Bigg Boss 5 Telugu: టాస్క్ లో కొట్టుకున్న జెస్సీ, శ్రీరామ్.. దొంగ బుద్ధులెందుకు అంటూ విశ్వ ఫైర్..
టాస్క్ లో మానస్, విశ్వ ఒకరిపై మరొకరు పడుతూ ఫిజికల్ అయ్యారు. మరోపక్క శ్రీరామ్, జెస్సీలు కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జెస్సీ, శ్రీరామ్ లకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి.
ఈ వారం 'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రాకుమారులుగా మారి.. సింహాసనం గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ ప్రజలుగా ఉంటారు. ఏ రాకుమారుడికైతే ప్రజల మద్దతు దొరుకుతుందో వారే రాజుగా ఎంపికవుతారు. నిన్నటి నుంచి హౌస్ లో ఈ టాస్క్ జరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్ లో కూడా టాస్క్ కంటిన్యూ అయింది. 'మట్టిలో మహాయుద్ధం..' అనే గేమ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో రాకుమారులకు(రవి, సన్నీ) సంబంధించిన వ్యక్తులు మట్టిలో మల్లయుద్ధం చేయాల్సి ఉంటుంది.
ఈ టాస్క్ లో రవి రాజ్యం నుంచి విశ్వ, యానీ మాస్టర్, శ్వేతాలు పార్టిసిపేట్ చేయగా.. సన్నీ టీమ్ నుంచి మానస్, జెస్సీ, పింకీ లు పోటీ చేస్తారని చెప్పారు. ముందుగా మానస్, విశ్వలు ఒకరితో ఒకరు పోటీకి దిగారు. ఇందులో విశ్వ గెలిచాడు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు
ఆ తరువాత 'ఇక్కడ ఏం స్ట్రాటజీ అయిందనేది నాకు క్లారిటీ ఉంది..ఇద్దరు మగాళ్లను పంపించకుండా ఆడవాళ్లను పంపించారు. అది నేను ఒప్పుకోను.. రండి నేను ఫైట్ చేస్తా.. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా.. మళ్లీ వేరేవాళ్లను పంపమని అడగొద్దు' అంటూ రవి టీమ్ పై అరిచాడు సన్నీ. ఆ తరువాత మానస్ మాట్లాడుతూ.. 'ప్రతీసారి మా విషయంలో అన్ ఫెయిర్ డెసిషన్ ఉంటుంది.. ప్రతీసారి మేమే కాంప్రమైజ్ అవుతున్నాం..' అంటూ ఫైర్ అవుతుండగా.. యానీ మాస్టర్ కలుగజేసుకొని.. 'నో కాంప్రమైజ్.. రండి' అంటూ జెస్సీతో మట్టిలో మల్లయుద్ధానికి దిగింది. ఈ టాస్క్ లో జెస్సీ గెలిచాడు.
'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే..'
హౌస్ మేట్స్ కొందరు కాయిన్స్ దొంగతనం చేయడంతో 'దమ్ముంటే ముంగటకి వచ్చి ఆడుకోవాలే.. నక్కల్లా ఆడడం కాదు.. ఆ దొంగ బుద్ధులెందుకు' అంటూ విశ్వ హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు. ఈ విషయంలో మానస్ 'పేరు తీసి మాట్లాడు.. అందరినీ ఎందుకు అంటున్నావ్' అని గొడవకు దిగాడు. దీంతో ఇద్దరూ అరుచుకుంటూ మాట్లాడారు. ఆ తరువాత ప్రియాంక, శ్వేతా పోటీ పడగా.. శ్వేతా గెలిచింది.
ప్రతీసారీ సంచాలక్(శ్రీరామ్) మాకు వ్యతిరేకంగా డెసిషన్ చెప్తున్నాడు అంటూ కాజల్ తో డిస్కషన్ పెట్టాడు మానస్. టాస్క్ లో తనతో మాట్లాడడం లేదంటూ శ్రీరామ్ పై కంప్లైంట్ చేసింది కాజల్. ఇక తెల్లవారుజామున 5:30కి శ్రీరామ్ ని హగ్ చేసుకుంది హమీద. ఆ తరువాత ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ అతడికి గుడ్ నైట్ చెప్పింది.
''నీ సీరియల్ యాక్టింగ్‌లు ఈడ చేయకు''
సిరి-కాజల్ కూర్చొని ఎవరివైపు ఉండాలనే విషయంపై చర్చలు జరిపారు. ఎక్కువ మంది రవిని సపోర్ట్ చేస్తుండడంతో .. 'నువ్వు నేను సన్నీ వైపు వెళ్తే అతడు గెలుస్తాడు' అంటూ కాజల్.. సిరికి చెప్పింది. సిరి సపోర్ట్ కోరడానికి వెళ్లిన రవి.. 'నీ సపోర్ట్ ఉంటే షణ్ముఖ్ ని కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ గా చేస్తా.. ఇదే నా ప్రామిస్' అని చెబుతుండగా.. సిరి వెటకారంగా నవ్వింది. అది చూసిన రవి ''నీ సీరియల్ యాక్టింగ్‌లు ఈడ చేయకు' అని కామెంట్ చేశాడు.
కొట్టుకున్న శ్రీరామ్, జెస్సీ..
ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి మరో టాస్క్ ఇచ్చారు. అదే 'రాజు గారి గోడ'. ఈ టాస్క్ లో రవి, సన్నీ పేర్లతో రెండు గోడలు ఉంటాయి. వాటిపై రవి, ఫోటోలను అతికించాలి. ఎండ్ బజర్ పూర్తయ్యేసమయానికి ఎవరి ఫోటోలు ఎక్కువ ఉంటాయో వారే విజేత. ఈ టాస్క్ లో మానస్, విశ్వ ఒకరిపై మరొకరు పడుతూ ఫిజికల్ అయ్యారు. మరోపక్క శ్రీరామ్, జెస్సీలు కొట్టుకునే స్టేజ్ కి వెళ్లిపోయారు. ఈ క్రమంలో జెస్సీ, శ్రీరామ్ లకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఈ టాస్క్ లో సన్నీ టీమ్ గెలిచింది.
లాక్కోలాక్కో తాడు..
ఈ టాస్క్ లో రెండు టీమ్స్ పోటీ పడగా.. సన్నీ టీమ్ గెలిచింది.
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి