Anasuya Bharadwaj: గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటున్న ద్రాక్షాయణి
అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది. ఆ తరువాత నుంచి మంచి పాత్రలను ఎంపిక చేసుకుని మరీ నటిస్తోంది.
మొన్నటి వరకు స్టార్ యాంకర్... ఇప్పుడు స్టార్ నటి కూడా. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టి కీలకపాత్రలు పోషించే నటిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్. ఎన్నో సినిమా అవకాశాలు తలుపుతడుతున్న ఆచితూచి ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది. అందంలోనూ, ఫ్యాషన్ లో కుర్ర హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్టార్లలో అనసూయ కూడా ఒకరు. తాజాగా ఇన్ స్టా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ‘ఆస్క్ మీ ఎనిథింగ్’అని ఆమె పోస్టు పెట్టగానే ఎంతో మంది ఎన్నో సందేహాలు వ్యక్తం చేశారు. అందులో కొన్నింటికి సమాధానాలు చెప్పింది అనసూయ భరద్వాజ్.
ఒక అభిమాని ‘పెద్ద సినిమాలో మంచి పాత్ర వస్తే... దానికోసం అవసరం అయితే గుండు కొట్టించుకుంటారా?’ అని ప్రశ్నించారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ ‘అవసరం అయితే తప్పకుండా ఆ పనిచేస్తా’ అని సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానం తెలిసిన దర్శక, నిర్మాతలు గుండు పాత్రను అనసూయ కోసం ప్రత్యేకంగా కల్పిస్తారేమో చూడాలి.
మళ్లీ మాస్ లుక్‌లో...
రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా మాస్ లుక్ లో అలరించింది అనసూయ. ఇప్పుడు ‘పుష్ప’ సినిమాలో మరో మాస్ లుక్ తో సిద్ధమైంది. ద్రాక్షయణిగా పుష్ప సినిమాలో కనిపించబోతోంది. ఆమె లుక్ ను తాజాగా సినిమా యూనిట్ విడుదల చేసింది. నోట్లో ఆకు నములుతూ, చేతిలో కత్తెర పట్టుకుని, పెద్ద బొట్టు, క్రాఫ్ హెయిర్, మెడ నిండా బంగారు నగలతో చాలా కొత్తగా దర్శనమిచ్చింది ద్రాక్షాయణి. ఆమె లుక్ చూస్తుంటే కీలకపాత్రే చేస్తున్నట్టు అర్థమవుతుంది.
ప్రభుదేవా సినిమాలో బిజీ
ఇండస్ట్రీలో బిజీగా ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో అనసూయ కూడా ఒకరు. ఆమె బుల్లితెర, వెండితెర రెండింటినీ రెండు కళ్లులా చూసుకుంటోంది. రెండు పడవలపై జాగ్రత్తగా ప్రయాణం చేస్తోంది. ఆమె పుష్ప సినిమాతో పాటూ ప్రభుదేవా సినిమాలో కూడా నటిస్తోంది. ‘ఫ్లాష్ బ్యాక్’ అని పేరు పెట్టిన ఈ సినిమాలో అనసూయతో పాటూ రెజీనా కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా డబ్బింగ్ రీసెంట్ గా పూర్తి చేసింది అనసూయ. ఈ సినిమా తెలుగుతో పాటూ తమిళంలో కూడా విడుదల కాబోతోంది.
Also read: జుట్టురాలిపోకుండా ఒత్తుగా పెరగాలా... చక్కటి పరిష్కారం విటమిన్ ఇ
Also read: బిగ్‌బాస్‌లో జెస్సీ వ్యాధి ఇదే, వర్టిగో లక్షణాలు... వామ్మో చుక్కలు చూపిస్తాయి
Also read: ఈ శతాబ్ధపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం... మన దేశంలో ఈ రాష్ట్రాల వారికే కనిపించే అవకాశం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి