Bigg Boss 5 Telugu Winner: ‘బిగ్ బాస్’కే దిమ్మతిరిగేలా అతడికి ఓట్లు.. రన్నరే డౌట్! ఆఖరి రోజు మారిన సమీకరణాలు
Bigg Boss 5 Telugu Winner: ‘బిగ్ బాస్’కే దిమ్మతిరిగేలా అతడికి ఓట్లు.. రన్నరే డౌట్! ఆఖరి రోజు మారిన సమీకరణాలు
‘బిగ్ బాస్’ సీజన్ 5 ముగింపుకు వచ్చింది. ఈ నేపథ్యంలో విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. ఈ సీజన్‌కు గెస్ట్‌గా ఎవరు రానున్నారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే, బిగ్ బాస్‌లో ఉన్న ఐదుగురు సభ్యుల్లో విజేతను ప్రజలు ఇప్పటికే నిర్ణయించేశారు. అయితే, అది ఎవరనేది మాత్రం రేపే తెలుస్తుంది. అనధికార ఓటింగ్స్ ప్రకారం.. ముగ్గురు కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో విన్నర్ అయ్యేందుకు సన్నీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్లో కూడా విజేత ఎవరనేది ముందుగానే తేలిపోయింది. అభిజిత్‌కు ఎక్కడా లేని ఫ్యాన్ ఫాలోయింగ్ రావడంతో అతడికే టైటిల్ దక్కింది. కానీ, ఫినాలే మొత్తం సొహెల్ చుట్టూ తిరిగింది. మధ్యలో నష్టపోయింది రన్నర్ అఖిలే.
ఈ సీజన్లో ఆ మాత్రం ఆ కన్ఫ్యూజన్ ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే.. చివరి ఐదు రోజుల్లో సన్నీకి ఓట్లలో క్లియర్ మెజారిటీ వచ్చినట్లు తెలిసింది. అయితే, విన్నర్ రేసులో ఉంటాడని భావించిన షన్ముఖ్ జస్వంత్.. ఇంట్లో సిరితో మాత్రమే క్లోజ్‌గా ఉంటూ.. తన అభిమానులను నిరుత్సాహానికి గురిచేశాడనే చెప్పాలి. ముఖ్యంగా చివరి వారంలో కూడా షన్ను.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మానస్, శ్రీరామ్, సన్నీలకు మంచి మార్కులు వచ్చేశాయి. ఐస్ టాస్క్ వల్ల శ్రీరామ్ యాక్టివీటీలకు దూరమయ్యాడు. అలాగే.. ఎవరితో స్నేహం చేయకుండా సోలోగానే తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు. పెద్దగా ఎవరితో కలవకపోవడం, వివాదాల్లో లేకపోవడం వల్ల శ్రీరామ్‌కు స్క్రీన్ స్పేస్ రావడం లేదు. అయినా.. అతడికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా సింపథీ కూడా ఉంది. దీంతో చివరి వారంలో శ్రీరామ్‌కు కూడా ఓట్లు బాగా పడ్డాయని టాక్.
Also Read: సిరి నువ్వు నాకు పడిపోయావ్.. వెనుక నుంచి వాటేసుకున్న షన్ను.. సన్నీ ఫైట్.. శ్రీరామ్ సైలెంట్!
మరోవైపు సిరి వల్ల సన్నీ లైన్ మరింత క్లియర్ అయినట్లు అనిపించింది. సరదా టాస్క్‌లను సిరి సీరియస్‌గా తీసుకోవడం.. సన్నీతో కావాలని గొడవ పెట్టుకోవడం, అతడు మీద మీదకు వచ్చాడంటూ.. షన్నుతో చెప్పడం వంటివి.. సిరికి ప్రతికూలంగా మారాయి. దీంతో సన్నీకి మరిన్ని ఓట్లు దక్కాయి. మరోవైపు మానస్‌కు కూడా ఓట్లు బాగానే పడుతున్నా.. అవి టైటిల్ విన్ కావడానికి సరిపోవని తెలుస్తోంది. ముఖ్యంగా ఆఖరి రోజు.. సిరి ఫేక్ ఎలిమినేషన్‌తో ఓట్ల సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. సిరి-షన్నుల రొమాన్స్‌కు ప్రేక్షకులు ఇబ్బందిపడ్డారు. ఆ ప్రభావం ఓట్ల మీద పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సన్నీ.. విన్నర్‌గా కన్ఫార్మ్ అని తెలుస్తున్నా.. రన్నర్ ఎవరనేది స్పష్టంగా చెప్పడం కష్టమే. ఈ స్థానం కోసం షన్ను, శ్రీరామ్‌ల మధ్య గట్టి పోటీ నెలకోనుందని సమాచారం. సిరి.. ముందుగా ఇంటి నుంచి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు సీజన్-2 హోస్ట్, హీరో నాని గెస్టుగా రానున్నట్లు తెలిసింది. అలాగే ‘బ్రహ్మాస్త్రం’ సినిమా హీరో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి కూడా వేదికపై సందడి చేయనున్నట్లు సమాచారం.
Also Read: ‘షన్ను.. ఐ లవ్ యూ’.. మనసులో మాట చెప్పేసిన సిరి.. ముద్దులు హగ్గులతో సహన పరీక్ష!
Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి