'Bheemla Nayak' Song: 'అంత ఇష్టం ఏందయ్యా' పవన్ ని ఓరగా చూస్తోన్న నిత్యామీనన్
ఇప్పటి వరకూ భీమ్లానాయక్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్, పోస్టర్స్ అన్నీ అదుర్స్ అనిపించాయి. తాజాగా మరో సాంగ్ ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది...
పవన్ కల్యాణ్ , రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. ఇందులో పవన్ భార్యగా నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు మూ సినిమా నుంచి విడుదలైన ఇద్దరు హీరోల గ్లిమ్స్ - ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా 'అంత ఇష్టం' అనే మరో పాట రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న మూవీ యూనిట్ తాజాగా ఈ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
Our Evergreen Nightingale of INDIAN CINEMA 🎵 #Chithra Gaaru @KSChithra Amma thanks fr blessing Us with ur heart 💜
— thaman S (@MusicThaman) October 14, 2021
My love & respect to our #Leader @PawanKalyan gaaru & Trivikram gaaru ✊@saagar_chandrak @ramjowrites @SitharaEnts #AnthaIstham 🎵https://t.co/zCRNCNiLQn
”అంట ఇష్టమేందయ్యా.. అంత ఇష్టమేందయ్యా.. నీకు.. నా మీనా” అంటూ ఈ పాట సాగుతోంది. రామ జోగయ్య శాస్త్రి రాసిని ఈ పాటకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చగా కేఎస్ చిత్ర ఆలపించారు. విజయ దశమి సందర్భంగా శుక్రవారం ఉదయం 10.19 గంటలకు 'అంత ఇష్టం' పూర్తి లిరికల్ వీడియోని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ భీమ్లానాయక్. నిజానికి ఒరిజినల్ వెర్సన్ లో హీరోహీరోయిన్ల మధ్య పాటలు లేవు. కానీ తెలుగులో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్క్రిప్ట్ రెడీ చేశారు. ఇందులో భాగంగానే పవన్ కు నిత్యా తో సాంగ్ పెట్టారు. 'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకడు కాగా పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మాత. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'దండుపాళ్యం' గ్యాంగ్ తో 'తగ్గేదే లే'..వరుస మర్డర్స్, నో ఎవిడెన్స్
Also Read: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా డార్లింగ్ …ఖాకీ డ్రెస్ లో ప్రభాస్ కటౌట్ చూస్తే..
Alos Read: ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ వీడు.. నవ్వులు పూయిస్తోన్న ’మంచి రోజులొచ్చాయి’ ట్రైలర్
Also Read: యానీ మాస్టర్ తో ఫైట్.. పిల్లో అడ్డం పెట్టుకొని ఏడ్చేసిన శ్వేతా..
Also Read: శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎందుకంత ప్రత్యేకం, దశమి రోజు ఈ శ్లోకం రాసి జమ్మిచెట్టుకి కడితే…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి