Bigg Boss 8 Telugu Episode 49 Day 48: ఆట వదిలేసి వెళ్లిపోయిన మణికంఠ, నయని ఏడ్పుల నస, గౌతమ్ గెలిచినా ఓడినట్టే
Bigg Boss Telugu Season 8 : మణికంఠలో బిగ్ బాస్ ఆట మీదున్న నిరాసక్తతను మణికంఠ సొంత నిర్ణయంతో ఇంటి బయటకు వచ్చేశాడు. ఆట వదిలేసి క్విట్ అయ్యాడు.
Naga manikanta Self Eliminated than Gautham: బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని రూల్స్ తెలుసుకుని వస్తారు.. ఆ రూల్స్ మరోసారి గుర్తు చేస్తాను.. బిగ్ బాస్ ఇంట్లో జెండర్ పట్ల గానీ కమ్యూనిటీ పట్ల గానీ పక్షపాతం అనేది ఉండదు.. అందరూ సమానమే.. అని మెహబూబ్, నబిల్‌లకు ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగ్ పరోక్షంగా కౌంటర్లు వేశాడు.
అనంతరం.. చిత్రం భళారే విచిత్రం అనే టాస్క్ పెట్టాడు. ఇందులో సినిమా పేరు చూసి.. బొమ్మ గీస్తే.. దాన్ని మిగతా కంటెస్టెంట్లు గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్ కోసం బాయ్స్ వర్సెస్ గర్ల్స్ టీంలుగా నాగ్ విడగొట్టాడు. ఈ ఆటలో చివరకు బాయ్స్ టీం విన్ అయింది. మధ్యలో ఓ రొమాంటిక్ పాటకు విష్ణు, పృథ్వీ డ్యాన్స్ చేయాలని కోరాడు. ఇక విష్ణు అయితే పాటలో లీనమైంది. పృథ్వీ తాకగానే సిగ్గు మొగ్గలేసినట్టుంది. తెగ సిగ్గు పడిపోయింది. అదే పాటకు మళ్లీ యష్మీ, గౌతమ్‌లను డ్యాన్స్ చేయమని కోరాడు. యష్మీ కాస్త ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తోంది. ఆ తరువాత నిఖిల్ సేఫ్ అయినట్టుగా ప్రకటించేశారు.
అనంతరం కంటెస్టెంట్ల మీద వచ్చిన ఫన్నీ మీమ్స్‌ను వేసి చూపించాడు నాగ్. మణికంఠ మీద వచ్చిన రకరకాల మీమ్స్‌ను అందరూ పగలబడి నవ్వేసుకున్నారు. రోహిణి, విష్ణు ప్రియ, తేజ, నబిల్, ప్రేరణల మీద వచ్చిన మీమ్స్ చూసి అందరూ తెగ నవ్వేసుకున్నారు. ఈ సెగ్మెంట్ తరువాత హరితేజ, నబిల్ సేఫ్ అయినట్టుగా చెప్పేశారు. ఆ తరువాత టైటిల్ డెడికేషన్ అనే టాస్క్ పెట్టాడు. ఇందులో ఒక్కొక్కరికి ఫేమస్ డైలాగ్స్‌ను కంటెస్టెంట్లు డెడికేట్ చేశారు.
వాడ్నిఅ లా వదిలేయకండ్రా అనే డైలాగ్‌ను మణికి, అదంతా అప్పుడండి.. ఇప్పుడు మారిపోయా అనే టైటిల్‌ను అవినాష్‌కు, నవ్వు ఆపుకుంటున్నావ్ కదరా..ఎన్నెన్నో అనుకుంటాం.. అనే డైలాగ్స్‌లను విష్ణుకి, అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు అనే ట్యాగ్‌ని నిఖిల్‌కి డెడికేట్ చేశారు. ఇలా ఓ ఫన్నీ ఆట ఆడించాడు. దీని తరువాత పృథ్వీ సేఫ్ అయినట్టుగా ప్రకటించారు. మిగిలిన గౌతమ్, మణిల్లోంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.. అంతలోపు ఈ వీడియోని చూడండి అంటూ నాగ్ షాక్ ఇచ్చాడు.
మణికంఠలో బిగ్ బాస్ ఆట మీదున్న నిరాసక్తతను చూపించాడు. దీంతో మణికంఠ ఇంట్లో ఉంటే బెటరా? వెళ్తే బెటరా? అని కంటెస్టెంట్లను అడిగాడు నాగ్. దీంతో మెజార్టీ సభ్యుల్ని మణిని బయటకు పంపేయడమే బెటర్ అని అన్నారు. దీంతో మణిని చివరగా నాగార్జున అడిగాడు. ఉంటావా? వెళ్తావా? ఫైనల్‌గా చెప్పు అని మణిని నాగ్ అడిగాడు. అయితే నాగార్జున ముందు కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మణికంఠ బయటకు వెళ్తానని అన్నాడు. దీంతో ఆడియెన్స్ ఫలితాన్ని చూపించాడు. ఆడియెన్స్ ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ మణి సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.. ఆట వదిలేసి క్విట్ అవుతున్నాడు.. అని నాగ్ చెప్పేశాడు. దీంతో మణికంఠ సొంత నిర్ణయంతో ఇంటి బయటకు వచ్చేశాడు.
సీతను క్రై బేబీ అన్న నయని.. మణి ఎలిమినేషన్ టైంలోనూ ఏడ్చేసింది. ఈ నయని ఏడ్పుల మీద కూడా భలే మీమ్ వేశారు. సీతని క్రై బేబీ అని చెప్పి.. నయని కొత్త క్రై బేబీలా మారిపోయింది. ఇంట్లోంచి బయటకు వెళ్లే టైంలో మణి అందరికీ తగిన సలహాలు ఇచ్చాడు. మరో వైపు ఆట బాగా ఆడి.. గెలిచి.. మెగా ఛీప్‌గా గెలిచిన గౌతమ్.. ఆడియెన్ ఓట్లలో వెనక బడి ఓడిపోయాడు. దీంతో గౌతమ్ పూర్తిగా డల్ అయిపోయాడు.