అన్వేషించండి
Advertisement
(Source: Poll of Polls)
Bigg Boss 5 Telugu: ఈ వారం నామినేషన్ లో పది మంది.. ఎవరెవరంటే..?
ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఉండడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ ప్రాసెస్ గురించే మాట్లాడుకున్నారు.
ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఉండడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ ప్రాసెస్ గురించే మాట్లాడుకున్నారు. ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. తాజాగా ఆరోవారానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ముందుకి కొనసాగాలంటే అగ్నిపరీక్షను ఎదుర్కోవాలన్న బిగ్ బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా ఎవరెవర్ని నామినేట్ చేస్తున్నారో వారి ఫొటోలను మంటల్లో వేయాల్సి ఉంటుంది.
Also Read: 'నన్ను ఎలెక్షన్స్ నుంచి సైడైపోమని చెప్పిందే చిరంజీవి అంకుల్..' మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..
- సన్నీ- కెప్టెన్సీ టాస్క్ లో రవి కావాలనే ఆడలేదని అతడిని నామినేట్ చేశాడు. ఆ తరువాత జెస్సీని నామినేట్ చేస్తూ.. కాయిన్స్ దొంగతనం చేశాడని రీజన్ చెప్పగా.. నీకు సపోర్ట్ చేసినందుకు బుద్దొచ్చిందన్నాడు జెస్సీ.
- విశ్వ - స్ట్రాంగ్ అని చెప్పి నామినేట్ చేయడం.. నాకు కరెక్ట్ అనిపించట్లేదంటూ యానీ మాస్టర్ ను నామినేట్ చేశారు. దీంతో యానీ ఫైర్ అయింది. 'నువ్ ముందొక మాట మాట్లాడతావ్.. వెంక ఇంకొకటి మాట్లాడతావ్.. ఇక అక్క-తొక్కఅని పిలవకు' అంటూ మండిపడింది. ఆ తరువాత ప్రియాంకను నామినేట్ చేశాడు.
- శ్వేతా - సిరి, కాజల్ లను నామినేట్ చేసింది.
- లోబో - ప్రియాంకను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో కాయిన్స్ దొంగతనం చేసి నమ్మకం పోగొట్టిందని రీజన్ చెప్పాడు. ఆ తరువాత జెస్సీను నామినేట్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో దొంగతనం చేసి, నమ్మకాన్ని బ్రేక్ చేశాడంటూ రీజన్ చెప్పాడు లోబో. దానికి జెస్సీ.. 'నేను ఇక్కడకి గేమ్ ఆడదానికి వచ్చాను.. గేమే ఆడతాను' అంటూ రిప్లై ఇచ్చాడు.
- సిరి - శ్రీరామచంద్రను నామినేట్ చేస్తూ.. జెస్సీ ఇష్యూలో నోటికొచ్చినట్లు మాట్లాడావ్ అంటూ రీజన్ చెప్పింది. తరువాత శ్వేతాను నామినేట్ చేస్తూ.. అసలు ఈ అమ్మాయి ఏంటో అర్ధం కాదని, ఒక మాట చెప్తే ఇంకొకటి అర్ధం చేసుకుంటుందని రీజన్ చెప్పింది.
- రవి - మానస్ ని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేయలేదని రీజన్ చెప్పాడు. సిరిని నామినేట్ చేశాడు.
- జెస్సీ - శ్రీరామచంద్రను, సన్నీను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో సన్నీ-జెస్సీల మధ్య మాటల యుద్ధం జరిగింది.
- ప్రియాంక - లోబోని నామినేట్ చేస్తూ.. 'నమ్మకం గురించి మాట్లాడుతున్నావ్ కదా.. నువ్ కూడా సన్నీ టీమ్ నుంచి రవి టీమ్ కి వెళ్లావ్ కదా' అంటూ మండిపడింది. ఆ తరువాత విశ్వను నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్ లో బకెట్స్ విసిరేయడాన్ని రీజన్ గా చెప్పింది. 'ప్రతీసారి ఎదవ రీజన్స్ చెప్పుకుంటూ' అంటూ ప్రియాంక.. విశ్వను ఉద్దేశిస్తూ కామెంట్ చేయగా.. 'ఎదవ రీజన్స్ అని నువ్ మాట్లాడకు' అని విశ్వ చెప్పగా.. 'నా ఇష్టం' అనుకుంటూ పొగరుగా వెళ్లిపోయింది ప్రియాంక.
- మానస్ - ముందుగా రవిని నామినేట్ చేశాడు. 'పదిహేనేళ్ల ఫ్రెండ్షిప్ అని చెప్పి రవి టీమ్ లోకి జంప్ అయ్యావ్.. మా నమ్మకాన్ని బ్రేక్ చేసినట్లనిపించింది.. నీవల్లే గేమ్ ఓడిపోయాం అనిపించింది' అంటూ లోబోని నామినేట్ చేశాడు.
- యానీ మాస్టర్ - షణ్ముఖ్ ని నామినేట్ చేస్తూ.. జెస్సీ-శ్రీరామ్ తో గొడవ విషయంలో షణ్ముఖ్ బిహేవియర్ నచ్చలేదని రీజన్ చెప్పింది. ఆ తరువాత విశ్వని నామినేట్ చేస్తూ.. స్ట్రాంగ్ పాయింట్ ఇచ్చి నామినేట్ చేయండని చెప్పింది.
- శ్రీరామచంద్ర - సిరిని నామినేట్ చేస్తూ.. బయాస్డ్ అనే వర్డ్ నచ్చలేదని రీజన్ చెప్పాడు. ఇక్కడున్న యాక్టర్స్ అందరికీ నటించడం వచ్చేమో కానీ అందరికీ రాదని.. 'మీ కన్వీనియన్స్ కోసం ఒక రిలేషన్షిప్ ని వాడుకోకండి' అని అన్నారు. ఆ తరువాత షణ్ముఖ్ నామినేట్ చేస్తూ.. 'సో బేసిక్ గా నువ్ బిగ్ బాస్ హౌస్ కి దేవుడివి. నువ్ ఏ రూల్ చెప్తే మేం అది పాటించాలి అంతేనా..?' అంటూ ప్రశ్నించాడు షణ్ముఖ్.
- కాజల్ - శ్రీరామచంద్ర నామినేట్ చేసింది. 'ఎమోషనల్ ఎటాచ్మెంట్ పెట్టుకోవడానికి నేను ఈ హౌస్ లోకి రాలేదు..' అంటూ కాజల్ డైలాగ్ వేసింది. శ్వేతాను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ నువ్ నన్ను నామినేట్ చేశావ్ అంటూ రీజన్ చెప్పింది.
- షణ్ముఖ్ - శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు.
- ప్రియా - విశ్వను నామినేట్ చేస్తూ.. 'కొన్ని సార్లు నోరు జారుతావ్, కెప్టెన్ అంటే మేకప్ వేసుకుంటూ ఉండడం కాదని అన్నావ్.. అందంగా కనిపించడం కోసం నాకు డబ్బులు ఇస్తున్నారు' అంటూ రీజన్ చెప్పింది. ఆ తరువాత సన్నీను నామినేట్ చేయగా.. 'మీరు ఉన్నన్ని రోజులు నామినేషన్ 100 పెర్సెంట్ మీకే ఉంటుంది' అంటూ ప్రియాకి చెప్పాడు సన్నీ. దానికి ఆమె 'వార్నింగ్ ఇస్తున్నారా..?' అని అడగ్గా.. 'నా గేమ్ చెప్తున్నా' అంటూ బదులిచ్చాడు సన్నీ.
ఈ వారం ఇంటినుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేతా, సన్నీ, జెస్సీ.
Also Read: ‘మా’ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ రాంగ్ ఛాయిస్? చిరు - మోహన్ బాబు విభేదాలే రచ్చకు కారణమయ్యాయా?
Also Read: ‘మా’లో మంచు తుఫాన్.. ప్రకాష్ రాజ్ ఆ మాట అనకపోయి ఉంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
నిజామాబాద్
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement