Bigg Boss Telugu season 8 episode 44 Review: ఈ వారం నామినేషన్ల రచ్చ... పృథ్వీపై గంగవ్వ గుస్సా, నయనిపై తిట్ల పురాణం - ప్రేరణపై కోపంతో నిఖిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్
ఈ వారం నామినేషన్ల రచ్చ మామూలుగా లేదు. పృథ్వీపై గంగవ్వ గుస్సా కావడంతో పాటు నయనిపై తిట్ల పురాణం అందుకుంది. ప్రేరణపై కోపంతో నిఖిల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఏడవ వారానికి సంబంధించిన నామినేషన్స్ హీట్ పుట్టించాయి. నామినేషన్స్ లో గంగవ్వ రచ్చ మామూలుగా లేదు. మరి ఎపిసోడ్ 44లో జరిగిన నామినేషన్స్, అందులోని హైలెట్స్ ఏంటో చూద్దాం పదండి. ముందుగా హౌస్ లో ఉన్న ముగ్గురు సభ్యులైన గౌతమ్, టేస్టీ తేజ, పృథ్వి లగేజ్ బయటే ఉంటుందని, అందులో ఏ ఇద్దరు సభ్యులు బిగ్ బాస్ ఇచ్చిన బట్టలను ధరించాలో డిసైడ్ చేయాలంటూ హౌస్ కే ఆప్షన్ వదిలేసారు. దీంతో పర్ఫామెన్స్ వీక్ గా ఉందంటూ టేస్టీ తేజాను సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ పృథ్విని సెలెక్ట్ చేయడంతో వీరిద్దరికి విచిత్రమైన డ్రెస్సులు ఇచ్చారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. 'ఇంట్లో అవసరం లేని సభ్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రక్రియ ఇప్పుడు జరగబోయే నామినేషన్స్ ద్వారా జరుగుతుంది. ఈ రోజు జరగబోయే నామినేషన్స్ లో ప్రతి ఒక్కరు నామినేషన్ కి అర్హులే. ఇంటి సభ్యులు అందరిలోంచి ఎవరు నామినేట్ అవుతారని కౌ గర్ల్స్ ప్రేరణ, హరితేజ మీద ఆధారపడి ఉంటుంది. గుర్రం సౌండ్ వినిపించినప్పుడు ఇద్దరు గర్ల్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి హ్యాట్ ని పట్టుకోవాల్సి ఉంటుంది. వారికి నిర్ణయం తీసుకునే అధికారం లభిస్తుంది. ముందుగా రెండు ప్లాట్ఫామ్స్ మీదకు వచ్చిన ఇద్దరు సభ్యులకు ఇంటికి అవసరం లేని ఒక సభ్యుడుని నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఎవరి ఫోటో అన్ వాంటెడ్ నుంచి నామినేట్ బోర్డు మీదకు వెళ్లాలి అనేది డిసైడ్ చేస్తారు. అలాగే కిల్లర్ గర్ల్స్ లో నుంచి ఎవరైతే ఎక్కువసార్లు హ్యాట్ పట్టుకుంటారో వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. అలాగే మెగా చీఫ్ అయిన కారణంగా మెహబూబ్ ని ఎవ్వరూ నామినేట్ చేయకూడదు' అని ఆదేశించారు బిగ్ బాస్.
అవినాష్ గౌతమ్ ల గొడవ రిపీట్
ముందుగా ఈ ప్రాసెస్ లో భాగంగా రోహిణి తన నామినేషన్ గురించి చెప్పింది. ఫన్ గా జరుగుతున్న టాస్క్ లో గౌతమ్ వల్ల డిస్టబెన్స్ కలిగింది అంటూ అతడిని నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అవినాష్, గౌతమ్, రోహిణి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత నిఖిల్ ఈవారం హౌస్ లో డల్ అయ్యాడు అంటూ టేస్టీ తేజను నామినేట్ చేశారు. అయితే హ్యాట్ చేతిలో ఉన్న ప్రేరణ... గౌతమ్ వల్ల నిజంగానే గేమ్ డిస్టర్బ్ అయ్యింది అంటూ గౌతమ్ ని నామినేట్ చేసింది. పదే పదే గౌతమ్ 'బుల్లియింగ్' అనే పదాన్ని వాడడం హౌస్ లో ఎవరికి నచ్చలేదు.
పృథ్వీని టార్గెట్ చేసిన గంగవ్వ
ఇక ఈసారి మళ్లీ నిఖిల్ తో పాటు గంగవ్వ వంతు వచ్చింది. నిఖిల్ మరోసారి టేస్టీ తేజ పేరునే చెప్పగా, గంగవ్వ మాత్రం పృథ్వీ తన దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు అంటూ సీరియస్ అయింది. ఇక ఈసారి కూడా హ్యాట్ ప్రేరణ చేతికే దక్కడంతో ఆమె ఇద్దరి పాయింట్స్ ని కంపేర్ చేసి పృథ్వీని నామినేట్ చేసింది. 'గంగవ్వ దగ్గరికి చాలాసార్లు వెళ్లాను కావాలంటే అసిస్టెంట్ ని అడగండి' అని పృథ్వీ చెప్పగా, 'అది నా అసిస్టెంటా.. ఆమె నా దగ్గర లేనేలేదు, ఇప్పుడే వస్తా అమ్మమ్మ అని చెప్పి ఎవడితోనో వెళ్ళిపోయింది. తిండి పెట్టినవాయే నాకు' అంటూ ఫైర్ అయ్యింది. అయితే ప్రేరణ నిర్ణయం తీసుకునే ముందు హౌస్ మేట్స్ ని నిర్ణయం అడిగింది. కానీ హ్యాట్ ఉన్నవాళ్లే నిర్ణయం తీసుకోవాలి, మాకు ఇన్వాల్వ్ అవ్వాలని లేదు' అంటూ హౌస్ మేట్స్ మొఖం మీదే చెప్పేశారు. దీంతో ప్రేరణ పృథ్వీ పేరు చెప్పగా, అప్పటి నుంచి పృథ్వీ ప్రేరణనే నామినేట్ చేస్తానని కూర్చున్నాడు. అయితే పృథ్వీని ఆపలేకపోతే కనీసం హరితేజను ఆపు అంటూ నిఖిల్ ని సాయం అడిగింది ప్రేరణ. కానీ వెంటనే నిఖిల్ దగ్గరికి వచ్చి 'నువ్వు ప్రేరణకు హెల్ప్ చేస్తే తర్వాత నీకు నాకు పడుతుంది చూసుకో' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత అవినాష్ మణికంఠను గౌతమ్ విష్ణు ప్రియ ను పేర్లను చెప్పారు. యశ్మి గౌడ టేస్ట్ తేజ పేరు అని చెప్పింది.