Bigg Boss 5Telugu: బిగ్ బాస్ ఇంటి లాస్ట్ కెప్టెన్ తనేనా.. ఎట్టకేలకు హౌజ్ మేట్స్ ఈ రోజు నవ్వించేట్టే ఉన్నారు..
బిగ్ బాస్ షో 11 వారాలు పూర్తిచేసుకుని 12 వ వారంలో అడుగుపెట్టింది. టాస్క్ అనే మాటవినగానే వైల్డ్ గా బిహేవ్ చేసే ఇంటి సభ్యులు ఈ రోజు మాత్రం కాస్త నవ్వులు పూయించినట్టే ఉన్నారు.
నామినేషన్స్ హడావుడి, కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఈ రోజు ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ‘బీబీ ఎక్స్‌ప్రెస్’ టాస్క్ లో భాగంగా ‘చుక్ చుక్ చుక్’ అంటూ బజర్ వచ్చిన ప్రతిసారీ ఇంటిసభ్యులంతా రైలు బోగీల్లా మారి పరుగులుతీయాలి. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ గేమ్ మధ్యలోనే ఫార్వర్డ్, పాజ్ అంటూ ఆదేశాలివ్వడంతో ఇంటి సభ్యులంతా ఎంజాయ్ చేశారు. టాస్క్ మధ్యలో షణ్ముక్ పాజ్ అనడంతో ఆటపట్టించేందుకు వచ్చిన సిరికి పాజ్ చెప్పారు. వెంటనే కాజల్ , సన్నీకి పాజ్ చెప్పడంతో రవి-శ్రీరామ్ సన్నీతో ఓ ఆట ఆడుకున్నారు. ఆ తర్వాత ఇంటిసభ్యులందర్నీ ఫాజ్ చేయడంతో చివరికి షణ్ముఖ్.. వాళ్లందర్నీ ఆటపట్టించాడు.
Luxury budget kosam #BBExpress ekkadidaaka veltundi??#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/IXdeajtqQ5
— starmaa (@StarMaa) November 24, 2021
మొత్తానికి నామినేషన్స్ హీట్, కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ హీట్ లో ఉన్న ఇంటి సభ్యులు కాస్త చల్లబడినట్టే కనిపిస్తున్నారు. కెప్టెన్సీ టాస్క్ ఈ వారంతో లాస్ట్ కావడంతో బిగ్ బాస్ ఇంటి లాస్ట్ కెప్టెన్ గా షణ్ముక్ నిలిచినట్టు తెలుస్తోంది. ఇదివరకు ఓ సారి కెప్టెన్ అయినపుడు షణ్ముక్ ప్రవర్తన అందరికీ బాగా నచ్చేసింది. అందుకే ఇంటి సభ్యులంతా ఏకగ్రీవంగా షణ్ముఖ్ జస్వంత్‌ను కెప్టెన్‌గా ఎంచుకున్నారు.యాంకర్ రవి చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. మరోవైపు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఇంటి కెప్టెన్ కాలేకపోయిన కాజల్, ప్రియాంక ఏడ్చేశారు. మొత్తానికి షో చివరికి చేరుతున్న కొద్దీ ఇంటి సభ్యుల మధ్య వివాదాలు తగ్గుతున్నాయి. కేవలం శ్రీరామచంద్ర మాత్రం సన్నీ-కాజల్ ని టార్గెట్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు.
Alos Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
Alos Read: 'థాంక్యూ'... రంగుల రాట్నంలో గుర్రం ఎక్కిన నాగచైతన్య!
Alos Read: అవన్నీ వదంతులే... కైకాల సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిపై కుమార్తె స్పందన ఇది
Alos Read: ఆ నవమన్మథుడే ఈ చిన్న బంగార్రాజు.. టీజర్‌తో వచ్చేసిన బర్త్‌డే బాయ్ నాగ చైతన్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి