Bigg Boss 5 Telugu: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!

శుక్రవారం ప్రసారమైన ‘బిగ్ బాస్-5’ 104 ఎపిసోడ్‌లో ఏం జరిగింది? సిరిని బిగ్ బాస్ నిజంగానే ఇంటి నుంచి పంపేశాడా?

FOLLOW US: 

‘బిగ్ బాస్’ సీజన్ 5.. ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసింది. అయితే, సరదాగా సాగాల్సిన టాస్క్‌ను సిరీ సిరియస్‌గా తీసుకుని.. దాన్ని పెద్ద ఇష్యూ చేయడం సన్నీకే ఎక్కువ కలిసొచ్చేలా కనిపించింది. ముఖ్యంగా సన్నీ.. తన మీదకు కొట్టడానికి వచ్చినట్లు వచ్చాడంటూ షన్నుతో అనడం.. బిగ్ బాస్ ప్రేక్షకులకు ఎక్కకపోవచ్చు. సిరి వ్యవహారం చూస్తుంటే.. ఆమె సన్నీని టార్గెట్ చేసుకున్నట్లు కనిపించింది. అతడిని వీక్ చేయడం ద్వారా షన్నును విజేతను చేయాలనుకుంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎపిసోడ్ 104లో కూడా సిరి.. వాష్ రూమ్స్ వద్ద సింపథీ కోసం ప్రయత్నించడం, ఇద్దరు హగ్ చేసుకుని సన్నీపై విమర్శలు చేయడాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారనేది చూడాలి. ఇక ఈ ఎపిసోడ్‌లో మిగతా విషయాల్లోకి వెళ్తే..

ఎవరి జాతకం ఎలా ఉంది?: ఈ ఎపిసోడ్‌లో బిగ్ బాస్.. కార్డ్స్ ద్వారా ఎవరి జాతకం ఎలా ఉండబోతుందనేది టారోట్ రీడర్ శాంతి ద్వారా చెప్పించాడు. షన్ముఖ్ జాతకం చూస్తూ.. ‘‘లైఫ్‌లో మంచి ఛేంజ్ ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి. మీరు ఇతరులకు కూడా దానం చేస్తారు. ట్రావెల్ కూడా చేస్తారు. విచారంగా ఉండకూడదు. నవ్వుతూ ఉండాలి’’ అని తెలిపింది. తన లవ్ లైఫ్ గురించి చెప్పాలని అడగ్గా.. ‘బిగ్ బాస్’ హౌస్‌లోనా? బయటా? అంటూ శాంతి షన్నుకు సెటైర్ వేశారు. తాను దాదాపు ఐదేళ్ల నుంచి దీప్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అన్నిట్లో తనదే పైచేయని.. తమ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలని కోరాడు.  ఈ సందర్భంగా ఆమె.. ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడమనేది ఉండాలని, ఇల్లు కూడా కొంటారని, లైఫ్ బాగుంటుందని చెప్పింది. సన్నీ జాతకం చెబుతూ.. ‘‘కొత్త బిగినింగ్ ఉంటుంది. మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు’’ అని తెలిపారు. మీకు ఎవరూ లవర్ లేరా అనే ప్రశ్నకు.. సన్నీ స్పందిస్తూ తనకు లవ్ ఎవరూ లేరని ముందు కెరీర్, ఆ తర్వాతే ఏదైనా అని తెలిపాడు. సిరి జాతకం చెబుతూ.. త్వరలోనే పెళ్లి కానుందని చెప్పారు. డబ్బు కూడా వస్తుందని, నమ్మకంగా ఉండాలని సూచించింది.హనీమూన్‌కు ఫారిన్ వెళ్తావు. కష్టాలన్నీ పోతాయి. శ్రీరామ్ గురించి చెబుతూ.. ‘‘మీకు విక్టరీ కార్డ్ వచ్చింది. కానీ, మీ లోపల గందరగోళం ఎక్కువగా ఉంది. దాన్ని మీరు వదిలేయండి. బోలెడంత డబ్బు, సెక్యూరిటీ మీకు లభిస్తుంది’’ అని తెలిపింది. మానస్ గురించి చెబుతూ.. అన్ని సాధించామనే తృప్తి మీకు లభిస్తుంది. డబ్బు, కెరీర్, ఆరోగ్యపరంగా అంతా మీకు మంచే జరుగుతుంది. అనుకోకుండా ఒక అమ్మాయి మీ జీవితంలోకి వస్తుంది’’ అని తెలిపింది.  

వంట.. పెంట..: వంట గురించి సిరి-షన్ను మధ్య గొడవ జరిగింది. నువ్వు అందరికీ చేస్తుంటే.. వాళ్లు తినడం లేదు. నువ్వు అనవసరంగా అందరి గురించి ఆలోచిస్తావు అని షన్ను ఫైర్ అయ్యాడు. దీంతో సిరి.. మానస్‌ను ప్రశ్నించింది. స్వీట్ దోశలు చేస్తే ఎందుకు తినలేదు? అని అడిగింది. ఎంత గొడవలైనా తిండి దగ్గర కోపం చూపించకూడదని తెలిపింది. ఆ తర్వాత మానస్ ఏం వంట చేయమంటావని షన్నును అడిగాడు. దీంతో షన్ను.. మీరు చేసుకోండి, సిరి-నేను వేరేగా వండుకుంటామని చెప్పాడు.

ఫేక్ ఎలిమినేషన్.. షన్నుకు మనసులో మాట చెప్పేసిన సిరి: ఇంట్లోని సభ్యులంతా సూట్ కేసులు రెడీ చేసుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ‘‘మీలో ప్రతి ఒక్కరిపై ప్రేక్షకులు తమ ప్రేమను చూపి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఫినాలేలో ప్రతి ఒక్కరు ఓటేసి వారి ప్రేమను చూపిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఒకరి ప్రయాణం ఈ రోజు ముగుస్తుంది. బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ఆ ఒక్కరు ఎవరో మీరే చెప్పండి’’ అని బిగ్ బాస్ అడిగాడు. షన్ను మాట్లాడుతూ.. సన్నీ పేరు చెప్పాడు. మానస్.. షన్ముఖ్ పేరు, సిరి.. మానస్ పనేరు, శ్రీరామ్.. సిరి పేరు, సన్నీ.. షన్ను పేరు చెప్పాడు. చివరిగా బిగ్ బాస్.. సిరి ఇంటి నుంచి బయటకు వెళ్లాలని ప్రకటించాడు. దీంతో సిరి.. ‘‘బిగ్ బాస్ మీరు జోక్ చేస్తున్నారు. నేను వెళ్లను అని కూర్చుంది’’. చివరికి బిగ్ బాస్ గేట్స్ తెరవడంతో సిరి బయల్దేరింది. ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. షన్నును గట్టిగా హగ్ చేసుకుంది. దీంతో షన్ను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. వెళ్తూ.. వెళ్తూ.. షన్నుకు ‘ఐ లవ్ యూ’, ‘ఐ మిస్ యూ’ అని చెప్పింది. కానీ, షన్ను మాత్రం సైలెంట్ అయిపోయాడు. దీంతో సన్నీ.. మాసన్‌తో మాట్లాడుతూ.. ‘‘సిరి వెళ్తు ఆమె ఐ లవ్ యూ చెప్పింది.. షన్ను చెప్పలేకపోయాడు’’ అని అన్నాడు. 

కన్ఫెషన్ రూమ్‌లో సిరి: బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సిరికి కళ్ల గంతలు కట్టి.. కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. మీరు ఎలిమినేట్ కాలేదని, ఇంకా సేఫ్‌గానే ఉన్నారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఇంట్లో మీ ప్రయాణం కొనసాగుతుందని చెప్పాడు. త్వరలోనే ఇంట్లోకి పంపిస్తానని తెలిపాడు. మరోవైపు బాధతో ఉన్న షన్నును మానస్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఫీలింగ్స్ దాచుకుంటున్నావా అని అడిగాడు. అయితే, షన్ను మాత్రం సైలెంట్‌గానే ఉన్నాడు. షన్ను ఒంటరిగా ఉన్నాడని సిరి ఏడ్వడం మొదలుపెట్టింది. తనను వెంటనే ఇంట్లోకి పంపించాలని, తాను లేకపోతే షన్ను ఉండలేడని.. ఏడుస్తూనే ఉంటాడని తెలిపింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఆమెను కన్ఫెషన్ రూమ్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలని సిరికి చెప్పాడు. దీంతో సిరి.. ‘‘నేను షన్ను దగ్గరకు వెళ్లిపోతా’’ అంటూ పరిగెట్టింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లి షన్ను హగ్ చేసుకుని ముద్దులు పెట్టింది. రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులంతా ‘బిగ్ బాస్’ గత సీజన్ కంటెస్టెంట్లను కలవనున్నారు. గీతా మాధురి, రోలో రైడా, శివ బాలాజీ, హరితేజ, అరియానా, అఖిల్, శివజ్యోతి, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు శనివారం ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు. 

శనివారం ప్రసారం కానున్న ఏపిసోడ్ 105 ప్రోమో: 

Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?

Published at : 18 Dec 2021 07:09 AM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 బిగ్ బాస్ 5 తెలుగు బిగ్ బాస్ 5 Siri Loves Shanmukh Siri Loves Shannu Siri Shanmukh Love Siri Fake Elimination సిరి షన్ను లవ్

సంబంధిత కథనాలు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

టాప్ స్టోరీస్

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!