంఠకు సారీ కూడా చెప్పింది. అయితే ఈవారం కూడా ఈమె నామినేషన్​ లిస్ట్​లోకి వచ్చింది.