అన్వేషించండి

Vishnu Manchu On Fake News : మళ్ళీ ట్రోల్స్ మొదలు - విష్ణు మంచుపై 'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?

'జిన్నా' విడుదలకు ముందు విష్ణు మంచును బ్యాడ్ చేసే కుట్ర మొదలైందా? ఆయన మీద మళ్ళీ ట్రోల్స్, నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ అయిందా? విష్ణు మంచు ట్వీట్ చూస్తే ఆ విధంగానే ఉంది.

విష్ణు మంచు (Vishnu Manchu) కొన్ని రోజులుగా తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు ట్రోల్స్ చేయిస్తున్నారని ఆ మధ్య ఆయన పేర్కొన్నారు. తాను ఊహించినట్టుగా 'జిన్నా' విడుదలకు ముందు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారని విష్ణు మంచు ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... 

'ఆదిపురుష్' టీజర్‌పై విష్ణు కామెంట్ చేశారా?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన 'ఆదిపురుష్' టీజర్ కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో టీజర్ విడుదల అయిన తర్వాత ఆడియన్స్ ట్రోల్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే... విష్ణు మంచు ఆ టీజర్ మీద కామెంట్స్ చేసినట్లు కొందరు మీమ్ మేకర్స్ పోస్టులు చేస్తున్నారు.
 
''ప్రభాస్, 'ఆదిపురుష్' దర్శక నిర్మాతలు చీట్ చేశారు. 'ఆదిపురుష్' టీజర్‌లో విజువల్స్ కార్టూన్స్‌లా ఉన్నాయి. ఇటువంటి సినిమా తీసే ముందు ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలి. అలా కాకుండా చీటింగ్ చేస్తే ఇటువంటి రియాక్షన్స్ వస్తాయి'' అని విష్ణు మంచి వ్యాఖ్యానించినట్టు పోస్టులు చేశారు. అటువంటి పోస్ట్ ఒకటి ట్వీట్ చేసిన ఆయన... అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు.
 
''ఫేక్ న్యూస్ ఇది. నేను ఊహించినట్టుగా... ఓ ఐటమ్ రాజా 'జిన్నా' విడుదలకు ముందు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కు అంతా బెస్ట్ ఉండాలని నేను కోరుకుంటాను'' అని విష్ణు మంచు ట్వీట్ చేశారు.

'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?
'జిన్నా' విడుదలకు ముందు ఇతర హీరోలపై విష్ణు మంచు ఈ విధంగా కామెంట్స్ చేశారని తెలిస్తే... ఆ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. సోషల్ మీడియాలో విష్ణు సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు. 'జిన్నా' విడుదలకు ముందు కావాలని తన సినిమాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అభిప్రాయం విష్ణు ట్వీట్‌లో వ్యక్తం అయ్యింది. 'ఆదిపురుష్' టీజర్ మీద తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదనే విషయాన్ని ప్రభాస్ అభిమానులకు ఈ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Also Read : 'కాంతార' రివ్యూ : ప్రభాస్ మెచ్చిన కన్నడ సినిమా ఎలా ఉందంటే?

'మా' ఎన్నికలకు ముందు నుంచి... ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, మీమ్ మేకర్స్‌తో సమావేశం అయిన విష్ణు మంచు తనపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ గురించి స్పందించారు. ''జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. అందులో 21 మంది ఉద్యోగులు ఉన్నారు. వారు కేవలం నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ... ట్రోల్స్ చేస్తున్నారు. మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను మేం ట్రోల్స్, సోషల్ మీడియా నెగిటివ్ పోస్టుల గురించి సంప్రదించినప్పుడు ఐపీ అడ్రస్ వివరాలు ఇచ్చారు. వాటిలో జూబ్లీ హిల్స్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆఫీస్ ఐపీ అడ్రస్... అలాగే జూబ్లీ హిల్స్‌లో ఓ ప్రముఖ నటుడి ఆఫీస్ ఐపీ అడ్రస్ ఉన్నాయి. మాపై వచ్చిన 85 శాతం ట్రోల్స్ ఆ ఆఫీసుల నుంచే వచ్చాయి. మాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బులు ఇచ్చారు. 'మా' ఎన్నికల నుంచి ఈ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి'' అని విష్ణు మంచు పేర్కొన్నారు. తాను డబ్బులు ఇవ్వకుండానే తమపై ట్రోల్స్ చేయించిన వారిపై ఇటీవల ట్రోల్స్ వచ్చాయని ఆయన ఆ సందర్భంలో తెలిపారు. 

'జిన్నా' సినిమా విషయానికి వస్తే... ఇదొక హారర్ కామెడీ సినిమా. 'చంద్రముఖి' తరహాలో ఉంటుందని విష్ణు మంచు తెలిపారు. ఇందులో సన్నీ లియోన్, పాయల్ హీరోయిన్లు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తొంది. ఈ ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget