By: ABP Desam | Updated at : 07 Oct 2022 07:37 AM (IST)
మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సెకండ్ డే కలెక్షన్స్ ఎంత అంటే?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). బాక్సాఫీస్ బరిలో సినిమా జైత్రయాత్ర కొనసాగుతోంది. సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. రెండో రోజూ 'గాడ్ ఫాదర్' వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. విజయ దశమి సందర్భంగా విడుదలైన 'గాడ్ ఫాదర్'కు మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ లభించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. విమర్శకుల నుంచి హిట్ అంటూ రివ్యూలు వచ్చాయి. మరి, వసూళ్లు ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...
Godfather Worldwide Collection Day 2 : ప్రపంచవ్యాప్తంగా 'గాడ్ ఫాదర్' సినిమా మొదటి రోజు 38 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రెండో రోజు గ్రాస్ రూ. 31 కోట్లు ఉందని తెలిసింది. సాధారణంగా మొదటి రోజు కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. రెండో రోజుకు సగానికి పడుతుంది. అయితే, 'గాడ్ ఫాదర్' విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా కలెక్షన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 69 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.
హిందీలో మొదటి రోజు మంచి వసూళ్లు!
గాడ్ ఫాదర్' సినిమాను హిందీలోనూ విడుదల చేశారు. అక్కడ మొదటి రోజు మూడున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు టాక్. రెండో రోజు కాస్త పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి డబుల్ కావచ్చు. ఎందుకంటే... థియేటర్స్ కౌంట్ పెరుగుతుంది.
హిందీలో లాస్ట్ వీక్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించిన 'విక్రమ్ వేద' విడుదల అయ్యింది. చాలా థియేటర్లలో ఆ సినిమా ఉండటంతో 'గాడ్ ఫాదర్'కు ఎక్కువ థియేటర్లు లభించలేదు. ఈ రోజు చాలా థియేటర్లలో 'విక్రమ్ వేద'ను తీసి... 'గాడ్ ఫాదర్', అమితాబ్ బచ్చన్ అండ్ రష్మిక మందన్నా నటించిన 'గుడ్ బై' సినిమాలు ప్రదర్శించనున్నారు. 'గాడ్ ఫాదర్'లో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర చేయడం వల్ల నార్త్ ఇండియాలో కొంత మంది ప్రేక్షకులు, సల్లూ భాయ్ అభిమానులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read : Dil Raju On Adipurush Trolls : 'బాహుబలి'నీ ట్రోల్ చేశారు, ఇప్పుడు 'ఆదిపురుష్' టీజర్‌నూ
మోహన్ లాల్ 'లూసిఫర్'కు తెలుగు రీమేక్ 'గాడ్ ఫాదర్'. మలయాళ సినిమాతో పోలిస్తే... తెలుగులో చాలా మార్పులు చేశారు. అందులో తమ్ముడి క్యారెక్టర్ కట్ చేయడం ఒకటి. విలన్ క్యారెక్టర్ సీఎం కుర్చీ మీద మోజు పడటం మరొకటి. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మాసీగా మార్చారు. మోహన్ రాజా చేసిన మార్పులకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మెగాస్టార్ నుంచి మాస్ ఆడియన్స్ ఏం కోరుకుంటారో... ఆయా అంశాలతో కొత్తగా సినిమా తీశారని దర్శకుడిని చాలా మంది మెచ్చుకుంటున్నారు.
వీకెండ్ వరకూ 'గాడ్ ఫాదర్' హవా...
సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతాయి. దసరా సందర్భంగా 'గాడ్ ఫాదర్' సినిమా బుధవారం విడుదలైంది. ఈ వీకెండ్ వరకు విజయ దశమి సెలవులు ఉన్నాయి. అప్పటి వరకు సినిమా బాక్సాఫీస్ బరిలో సినిమా హవా ఉంటుందా? లేదా? అనేది చూడాలి. మెగాస్టార్ అభిమానుల జోరు చూస్తుంటే వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ వచ్చేలా ఉన్నాయి.
Also Read : Chiranjeevi: వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!
Animal OTT Release: 'యానిమల్' ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా? అసలు నిజం ఏమిటంటే?
Bramhamudi Today December 7th Episode: అనామిక, కల్యాణ్ పెళ్లి జరగకుండా పుల్లలు పెడుతోన్న కనకం!
Hi Nanna Review - హాయ్ నాన్న ఆడియన్స్ రివ్యూ : నాని అంత ఏడిపించేశాడా? కర్చీఫ్, టవల్స్ తీసుకువెళ్లక తప్పదా?
Intinti Gruhalakshmi December 7th Episode: కోడలి మీద ప్రతీకారం తీర్చుకున్న రాజ్యలక్ష్మి.. ప్రాణాపాయ స్థితిలో దివ్య!
Guppedantha Manasu December 7th Episode: కొనసాగుతున్న రిషి మిస్సింగ్ సస్పెన్స్ - వసు అన్వేషణ - రంగంలోకి ముకుల్!
Revanth Reddy First Signature: ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ పెట్టే తొలి సంతకం ఇదే
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Revath Reddy Schedule Today: నేడే సచివాలయానికి రేవంత్ రెడ్డి - సాయంత్రానికి సీఎంగా బాధ్యతల స్వీకరణ
/body>