అన్వేషించండి

Bigg Boss 8 Telugu Episode 48: ఆటలో వీక్ - డ్రామాలో పీక్ - ఓట్లు వేయకండంటూ దండం పెట్టేసిన మణికంఠ - ఎలిమినేషన్‌ను ముందే పసిగట్టాడా?

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 శనివారం ఎపిసోడ్‌లో కొందరు కంటెస్టెంట్స్‌తో నాగార్జున కొంచెం గట్టిగా మాట్లాడారు.

Bigg Boss 8 Telugu Nagarjun Warns Naga Manikanta: బిగ్ బాస్ ఇంట్లో ఉండటం అంత సులభం ఏమీ కాదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో మైండ్ సెట్ల మధ్య బతకాల్సి వస్తుంది. మణికంఠ అయితే బిగ్ బాస్ ఇంట్లో ఉండలేను బాబోయ్ అని దండం పెట్టేస్తున్నాడు. నాకు ఓట్లు వేయకండ్రా బాబోయ్ అని వేడుకున్నాడు. ఇప్పటి వరకు ఉన్నది చాలు.. నేర్చుకున్నది చాలు.. ఇంకా ఇక్కడే ఉండి తప్పులు చేయాలని అనుకోవడం లేదు అంటూ మణికంట రియలైజ్ అయ్యాడు. ఇక మణికంఠ ఈ వారం ఎలిమినేట్ కాబోతోన్నాడు. ఈ విషయం మణికంఠకు తెలియదు. కానీ మణి కూడా బయటకు వచ్చేయాలనే అనుకుంటున్నాడు. మరి ఎలిమినేట్ అయ్యాక మణి ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. శనివారం ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

మరో వైపు గౌతమ్ పులిహెర కలిపేందుకు ప్రయత్నించాడు. యష్మీతో గౌతమ్ కలిపిన పులిహోర చూస్తుంటే ఏదో లవ్ ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా ఉంది. నాకు 28 ఏళ్లు.. నాకు కూడా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి.. గేమ్‌ని గేమ్‌లా చూస్తా.. ఫ్రెండ్ షిప్‌ని ఫ్రెండ్ షిప్‌లానే చూస్తా.. నీ మీద ప్రేమ, క్రష్ ఏర్పడింది.. ఇది మున్ముందు గ్రో అవుతదా? లేదా? అన్నది కాలం చెబుతుంది..ఫీలింగ్ ఇద్దరి సైడ్ నుంచి ఉండాలి.. బయటకు వెళ్లిన తరువాత కూడా చాలా లైఫ్ ఉంది మనకు..ఇక్కడ నువ్వు నాకు  అందరిలోకెల్లా స్పెషల్.. క్యూట్.. అందుకే నిన్ను ఫ్లర్ట్ చేస్తా..ఇది నా జెన్యూన్ ఫీలింగ్.. అని యష్మీతో గౌతమ్ అన్నాడు.

గౌతమ్ చెప్పిన దానికి తలాడించింది యష్మీ. నీకు నచ్చింది నువ్వు చేసుకో.. నాకు తప్పుగా అనిపించినప్పుడు చెబుతా.. అని యష్మీ చెప్పేసింది. ఇప్పుడు మనం గుడ్ ఫ్రెండ్స్..అంటూ యష్మీతో ట్రాక్ స్టార్ట్ చేశాడు గౌతమ్. ఇదే విషయాన్ని వెళ్లి పృథ్వీ, విష్ణులతో పంచుకుంది యష్మీ. నిఖిల్‌ను తాను డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదంటూ.. నిఖిల్ మీదున్న ప్రేమను యష్మీ చెప్పకనే చెప్పేసింది. ఆ తరువాత ఇంట్లో శాస్త్రి బామ్ యాడ్ జరిగింది.

ఇక నాగార్జున వచ్చి బీబీ టైమ్స్ అంటూ ఒక్కో కంటెస్టెంట్‌కు సరిపడా హెడ్ లైన్స్‌ను పెట్టాడు. గౌతమ్‌కు కండబలం ఎక్కువ.. బుద్దిబలం తక్కువ.. చేయి కలుపుతాడు.. వెన్నుపోటు పొడుస్తాడు అని టైటిల్స్ ఇచ్చాడు. ఇందులో మొదటిది కాస్త రైట్ అని కంటెస్టెంట్లు యస్ బోర్డులు ఎత్తారు. ఆ తరువాత నిఖిల్, గౌతమ్‌ల ఫైటింగ్ వీడియో వేసి హెచ్చరించాడు. ఇదేం ఆట.. ఉన్మాదుల్లా ఆడారు.. గాయాలు కాకుండా చూసుకుని ఆట ఆడుకోండి అంటూ సలహా ఇచ్చాడు నాగ్

ఆ తరువాత నిఖిల్‌కు నిన్న హీరో.. నేడు జీరో అని ట్యాగ్ ఇస్తే.. అందరూ యస్ అని బోర్డులు ఎత్తారు. హరితేజను నిల్చోబెట్టి.. నిన్న ఫైర్.. నేడు ఫ్లవర్.. చెప్పేది కొండంత చేసేది చీమంత అని టైటిల్స్ ఇస్తే.. ఇంటి సభ్యులు రెండో ట్యాగ్ కరెక్ట్ అన్నారు. కానీ నాగ్ మాత్రం ఫస్ట్‌ టైటిల్ కరెక్ట్ అని అన్నాడు. ఫస్ట్ సీజన్‌లో కనిపించిన ఫైర్ ఇప్పుడు కనిపించడం లేదని, కిల్లర్ గర్ల్స్‌గా ఉన్నప్పుడు సొంతంగా ఆడుకోక.. వేరే వాళ్లు హ్యాట్ ఇస్తే ఎందుకు తీసుకున్నావ్ అంటూ హరితేజను మందలించాడు నాగ్.

పృథ్వీ అందరినీ అగౌరవపరుస్తాడు. కానీ గౌరవం కోరుకుంటాడు అని ట్యాగ్ ఇస్తే.. అందరూ యస్ అని బోర్డులు ఎత్తాడు. రా, ఏరా అని ఇష్టమొచ్చినట్టు నోరు జారడం మీద ఫైర్ అయ్యాడు. నీకు అవతలి వాళ్లు క్లోజ్ ఫ్రెండ్ అయితే ఏదైనా వాడొచ్చు. అవినాష్ వద్దని చెబుతున్నా కూడా పదే పదే ఎందుకు వాడుతున్నావ్? అని మందలించాడు. ప్రేరణను ఎందుకు అలా టార్గెట్ చేశావ్ అని అడిగాడు. రివేంజ్ అని చెప్పాడు. ఆమె నామినేట్ చేసిన రీజన్ నాకు నచ్చలేదు అందుకే రివేంజ్ కోసం అలా చేశానని అన్నాడు. పృథ్వీ గడ్డం మీద కూడా చాలానే చర్చలు జరిగాయి. ఎంత ప్రైజ్ మనీ పెంచుతానని అన్నా కూడా గడ్డం తీసుకోలేదు. పైగా మూడు వారాల ఇమ్యూనిటీ ఇస్తానని అన్నా కూడా గడ్డం తీసుకోలేదు.

అవినాష్ విషయంలో పైకి నవ్విస్తా.. వెనక ప్లాన్ వేస్తా అనే ట్యాగ్‌ని అందరూ యస్ అని చెప్పారు. ఆట బాగా ఆడావ్ అని అవినాష్‌ను మెచ్చుకున్నాడు. రెండు సార్లు నబిల్ వద్ద ఛార్జింగ్ దొంగతనం చేయడం బాగుందని అన్నాడు. ఇక జుట్టుని కత్తిరించుకున్నావ్.. ఆట బాగా ఆడావ్.. అందుకే నీకు సర్ ప్రైజ్ అంటూ.. అతని భార్య వాయిస్ మెసెజ్‌ను వినిపించాడు నాగ్. అశ్వథ్థామ 2.ఓ కాదు.. 3.ఓ అని గౌతమ్ ఆట తీరుని పొడిగి.. ఇంకోసారి అతడ్ని ట్రోల్ చేయకు అని అవినాష్‌కు వార్నింగ్ ఇచ్చాడు నాగ్.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 47 రివ్యూ: నయని నస... టాస్కుల్లో మణి ప్రయాస - ఛార్జింగ్ కొట్టేసిన తేజ అండ్ మెహబూబ్

యష్మీ కోసం.. ముందు ఒక మాట. వెనక వేరే ఆట.. అంటూ ఓ ట్యాగ్ ఇచ్చాడు. ప్రేరణ విషయాన్ని గుర్తు చేసుకుని చాలా మంది యస్ అనే బోర్డులు ఎత్తారు. యష్మీని ఫ్లర్ట్ చేస్తున్నాడని గౌతమ్‌ని లేపి మరీ అక్కడ వారిద్దరి ట్రాక్ పొడిగించాలని నాగ్ ప్రయత్నించాడు. ఆమె వేసుకున్న డ్రెస్ బాగుంది.. క్యూట్‌గా ఉందని.. అందరినీ నవ్వించేశాడు గౌతమ్. 

మణి.. ఆటలో వీక్..డ్రామాలో పీక్.. కన్నీరు మాత్రమే నా ఆయుధం.. అనే ట్యాగులని ఇచ్చాడు. దానికి మొదటి టైటిల్ కరెక్ట్ అని కంటెస్టెంట్లు యస్ అనే బోర్డులు ఎత్తారు. ఇక మణి ఆడిన ఓ ఆటను కూడా చూపించాడు. ఏ క్లాన్ కోసం నువ్వు ఆడుతున్నావ్ అని పరువు తీశాడు. నాది డ్రామా కాదు.. నా బోన్స్, నా బాడీ పెయిన్స్ ఉన్నాయి.. నా బాడీ నా కంట్రోల్లోనే లేదు.. నవ్వినా పెయిన్ వస్తోంది.. యాంగ్జైటీ పెరిగిపోయింది.. ఉండాలని ఉంది.. గెలవాలని ఉంది.. కానీ బాడీ సహకరించడం లేదు.. అని మణి అన్నాడు. మెడికల్ రూంకి వెళ్లావ్.. అన్ని రిపోర్టులు చూపించారు.. బాగున్నావ్ అని చెప్పారు.. ఇంకేంటి? అని నాగ్ అన్నాడు. నేను ఉండలేకపోతోన్నాను.. అర్థం చేసుకోండి.. ఆట ఆడటం నాకు రావడం లేదు.. డిఫెన్స్ చేయలేకపోతోన్నా.. నేను బయటకు వెళ్లేందుకు రెడీగా ఉన్నా.. అంటూ మణి నిరుత్సాహపడ్డాడు.

 తేజ.. మత్తు వదలరా.. తియ్యని మాటలు చేస్తాయి గాయాలు.. అనే ట్యాగులు సరిపోతాయని అన్నాడు. తేజ మాటలు చాలా హర్టింగ్‌గా ఉంటాయంటూ నయని వాపోయింది. గుంపులో గుర్తింపు కోరుకోకు అనే టైటిల్‌ను ప్రేరణకు సెట్ అవుద్దని అన్నారు. నయని న్యూ క్రై బేబీ అని చెప్పేశారు. మెహబూబ్ ఈ ఎనిమిదో సీజన్‌కే ఫ్లాప్ చీఫ్ అని అన్నారు. రేషన్ మొత్తం వేస్ట్ చేశావ్ అని నాగ్ మందలించాడు. గంగవ్వ మనసులో ఉన్నది చెబుతూ ముందుకు వెళ్తోందని అన్నాడు నాగ్. రోహిణి నువ్వు మనసులే కాదు ఆటలు కూడా గెలవాలి అంటూ హింట్ ఇచ్చాడు. వీకెండ్‌లో ఆట.. మిగతా రోజులు టాటా.. అంటూ విష్ణు పరువు తీశాడు నాగ్. మిగతా రోజులు కూడా ఆడు అని కౌంటర్ వేశాడు. మాటల్లో పులి.. ఆటల్లో పిల్లి అంటూ నబిల్ ఆటను ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందని హింట్ ఇచ్చాడు. అలా ఈ వీకెండ్ ఎపిసోడ్‌‌లో అయితే ప్రేరణ, తేజలు సేఫ్ అయినట్టుగా ప్రకటించాడు. ఆల్రెడీ ఈ వారం మణి ఎలిమినేట్ అయినట్టుగా లీకులు అయితే వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్‌‌లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 46 రివ్యూ: ‘హరి’కథతో మణికంఠ ఫిదా.. పాత పద్దతినే ఫాలో అయిన అవినాష్... ఈ రోజు హౌస్‌లో ఏం జరిగిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget