News
News
X

Bigg Boss 6 Telugu: వారిద్దరూ భార్యాభర్తలు, లైసెన్స్ ఉంది అంటూ నాగ్ ‘నారాయణ’ జపం

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. దీని కోసమే ఎందరో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.

FOLLOW US: 

Bigg Boss 6 Telugu: వీకెండ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున హ్యాండ్సమ్ గా రెడీ అయి బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చేశారు. ఈ ప్రోమోలో ఈ వీక్ లో కొన్ని ఇష్యూల గురించి ఫన్ గా మాట్లాడారు నాగార్జున. మొదటి వారంలోనే కంటెస్టెంట్లపై ఎక్కువ కోపాన్ని చూపించడం ఇష్టం లేక మెల్లగా మాట్లాడినట్టు అనిపించింది. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున ‘మా ఇల్లు ఎలా ఉంది?’ అని అడిగారు.దానికి అందరూ ‘మన ఇల్లు’ అన్నారు. ‘అలా అంటే గీతూ ఒప్పుకోదు’ అంటూ సెటైర్ వేశారు. గీతూ ‘అలా కాదు సర్’ అనే సరికి, ‘నీతో ఎందుకమ్మా నాకు గలాటా’ అంటూ అక్కడికే కట్ చేశారు. 

నాగ్ నారాయణ జపం
మెరీనా - రోహిత్ జంటగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు హగ్ ఇవ్వడం లేదంటూ మెరీనా తన భర్తతో గొడవలు పడుతున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ‘రోహిత్ మా అందరి ముందు మెరీనా టైట్ హగ్ ఇవ్వు’ అని చెప్పగానే భార్యభర్తలిద్దరూ కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘నారాయణ... నారాయణ వారిద్దరూ భార్యభర్తలు’ అన్నారు నాగార్జున. దీన్ని బట్టి ఆ నారాయణ ఎవరో అర్థమయ్యే ఉంటుంది. 

రేవంత్ - ఆరోహి గొడవ
రేవంత్ నువ్వు ఇంట్లో బూతులు మాట్లాడుతున్నావ్ అన్నారు నాగ్. రేవంత్ ‘నేనా’ అనగానే, ‘సాక్ష్యాలు చూపించమంటావా’ అని అడిగారు నాగ్. వెంటనే వద్దు సర్ అనేశాడు రేవంత్. ఇక ఆరోహి, రేవంత్ గొడవ గురించి లేవనెత్తారు నాగ్. ‘ఆమె ఓడిపోయిన బాధలో వస్తే అలా అనడం అవసరమా’ అని రేవంత్‌ను అడిగారు. ఆ తరువాత ఆరోహి వచ్చి రేవంత్ కు సోరీ చెబుతుంటే ఇద్దరు కామెంటేటర్లు మధ్యలో మాట్లాడడమేంటి? అని ప్రశ్నించారు. వారిద్దరికీ రివ్యూలు రివ్యూలు చెప్పి చెప్పి అలవాటైపోయింది అంటూ పరోక్షంగా ఆదిరెడ్డికీ, గీతూకి చురకలు అంటించారు. 

అంత ఆలోచించకు
ఇక ఆదిరెడ్డితో మాట్లాడుతూ ‘ఆటాడుతున్నప్పుడు ఆటగాళ్లుంటారా? అంపైర్ ఉంటారా?’ అడిగారు నాగార్జున. ఆటలో ఎంపైర్ మధ్యలో తిరుగుతుంటే ఉంటే ఎలా? అని అడిగారు. దానికి ఆదిరెడ్డి ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టగానే ‘అంత ఆలోచించకు’ అంటూ సెటైర్ వేశారు. ఆటలో ఆదిరెడ్డి ఇటూ అటూ తిరుగుతుండటాన్ని ప్రశ్నించారు నాగ్. ఈ రోజు ఎపిసోడ్ మజాగా ఉండబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలిసిపోతుంది. 

Also read: ఆ ఇద్దరికే అతి తక్కువ ఓటింగ్, బిగ్‌బాస్ సీజన్ 6లో ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఆమేనా?

Also read: తొలి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే, ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారు?

Published at : 10 Sep 2022 06:51 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg Boss 6 Bigg Boss 6 Star maa Bigg Boss 6 Telugu season daily updates

సంబంధిత కథనాలు

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం,  సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Bhagya Raj: నడిగర్‌ సంఘం షాకింగ్ నిర్ణయం, సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్‌‌పై వేటు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Shrihan: హీరోగా మారిన బిగ్ బాస్ కంటెస్టెంట్ - ‘ఆవారా జిందగీ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు!

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Navya Swami - Ravi Krishna: మొత్తానికి ఒప్పేసుకుంది - రవికి ఆ మాట చెప్పేసి షాకిచ్చిన నవ్యస్వామి

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Bigg Boss 6 Telugu: ఏం ఫిట్టింగ్ పెట్టావు బిగ్‌బాస్, ఇలాంటి నామినేషన్ అని పాపం ఊహించి ఉండరు, నామినేషన్లో ఆ ఎనిమిది మంది

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

Hunt Movie Teaser : నన్ను ఎవరూ ఆపలేరు - సుధీర్ బాబు స్టైలిష్ యాక్షన్ అవతార్ 

టాప్ స్టోరీస్

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!