BiggBoss 6 Telugu: సంచాలక్ నేను, నా ఇష్టం - నాగార్జున కామెడీ, ఆటపాటలతో హోరు
BiggBoss 6 Telugu: వారంలో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది.
BiggBoss 6 Telugu: మరో వారం మిగిలింది బిగ్ బాస్ సీజన్ 6 ముగియడానికి. వచ్చే శనివారం లేదా ఆదివారం గ్రాండ్ ఫినాలే అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ఒకరు ఈరోజు ఎలిమినేట్ అవుతారు. అంటే ఇంకా ఆరుగురు ఉన్నారు. వారిలో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయవచ్చు. అలా చేయకపోతే టాప్ 6ని ఫైనల్ కి తీసుకెళ్లే అవకాశం ఉంది. కాగా ఈ రోజు ఇనాయను ఎలిమినేట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇనాయ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. ఆమెను ఎలిమినేట్ చేయడం నిజమే అయితే ఇది చాలా విడ్డూరమనే చెప్పాలి.
ఇక ప్రోమోలో నాగార్జున ఇంటి సభ్యులతో చాలా ఖుషీగా ఆటలు ఆడించారు. బాస్ పార్టీ పాటతో వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. మీకెంత తెలుసు? అనే ఆట ఆడించారు. బిగ్ బాస్ ఇంటి గురించి రకరకాల ప్రశ్నలు అడిగారు. వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లు ఉన్నాయి? అని అడిగితే శ్రీసత్య సెవెన్ లేదా ఎయిట్ అంది. దానికి నాగార్జున రైట్ అని చెప్పి సెవెన్ మెట్లు ఉన్నాయి అని చెప్పారు. దానికి రేవంత్ అదేంటి సర్ అని అడిగాడు. దానికి నాగార్జున ‘నేను సంచాలక్, నా ఇష్టం. ఇది నేను రేవంత్ దగ్గర నుంచే నేర్చుకున్నాను’ అని చెప్పారు. బాత్రూమ్ లో ఎన్ని పూల కుండీలు ఉన్నాయి?, గార్డెన్ ఏరియాలో ఎన్ని డంబెల్స్ ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు అడిగారు.
తరువాత వారికి హూలా హూప్ ఇచ్చి నడుము చుట్టూ తిప్పమన్నారు. ఒక్కరు కూడా తిప్పలేకపోయారు.దాన్ని తిప్పేందుకు ఇంటి సభ్యులు చేసే చేష్టలు నవ్వులు పూయించాయి.
ఇనయా అవుట్?
ముందు సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్ సీజన్ 6 నిరాశజనకంగానే ఉంది. కానీ ఈ సీజన్ చెప్పగానే గుర్తొచ్చే పేర్లలో కచ్చితంగా టాప్ 2లో ఉంటుంది ఇనాయ సుల్తానా. ఈ సీజన్లో గట్టిగా ఆడింది ఇద్దరే వారు ఇనాయ, రేవంత్. మొదటి వారం నుంచి ఇనాయ ఫైట్ చేస్తూనే ఉంది. అంతెందుకు విన్నర్ మెటీరియల్‌గా చెప్పుకుంటున్న రేవంత్ కు మొదటి పదివారాలు గట్టి పోటీ ఇచ్చింది కూడా ఇనాయనే. ఆమె ఓటింగ్లో ఎక్కువ వారాలు రెండో స్థానంలోనే కొనసాగింది. గత మూడు వారాలుగా రోహిత్ దూసుకొచ్చాడు. మెరీనా ఇంట్లోంచి వెళ్లిపోవడం ఆయనకు కలిసి వచ్చింది. ఇప్పుడు రేవంత్ మొదటిస్థానంలో ఉండగా, రోహిత్ రెండో స్థానంలో, ఇనాయ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అలాంటిది ఈ వారం ఇనాయను ఎలిమినేట్ చేశారనే సమాచారం రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
#SundayFunday starts on a high with some entertaining games.
— starmaa (@StarMaa) December 11, 2022
Watch the exciting end to this week's #BiggBossTelugu6 at 9 PM on @StarMaa & @DisneyPlusHSTel.#BiggBossTelugu #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/iRlCCA7zba
Also read: ఈసారి విన్నర్‌కు కోటి రూపాయల దాకా అందనున్న బహుమతులు - కారు, ఇంటి స్థలం, డబ్బు