Bigg Boss 5 Telugu Nominations: బిగ్ బాస్ 5లో నామినేషన్ల రచ్చ.. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసిన సన్నీ, రవితో నటరాజ్ మాస్టర్ ఫైట్
బిగ్ బాస్ 5లో నామినేషన్ల రచ్చ.. రవిని టార్గెట్ చేసుకున్న హౌస్ మేట్స్, ఆట మొదలైంది
బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలైంది. సోమవారం జరిగిన నామినేషన్లలో హౌస్ మేట్స్ యాంకర్ రవిని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘స్టార్ మా’ విడుదల చేసిన ప్రోమోలో హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియను చూపించారు. ఈ సందర్భంగా 19 మంది హౌస్‌మేట్స్ మధ్య అప్పుడే స్పర్థలు మొదలైనట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్.. హౌస్ మేట్స్ ఫొటోలతో ఉన్న డస్ట్ బిన్ కవర్లను గార్డెన్ ఏరియాలో ఉంచాడు. ఓ చెత్త ట్రాలీ ఇచ్చి.. నామినేట్ చేసినవారి చెత్త సంచిని అందులో వేయమని చెప్పాడు.
నామినేషన్లలో భాగంగా హౌస్‌లో మినీ వార్ మొదలైందని చెప్పుకోవచ్చు. సింగర్ శ్రీరామ చంద్ర ఎవరినో ఉద్దేశిస్తూ.. ‘బ్రో డోన్ట్ మైండ్’ అనడంతో ఈ ప్రోమో స్టార్టయ్యింది. ఆ తర్వాత లోబో చెత్త సంచులను అటూ ఇటూ విసిరేస్తూ.. చివరికి రవి సంచిని పెట్టుకున్నాడు. ‘‘నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో’’ అని కామెంట్ చేశాడు. ఆ తర్వాత యాని మాస్టర్.. సిరి సంచిని చెత్త ట్రాలీలో వేయడం కనిపించింది. అనంతరం సరయు ఆర్జే కాజల్‌ను నామినేట్ చేయడం కనిపించింది. చివరికి రవి నటరాజ్ మాస్టర్‌ను చూసి.. ‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రిట్‌గా అనిపిస్తున్నారు’’ అని కామెంట్ చేశాడు. ఇందుకు నటరాజ్ స్పందిస్తూ.. ‘‘నేను అలాగే ఉంటాను. నటించడం నాకు రాదు’’ అని కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాస సన్నీ.. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ‘‘మనం ఏం చేసినా.. మన వెనుక సైన్యం ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఒక సైన్యం వస్తుంది’’ అని అన్నాడు. ఇందుకు షణ్ముఖ్ స్పందిస్తూ.. ‘‘నాకైతే ఆ ఫీలింగ్ లేదు’’ అని అనడంతో.. సన్నీ చెత్త సంచిని ట్రాలిలోకి కసితో విసరడం కనిపించింది. ఆ తర్వాత లహరీ, సరయు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం విశ్వ, జెస్సీల మధ్య వివాదం నెలకొంది. చివరిగా నటరాజ్.. జెస్సీని ఉద్దేశిస్తూ ‘‘ఇక్కడ అమాయకత్వంతో ఉంటే తొక్కేస్తారు’’ అని కామెంట్‌తో ప్రోమో ముగిసింది.
‘బిగ్ బాస్’ నామినేషన్స్ ప్రోమో:
బయటకొచ్చిన లీకులు చూస్తే మొత్తం 19 మందిలో మొత్తం ఆరుగురు నామినేషన్లోకి వచ్చారట. ఇందులో యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఈ లిస్టు ఫైనల్ అయితే మాత్రం మోడల్ హమీదకు మూడినట్టే అంటున్నారు. ఈ ఆరుగురిలో యాంకర్ రవికి ఫాలోయింగ్ బాగానే ఉంది, కోయిలమ్మ సహా పలు సీరియళ్లలో నటించిన మానస్‌కు బుల్లితెర ఫాలోయింగ్ బాగుంది. సరయు గురించి చెప్పడానికేముంది ఆమె హౌజ్‌లో ఉంటేనే కదా హాట్‌నెస్ పెరిగేది. ఇక ఆర్జే కాజల్ గలగల మాటలతో మురిపిస్తోంది. ఓ వర్గం ప్రేక్షకులకు జెస్సీ బాగానే నచ్చాడు. ఇక ఎటొచ్చీ కొత్త ముఖం హమీదనే. అందుకే హమీద మొదటి వారం ఔట్ అని అంటున్నారు.
ఈ వారం ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో చూసుకుని అసలు ఆట మొదలవుతుంది. ప్రతిసారీ రెండు మూడు గ్రూపులుంటాయి. మరి ఈసారి ఎవరెవరు గ్రూప్ కడతారో.. జంటలుగా అలరించేదవరో చూడాలి. ఏదేమైనా బిగ్ బాస్ రియాల్టీలో చివరి నిముషంలో కూడా చాలా మార్పులుంటాయి. మరి ఈ లెక్కన ఉండేదెవరో మొదటివారం వెళ్లేదెవరో వెయిట్ అండ్ సీ.