Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌజ్ లో కేక్ లొల్లి... ఫుడ్ ఖరాబయితదని తింటున్నా సార్ అంటూ సన్నీ కామెడీ..
బిగ్ బాస్ హౌజ్ లో పదో వారం నడుస్తోంది. గార్డెన్ ఏరియాలో కేర్ పెట్టిన పెట్టిన మీలో ఇది తినే అర్హత ఎవరికి ఉందని క్వశ్చన్ చేసి వదిలేశాడు...ఈ రోజంతా ఇదే హడావుడి.
ఇంటిసభ్యులకు టాస్కు ఇచ్చేటప్పుడు ఎందుకు, ఏంటి, ఎలా అన్నది క్లారిటీ ఇస్తుంటారు బిగ్ బాస్. కానీ తాజాగా ఓ కేకుని గార్డెన్ ఏరియాలో పెట్టిన బిగ్ బాస్ అది ఎందుకు అన్నది మాత్రం చెప్పలేదు. ఆ కేకుని తినడానికి ఎవరు అర్హులని మీరు భావిస్తున్నారు అంటూ క్వశ్చన్ మార్క్స్ వేసి వదిలేశారు. దీంతో ఈ కేకు నాదంటే నాదని రవి, యానీ మాస్టర్, సన్నీ అనుకున్నారు. కేక్ తినే అర్హత ఎవరికి ఉందని సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీని ప్రశ్నించారు బిగ్ బాస్... జెస్సీ ఏం సమాధానం చెప్పాడో క్లారిటీ లేదు కానీ.. ఇంతలో రవి నాది అన్నాడు. ఈ కేక్ తినే అర్హత తనకే ఉందంది యానీ, అది ఎవ్వరూ ముట్టువద్దు తనది అన్నాడు సన్నీ. రోజు ముగియడంతో ఇక రేపు ఉంటుంది అంటూ యానీ లోపలకు వెళ్లిపోయింది. ఇక్కడే సన్నీ కామెడీ యాంగిల్ చూపించాడు..
#Sunny cake tinesadu...What next anedi chudali ?? 😂#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/T9bSMsoXIg
— starmaa (@StarMaa) November 10, 2021
కేక్ గురించి మానస్ తో మాట్లాడిన సన్నీ... తింటుంటే కెప్టెన్ ఆపొచ్చని ఏమైనా చెప్పారా అన్నాడు. లేదని మానస్ చెప్పడంతో వెంటనే కేక్ తీసుకుని శ్రీరామచంద్ర పక్కనే కూర్చుని తినేశాడు. ఫుడ్ కరాబైతదని తింటున్నా సర్ అంటూ నవ్వులు పూయించాడు. రవి, శ్రీరామ్ గోవిందా అనుకుంటూ వెళ్లి ఇంటి సభ్యులకు సన్నీ తినేసిన విషయం చెప్పారు. ఇప్పుడు తినేశా..ఏం పంచాయితీ అవుతాదో ఏమో అన్నాడు సన్నీ. ఆశ్చర్యంగా అంతా సన్నీవైపు చూస్తుండగా...ఆ దేవుడు నన్ను ఈ భూమ్మీదకు తీసుకొచ్చింది అని పాజ్ ఇవ్వగానే కేక్ తినడానికా అని శ్రీరామ్ కంప్లీట్ చేసి నవ్వించాడు. మొత్తానికి ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచీ ఇదే మొదటి కామెడీ అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్నదెవరంటే రవి, సిరి, సన్నీ, మానస్, కాజల్. వీరిలో ఫాలోయింగ్ పరంగా ఆలోచిస్తే కాజల్, మానస్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే డిస్కషన్ జరుగుతోంది. వాస్తవానికి యానీ, జెస్సీ, ప్రియాంక నామినేషన్స్ లో ఉండి ఉంటే వారిలో ఒకరు ఎలిమినేట్ అయ్యేవారంటున్నారు. ఇంతకీ సన్నీ కేక్ తినేశాడు..ఏం జరుగుతుందో చూడాలి...
Also Read: మగవాళ్లు చూపిస్తే తప్పులేదు...ఆడవారు చూపించ కూడదా..ఇదేనా సమానత్వం..!
Also Read: గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ద్రాక్షాయణి
Also Read: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...
Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..
Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్
Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..
Also Read: అర్జున ఫల్గుణ... ఎన్టీఆర్ అభిమానిగా శ్రీవిష్ణు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి