అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode 42: ఇనయాకు నాగార్జున క్లాస్,  జుట్టు కత్తిరించుకున్న వాసంతి - శ్రీసత్య సేఫ్

శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన బిగ్ బాస్ హైలైట్స్ మీకోసం..

వీకెండ్ వచ్చేసింది. స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. శుక్రవారం నాడు హౌస్ లో ఏం జరిగిందో చూపించారు. అనంతరం హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ముందుగా రోహిత్ తో మాట్లాడుతూ.. చాలా బాగా ఆడావ్ అని చెప్పారు. హౌస్ మేట్స్ కోసం రెండు వారాల పాటు నామినేట్ అవ్వడం చిన్న విషయం కాదని అన్నారు. రోహిత్ రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అవ్వడానికి ఒప్పుకోవడం వల్ల వంద శాతం బ్యాటరీ వచ్చింది. ఆ వందశాతం బ్యాటరీతో ఆరుగురు హౌస్ మేట్స్ సందేశాలను అందుకున్నారు. 

రోహిత్ కోసం వాసంతి త్యాగం:

అయితే రోహిత్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఆ విషయాన్ని లేవనెత్తారు నాగార్జున. అలాగే రోహిత్ బాధపడిన వీడియోను కూడా చూపించారు. రోహిత్‌కు ఒక అవకాశం ఇచ్చారు. బ్యాటరీని వాడుకున్న ఆరుగురిలో ఒకరు రోహిత్ కోసం త్యాగం చేయాలని చెప్పారు. దానికి అందరూ చేస్తామని ఒప్పుకున్నారు. వారిలో వాసంతిని ఎన్నుకున్నారు రోహిత్. ఆ సాక్రిఫైస్ ఏంటంటే.. వాసంతికి జుట్టు కట్ చేసుకోవాలి. దానికి వాసంతి ఓకే చెప్పింది. 

కానీ రోహిత్ వేరే ఆప్షన్ ఏమైనా ఉందా..? అని అడిగారు. కానీ నాగార్జున లేదని చెప్పడంతో వాసంతి తన జుట్టుని కత్తిరించుకుంది. ఆ తరువాత రోహిత్ ఫ్యామిలీ నుంచి ఒక వీడియోను ప్లే చేసి చూపించారు నాగార్జున. అది చూసిన రోహిత్, మెరీనా ఎమోషనల్ అయ్యారు. ఆ తరువాత రేవంత్ తో కాసేపు మాట్లాడారు నాగార్జున. కెప్టెన్ అయినా.. తను పడుకొని ఉన్న వీడియోలను చూపించారు నాగార్జున. దీంతో హౌస్ మేట్స్ అందరూ నవ్వుకున్నారు. 

బాలాదిత్యకు క్లారిటీ ఇచ్చిన నాగ్:

గతవారం టాస్క్ లో బ్యాటరీ ఛార్జ్ కోసం బిగ్ బాస్ గీతూని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి రెండు ఆప్షన్స్ ఇచ్చారు. అందులో మొదటిది హౌస్ మేట్స్ అందరూ చక్కెర మానేయాలని.. రెండోది బాలాదిత్య సిగరెట్స్ మానేయాలని చెప్పారు. బిగ్ బాస్ చెప్పిన మాటలను మార్చి హౌస్ మేట్స్ కి చెప్పింది గీతూ. దాని వలన బాలాదిత్య సిగరెట్ మానేయాల్సి వచ్చింది. దీంతో బాలాదిత్యను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి గీతూకి బిగ్ బాస్ ఏం చెప్పారో, దానికి గీతూ ఏం సమాధానం చెప్పిందో... ఆ వీడియోను వేసి చూపించారు నాగార్జున. 

ఎవరు గుడ్.. ఎవరు డెడ్:

ఇంట్లో ఎవరు గుడ్, ఎవరు డెడ్ అనే ఆట ఆడారు. ఇంట్లో ఎవరు బాగా ఆడితే వాళ్లు గుడ్ అని ఇచ్చారు. ముందుగా సూర్యకి గుడ్ ఇచ్చారు నాగార్జున. ఆ తరువాత ఫైమాకి కూడా గుడ్ ఇచ్చారు. ఫైమాను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన నాగార్జున ఏదైనా ఇంట్రెస్ట్ థింగ్ చెప్పాలి అని అడిగారు. దానికి ఫైమా 'ఇనయా, సూర్యల మధ్య ఏదో జరుగుతోంది సర్' అని చెప్పింది. దానికి నాగార్జున ఏం జరుగుతోంది అని అడిగేసరికి ఏం చెప్పలేక బయటికి వెళ్లిపోయింది ఫైమా. బాలాదిత్య గేమ్ బాగా ఆడారని.. కానీ సాక్రిఫైస్ లో ఎక్కువ బ్యాటరీ తనే వాడుకున్నాడని గేమ్ ఏవరేజ్ అయిందని చెప్పారు నాగార్జున. రాజ్, కీర్తిల ఆట ఏవరేజ్ అని చెప్పారు. 

ఇనయాకు నాగ్ క్లాస్:

ఇనయాను ఉద్దేశిస్తూ.. ఈ వారం గేమ్ సరిగ్గా ఆడలేదని.. ఆట మీద కంటే మనుషుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావని నాగ్ చెప్పడంతో.. ఇంప్రూవ్ చేసుకుంటానని చెప్పింది. వాసంతి గేమ్ ఏవరేజ్ అని అన్నారు. పక్కవాళ్ల కోసం గేమ్ ఆడుతున్నావ్ అని.. నీ గురించి నువ్ గేమ్ ఆడితే బాగుండేదని సుదీపను ఉద్దేశిస్తూ అన్నారు నాగ్. అర్జున్ గేమ్ ఏవరేజ్ అని.. రేవంత్ గేమ్ గుడ్ అని చెప్పారు. శ్రీసత్య ఆట బాగా ఆడిందని.. గుడ్ ఇచ్చారు నాగ్. శ్రీహాన్ ఎప్పుడూ గుడ్ అని చెప్పారు. మెరీనా గేమ్ ఏవరేజ్ అని.. రోహిత్ గేమ్ గుడ్ అని చెప్పారు. ఆదిరెడ్డి గేమ్ ఏవరేజ్ అని అన్నారు. 

శ్రీసత్య సేఫ్: నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మందికి ఒక టాస్క్ ఇవ్వగా.. అందులోశ్రీసత్యకి సేఫ్ అని వచ్చింది. 

Also Read : మళ్ళీ ట్రోల్స్ మొదలు - విష్ణు మంచుపై 'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget