By: ABP Desam | Updated at : 20 Dec 2021 12:03 AM (IST)
Image Credit: Star Maa/Hotstar
ఎట్టకేలకు ‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగిసింది. అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ ట్రోపీని.. ప్రజల మనసును గెలుచుకున్నాడు. యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచాడు. ఎంతో ఉత్కంఠత మధ్య ‘బిగ్ బాస్’ హోస్ట్ అక్కినేని నాగార్జున.. వీజే సన్నీని విన్నర్‌గా ప్రకటించారు. అయితే.. ఎప్పుడూ విన్నర్, రన్నరప్‌ను స్టేజ్‌పైకి తీసుకొచ్చి అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున కాసేపు షన్ను, సన్నీలతో ఆడుకున్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేశారు. వారితో కలిసి సన్నీ, షన్నులు డాన్స్ చేసి ఒత్తిడి తగ్గించుకొనే ప్రయత్నం చేశారు. అనంతరం వారిద్దరితో చిన్న గేమ్ ఫరియా చిన్న గేమ్ ఆడించింది. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. ‘బిగ్ బాస్’ మీతో గేమ్ ఆడారంటూ.. నాగార్జున వారిని మరింత టెన్షన్ పెట్టారు. ఎట్టకేలకు నాగార్జున హౌస్‌లోకి వెళ్లి సన్నీ, షన్నులను స్టేజ్ మీదకు తీసుకొచ్చి.. ఎప్పటిలాగానే విజేతను ప్రకటించారు. విజేత ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. మరి, 105 రోజులు ఇంట్లో ఉన్న అతడికి నజరానాగా ఏమేమి లభించనున్నాయో తెలుసా?
బిగ్ బాస్ సీజన్ 5లో విజేత సన్నీ అని చెప్పగానే ఆమె తల్లి ఆనందాన్ని చూస్తే తప్పకుండా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఏ అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ.. ప్రేక్షకుల మనసు గెలుచుకుని విజేతగా బయటకు రావడంతో ఆ తల్లి ఆనందంతో కొడుకుపై ముద్దుల వర్షం కురిపించింది. అప్పటి వరకు ఎంతో టెన్షన్‌లో ఉన్న సన్నీ.. ఆనందంతో హోస్ట్ నాగార్జునను కూడా పైకెత్తేశాడు. అంతటితో ఆగకుండా ఆయనకు ముద్దు కూడా పెట్టేశాడు. ఆతర్వాత రన్నరప్ షన్నును సైతం హత్తుకుని ముద్దులు పెట్టేశాడు. అనంతరం.. నాగార్జున సన్నీ ఏమేమి గెలుచుకున్నాడో ప్రకటించారు.
Also Read: మచ్చా.. సన్నీ గెలిచేశాడు.. మనసులే కాదు 'బిగ్ బాస్' ట్రోఫీ కూడా..
‘బిగ్ బాస్’ సీజన్ 5లో విజేతగా నిలిచినందుకు.. వీజే సన్నీకి రూ.50 లక్షల క్యాష్‌తోపాటు.. షాద్ నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షలు విలువ చేసే 300 చదరపు గజాల ప్లాట్‌ను గెలుచుకున్నాడు. దానితోపాటు టీవీఎస్ బైక్ లభిస్తుందని నాగార్జున ప్రకటించారు. అలాగే.. బిగ్ బాస్ రన్నరప్ షన్ముఖ్ జస్వంత్‌కు కూడా సువర్ణ కుటీర్‌లో ప్లాట్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకొచ్చారు. ‘బిగ్ బాస్’ సీజన్-4లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్ డబ్బుతో ఇంటి నుంచి బయటకు రావడం, రెండో స్థానంలో ఉన్న అఖిల్ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లడంతో అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున స్పాన్సర్ల ద్వారా షన్ను కూడా న్యాయం జరిగేలా చేశారు. మరి, షన్ను అభిమానులు సన్నీ విజయాన్ని స్వాగతిస్తారో లేదో చూడాలి.
Also Read: ‘బిగ్ బాస్’కే దిమ్మతిరిగేలా అతడికి ఓట్లు.. రన్నరే డౌట్! ఆఖరి రోజు మారిన సమీకరణాలు
Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!
Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చెప్పులేసుకుని ప్రమోషన్స్‌కు వచ్చేది అందుకే!
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు
Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్
తొమ్మిది నెలల గర్భంతో ఒలంపియాడ్లో పతకం- ఎమోషనల్ అయిన ద్రోణవల్లి హారిక
Nara Dishti Dosha: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!
IRCTC Recruitment: ఐఆర్సీటీసీలో ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. నెలకు 30 వేల జీతం!
Gorantla Madhav Issue : వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవో కాదో చెప్పలేం - ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌కు పంపుతామన్న అనంతపురం ఎస్పీ !