Bigg Boss 5 Telugu: 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు..' ప్రియాంకపై విరుచుకుపడ్డ విశ్వ..
ఏ ఒక్క పోటీదారుల బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే తదుపరి ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారో..?
![Bigg Boss 5 Telugu: 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు..' ప్రియాంకపై విరుచుకుపడ్డ విశ్వ.. Bigg Boss 5 Telugu: Priyanka fires on Vishwa Bigg Boss 5 Telugu: 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు..' ప్రియాంకపై విరుచుకుపడ్డ విశ్వ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/22/9e24065dcc6ca87144c0313a82752736_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా మానస్, విశ్వ, కాజల్, రవి, సన్నీ ఎంపికయ్యారు. వీరికి బెలూన్ టాస్క్ ఒకటి ఇచ్చారు బిగ్ బాస్. ఏ ఒక్క పోటీదారుల బెలూన్ అయితే పగలకుండా ఉంటుందో వారే తదుపరి ఇంటి కెప్టెన్ అని బిగ్ బాస్ చెప్పారు. 'నేనవుతా రవి కెప్టెన్..' అంటూ కాజల్ చెప్పగా.. 'సంపాదించు.. అడుక్కోకు' అని డైలాగ్ వేశాడు రవి. బజర్ మోగిన వెంటనే పెడెస్టెల్ పై ఉన్న గుండుసూది కోసం పరుగెత్తుకుంటూ వెళ్లారు హౌస్ మేట్స్. ప్రియాంక, విశ్వ, లోబో ముందుగా వెళ్లగా.. ప్రియాంకను తోసుకుంటూ విశ్వ వెళ్లడంతో ఆమె కింద పడిపోయింది.
Also Read: అటు మహేష్.. ఇటు ప్రభాస్.. అబ్బో ఈ బ్యూటీ డిమాండ్ మాములుగా లేదుగా..
దీంతో విశ్వపై ప్రియాంక మండిపడింది. 'ప్రతిదానికి నీకు కండబలం ఉంది.. అందరికీ లేదు' అని ప్రియాంక అనగా.. 'కండబలం అని ఎందుకు అంటున్నావ్' అంటూ ప్రియాంక మీద అరవగా.. ఆమె కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయింది. మగాడివి కాబట్టి బలం ఎక్కువగా ఉంటుందని అరుస్తుండగా.. 'మగాడు.. గిగాడని మాట్లాడొద్దు.. ఇక్కడ అందరూ కంటెస్టెంట్స్' అంటూ అరిచాడు విశ్వ.
ఆ తరువాత విశ్వ గుండుసూదిని తీసుకెళ్లి రవి చేతిలో పెట్టాడు. ఆ పిన్ ని చూపిస్తూ కాజల్ తో మాట్లాడాడు రవి. 'ఈ పిన్ నీ చేతుల్లోకి వస్తే సన్నీ బెలూన్ పొడుస్తావా..? నా బెలూన్ పొడుస్తావా..?' అని ప్రశ్నించాడు రవి. ఆ తరువాత కాజల్ తన దగ్గరున్న పిన్ తో విశ్వ బెలూన్ ను పొడిచే ప్రయత్నం చేసింది. దానికి విశ్వ.. సరైన కారణం చెప్పి పొడవమని అనగా.. 'నువ్ రెండు సార్లు కెప్టెన్ అయ్యావ్' అని కాజల్ చెప్పగా.. కష్టపడి అయ్యానని బదులిచ్చాడు విశ్వ. ఆ తరువాత రవి.. మానస్ బెలూన్ ను పొడిచేశాడు. ప్రోమోలో చివరిగా కాజల్ ఏడుస్తూ కనిపించింది.
Balloon fight lo win ayyedevaru...Captain ayyedevaru? 🎈 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/aoFgdroyPC
— starmaa (@StarMaa) October 22, 2021
Also Read: పవన్ బ్రేక్ తీసుకోవడం పక్కా.. మరి ఒప్పుకున్న సినిమాల సంగతేంటో..?
Also Read: హాలీవుడ్ ట్రైలర్... 'అన్ ఛార్టెడ్': కుర్రకుంకా... పెద్దవాళ్లతో ఆటలా?
Also Read: 'నాట్యం' సమీక్ష: నృత్యం బావుంది! కానీ..
Also Read : ప్రధాని మోదీకి మొరపెట్టుకున్న నటి, క్లాసికల్ డాన్సర్ సుధా చంద్రన్
Also Read: ‘లైగర్’ హీరోయిన్ ఇంట్లో NCB సోదాలు.. ఎవరీ అనన్యా పాండే? ఈమె ఎవరి కూతురు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)