Bigg Boss 8 Telugu Episode 47 Day 46: నయని నస... టాస్కుల్లో మణి ప్రయాస - ఛార్జింగ్ కొట్టేసిన తేజ అండ్ మెహబూబ్
Bigg Boss Telugu Season 8 : బిగ్ బాస్ ఇంట్లో గురువారం ఎపిసోడ్‌లో టాస్క్ కంటిన్యూ అయింది. నబిల్ మాటల్లో ఉండగా.. తేజ నిద్రపోతోన్న మణి వద్ద నుంచి మెహబూబ్ ఛార్జింగ్ కొట్టేశారు.
Nayani Gets Cried and Teja And Mehaboob Battery Charged: బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం ఓవర్ స్మార్ట్ ఫోన్‌లుగా రాయల్ క్లాన్.. ఛార్జింగ్‌లు ఓజీ క్లాన్‌ను డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గురువారం నాటి ఎపిసోడ్‌లో టాస్క్ కంటిన్యూ అయింది. నబిల్ మాటల్లో ఉండగా.. తెలివిగా తేజ ఛార్జింగ్ కొట్టేశాడు. నిద్రపోతోన్న మణి వద్ద నుంచి మెహబూబ్ ఛార్జింగ్ కొట్టేశారు. లైటర్‌ను అడ్డు పెట్టుకుని రోహిణి, తేజలు ఛార్జింగ్ పాయింట్లు సంపాదించుకున్నారు. రాయల్ క్లాన్ సభ్యులు కాస్త నిజాయితీగా ఆట ఆడారు. మణికంఠ లోపలకి వచ్చి పడుకున్నా.. దాడి చేసి ఛార్జింగ్ పెట్టుకోలేదు. బయట వర్షానికి చలిలో పడుకున్న వారికి అవినాష్, తేజలు దుప్పట్లు పంచి పెట్టారు.
ఛార్జింగ్ కుండ పగలగొట్టిన కారణంగా ఓజీ క్లాన్ నుంచి ఓ సభ్యుడ్ని ఎలిమినేట్ చేయండని రాయల్ క్లాన్‌కు సూచించాడు బిగ్ బాస్. ఆ పేరుని చర్చించుకునే లోపు ఓజీ క్లాన్ బాత్రూం ఏరియాలోకి చొచ్చుకుపోయారు. దీంతో అక్కడ పెద్ద యుద్దమే జరిగింది. గౌతమ్, నిఖిల్‌లు కొట్టేసుకున్నారు. చివరకు ఓజీ క్లాన్ నుంచి ఛార్జింగ్ పాయింట్‌ను రాయల్ క్లాన్‌కు ఇచ్చారు.
లైటర్‌తో ఛార్జింగ్ పాయింట్లు సంపాదించాలని హరితేజ డీల్ పెట్టుకుంది. కానీ ఆ లోపే రోహిణి లైటర్ కొట్టేసింది. పృథ్వీకి ఒకసారి లైటర్ ఇచ్చి.. ఒక ఛార్జింగ్ పాయింట్ సంపాదించుకుంది. దీంతో హరితేజ హర్ట్ అయింది. నేను వేసుకున్న ప్లాన్‌ను రోహిణి ఎలా చేస్తుంది.. ఎందుకు లైటర్‌ను దొంగతనం చేసింది.. చేసిన తరువాత కనీసం నాకు చెప్పాలి కదా? అంటూ హర్ట్ అయింది. చివరకు ఆ లైటర్‌ను హరితేజకు ఇచ్చేసింది రోహిణి. దాంతో మళ్లీ నిఖిల్ ఓ సారి వాడుకోవడంతో.. హరితేజకు మళ్లీ ఓ పాయింట్ వచ్చింది.
మణికంఠ ఈ ఫిజికల్ టాస్కులని చూసి భయపడ్డాడు. ఇంతలా ఆడితే..ఏమైనా జరిగితే.. చేతులు, కాళ్లు విరిగితే ఎలా? అంటూ.. తనని ఆట నుంచి తప్పించమని రాయల్ క్లాన్‌తో డీల్ పెట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన పృథ్వీని రాయల్ క్లాన్ తప్పించింది. మణికి, పృథ్వీకి మాటల యుద్ద జరిగింది. మీదమీదకు వెళ్లి పృథ్వీ రౌడీయిజం చేసినట్టుగా అనిపించింది. మణిని ఆపేందుకు రాయల్ క్లాన్ ప్రయత్నించింది. కానీ ప్రేరణ, విష్ణు వంటి వారు అయితే ఆ గొడవను చూస్తూ ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది.
ఆ గొడవ తరువాత మణిని లోపల పడుకునేందుకు రాయల్ టీం ఆఫర్ ఇచ్చింది. లోపల తన మీద దాడి చేయమని, ఛార్జింగ్ లాక్కోమని ముందే రాయల్ క్లాన్ మాటిచ్చింది. కానీ మణితో ఢీల్ కుదుర్చుకునేందుకు అవినాష్, మెహబూబ్ చాలా ఆఫర్లు ఇచ్చారు. చీఫ్ కంటెండర్ కూడా చేస్తామని అన్నారు. కానీ తన టీంను మోసం చేసినట్టు అవుతుందని వాటన్నంటిని తిరస్కరించాడు మణి. కానీ ఫిజికల్ టాస్కులు ఆడేందుకు మాత్రం చాలానే ప్రయాస పడ్డాడు.
కూల్ వాటర్, పులిహోరతో ఓజీ క్లాన్‌తో బేరాలు ఆడేందుకు తేజ ప్రయత్నించాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. వర్షం కురుస్తుండటంతో లోపలకి అనుమతిస్తామన్నారు కానీ.. ఛార్జింగ్ పాయింట్లు ఎక్కువ కావాలని అడిగారు. అందుకు ఓజీ టీం ఒప్పుకోలేదు. దీంతో బయటే పడుకుంది ఓజీ టీం. అలా పడుకునే టైంలో నిఖిల్ నుంచి ఛార్జింగ్ కాజేయాలని మెహబూబ్ ప్రయత్నించాడు. కానీ విఫలం అయ్యాడు. మణి దగ్గరి నుంచి అవినాష్ దొంగతనం చేయాలని చూశాడు. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. చివరకు మణి దగ్గర్నుంచి మెహబూబ్ దొంగతనంగా దాడి చేసి మరీ తీసుకున్నాడు.
నయని తనకు ఒక్క పాయింట్ కూడా ఎవ్వరూ ఇవ్వలేదని బాధపడింది. బాత్‌రూం ఏరియాను వాడుకున్న మణి ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదని.. ప్రేమగా మాట్లాడతాడు.. ఫ్రెండ్ అంటాడు కానీ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు అని హరితేజతో నయని వాపోతోంది. మణి ఇచ్చినా కూడా నాకు వద్దు అంటూ నయని పదే పదే చెబుతుంది. దీంతో తేజ చిరాకు పడ్డాడు. పదే పదే ఎందుకు చెబుతావ్ అంటూ విసుక్కున్నాడు. దీంతో నయని మళ్లీ ఏడ్చేసింది. నయనిని చూస్తే పెద్ద నసలా అనిపించింది. ఆడేది తక్కువ.. ఏడ్చేది ఎక్కువ అన్నట్టుగా ఉంది. చూస్తుంటే నయని త్వరగానే ఇంటి నుంచి బయటకు వెళ్లేలా కనిపిస్తోంది. ఇక ఈ టాస్కులో ఎవరు విన్ అవుతారు? ఎవరు చీఫ్ కంటెండర్ రేసులో నిలుస్తారు? ఎవరు మెగా ఛీప్ అవుతారో చూడాలి.