Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!
బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'టగ్ ఆఫ్ వార్' టాస్క్ ఇచ్చారు. ఇందులో మొదట రోహిత్, రాజ్ పాల్గొన్నట్లు చూపించారు.
బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు 34వ ఎపిసోడ్ కి సంబంధించి లేటెస్ట్ ప్రోమోని వదిలారు. ఇందులో బాలాదిత్య.. గీతూపై ఫైర్ అయ్యారు. ముందుగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'టగ్ ఆఫ్ వార్' టాస్క్ ఇచ్చారు. ఇందులో మొదట రోహిత్, రాజ్ పాల్గొన్నట్లు చూపించారు. ఆ తరువాత శ్రీహాన్, అర్జున్ కళ్యాణ్ పోటీ పడ్డారు. అదే సమయంలో రేవంత్ కి చంటికి మధ్య ఆర్గుమెంట్ జరిగింది. ఆ తరువాత గీతూ.. బాలాదిత్యను డీగ్రేడ్ చేసినట్లు ఫీల్ అయిన ఆయన గీతూపై ఫైర్ అయ్యారు.
'తప్పు.. తప్పు' అంటూ గట్టిగా అరిచారు బాలాదిత్య. 'నేను నిన్ను డీ గ్రేడ్ చేయలేదని' గీతూ అనగా.. 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' అంటూ గీతూపై మండిపడ్డారు బాలాదిత్య. దీంతో హౌస్ మేట్స్ అతడిని కంట్రోల్ చేస్తుండగా.. 'ఆట పట్టించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది' అంటూ గీతూని ఉద్దేశిస్తూ అన్నారు. బాలాదిత్య ఇలా సీరియస్ అయి మాట్లాడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. పైగా గీతూని చెల్లెలిగా భావిస్తాడు. అలాంటిది గీతూ అతడిని ఇరిటేట్ చేయడం వలనే ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
An epic game of push and pull turns into a battle of words! Who will win this one?
— starmaa (@StarMaa) October 7, 2022
Find out on @StarMaa tonight, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/esO7hUWtKb
ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన ప్రోమోలో.. కెప్టెన్సీకి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న సూర్య, బాలాదిత్య, రేవంత్ కి బిగ్ బాస్ గేమ్ ఆఫ్ గార్ ల్యాండ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి కెప్టెన్ అవ్వడానికి పోటీదారులు వీలైనంత ఎక్కువ మంది ఇంటి సభ్యుల మద్దతు వాళ్ళు వేయించుకునే పూల దండల రూపంలో పొందాల్సి ఉంటుంది. రాజు ఎక్కడ ఉన్న రాజే.. ఇప్పుడు ఆ రాజుకి రాజ్యం ఇస్తే ఎలా ఉంటుందో చూడాలని అనిపిస్తుందని గీతూ అంటుంది. కెప్టెన్ అయితే తన కోపం తగ్గుతుందేమో అని అర్జున్.. రేవంత్ గురించి తన అభిప్రాయం చెప్పి దండ వేశాడు. ఇక మేరీనా, అర్జున్ రేవంత్ కి పూల మాల వేస్తారు. కోపం తగ్గించుకున్న తర్వాత కెప్టెన్ అయితే ఇంకా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ శ్రీ సత్య, సుదీప, ఫైమా బాలాదిత్యకి పూల మాల వేస్తారు.
సూర్యకి షాకిచ్చిన ఇనయా:
ఇక అందరి కంటే పెద్ద షాక్ ఇచ్చింది ఇనయా. పూల దండ తీసుకుని ఇనయా సూర్య దగ్గరకి వచ్చి వెంటనే పక్కకి వెళ్ళి రేవంత్ మెడలో వేస్తుంది. తన ఫేవరెట్ సూర్యని వదిలేసి ఇనయా రేవంత్ కి పూల మాల వెయ్యడంతో ఇంట్లో వాళ్ళే కాదు.. సూర్య కూడా బిత్తరపోయాడు. వెంటనే వెళ్ళి ఇనయా సూర్యని హగ్ చేసుకుంటే దండ అటు, హగ్ నాకా అని అని అంటాడు. మరోవైపు.. ఏమైందో తెలియదు కానీ.. నీ పొజిషన్లో నేను ఉంటే ఆట వేరేగా ఉండేది అని చంటి అనేసరికి రేవంత్ చాలా బాధపడతాడు.
నిన్నటి ఎపిసోడ్లో తన బర్త్ డే సందర్భంగా తమ కోరికలను చెప్పమని అడిగాడు బిగ్ బాస్. ఒక్కొక్కరూ ఒక్కో కోరికను చెప్పసాగారు. శ్రీహాన్ తన పేరుతో పెట్టిన 'శ్రీహాన్ హెల్పింగ్ హ్యాండ్స్' ద్వారా సాయం చేయమని స్నేహితులను కోరాడు. అలాగే తన తల్లిదండ్రులతో తరచూ మాట్లాడమని ప్రేయసి సిరికి చెప్పాడు. ఇక బాలాదిత్య తన కూతురికి మంచి పేరు పెట్టాలని కోరాడు. ఇక రేవంత్ తన భార్యని, తల్లిని తలచుకుని, వాళ్లు ఎలా ఉన్నారో తెలియజేయాలని కోరాడు. ఇక ఆర్జే సూర్య తన తల్లి, తండ్రి, బుజ్జమ్మ ఎలా ఉన్నారో వీడియో చూపించమని కోరారు. ఇనయ తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ అయిపోయింది. సుదీప తన భర్త రంగనాథ్ ఫోటో, టీషర్టు అడిగింది.
Also Read : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?
Also Read : వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!