Bheemla Nayak Movie: 'భీమ్లా నాయక్' హిందీ ప్రోమోలో పవన్ కల్యాణ్ ఎక్కడ? లేడేంటి?
'భీమ్లా నాయక్' సినిమా హిందీలో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ పవన్ కల్యాణ్ లేకుండా హిందీ ప్రోమో విడుదల చేశారు. రానాను హైలైట్ చేశారు.
Bheemla Nayak Hindi Dubbed Promo Out: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో రానా మరో హీరో. మలయాళంలో విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకు రీమేక్ (Ayyappanum Koshiyum Telugu Remake). అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో రానా, బిజూ మీనన్ పాత్రను పవన్ కల్యాణ్ చేస్తున్నారు. మలయాళంలో ఇద్దరు హీరోలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాలో హీరోల ఇద్దరు పేర్లు వచ్చేలా టైటిల్ పెట్టారు. అయితే... తెలుగులో పూర్తిగా పవన్ కల్యాణ్ సెంట్రిక్ సినిమాగా 'భీమ్లా నాయక్'ను మార్చేశారు. కథ, కథనం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే... ప్రచారం అంతా పవన్ సెంటర్రాఫ్ అట్రాక్షన్‌గా జరుగుతోంది. హిందీలో మాత్రం అందుకు రివర్స్ అని చెప్పాలి.
'భీమ్లా నాయక్'ను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్న (Bheemla Nayak Hindi Release) సంగతి తెలిసిందే. ఈ రోజు హిందీ ప్రోమో విడుదల చేశారు. అయితే... అందులో కనీసం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఫేస్ కూడా చూపించలేదు. మొత్తం రానాయే ఉన్నారు. స్ట్రయిట్ హిందీ సినిమాల్లో నటించడం మాత్రమే కాదు... 'బాహుబలి'లో కూడా రానా చేశారు. ఉత్తరాదిలో పవన్ కంటే రానా (Rana Daggubati) ఎక్కువ మందికి తెలుసని చెప్పవచ్చు. అందువల్ల, ముందు రానా ప్రోమో విడుదల చేశారని ఊహించవచ్చు.
Also Read: అమితాబ్‌ను కలిసిన పవన్ కల్యాణ్, అక్కడే ప్రభాస్ కూడా!
పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్ (Nithya Menon), రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ కె చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. తమన్ (Trivikram) సంగీతం అందించారు. ఫిబ్రవరి 25 (Bheemla Nayak On Feb 25th) న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: 'భీమ్లా నాయక్' - ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఆర్ఆర్ఆర్?
Also Read: అదీ అల్లు అర్జున్ క్రేజ్, ఔరంగాబాద్‌లో 'పుష్ప'రాజ్ విగ్రహం రెడీ!
Here’s it… the ‘Bheemla Nayak’ trailer: pic.twitter.com/4y8oj0dBcX
— Komal Nahta (@KomalNahta) February 17, 2022