Pawan Met Amitabh: అమితాబ్‌ను కలిసిన పవన్ కల్యాణ్, అక్కడే ప్రభాస్ కూడా!
అమితాబ్ బచ్చన్, పవన్ కల్యాణ్, ప్రభాస్... ముగ్గురు స్టార్ హీరోలు కలిశారు. ఈ ముగ్గురి మీటింగ్ ఎక్కడ జరిగింది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
బిగ్ బి అమితాబ్ బచ్చన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ఈ ముగ్గురు స్టార్ హీరోలు బుధవారం మీట్ అయ్యారు. వీళ్ళ కలయికకు రామోజీ ఫిల్మ్ సిటీ వేదిక అయ్యింది. అసలు, ఎందుకు కలిశారు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ఫిబ్రవరి 25న విడుదల కానున్న పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమా షూటింగ్ బుధవారంతో కంప్లీట్ అయ్యింది. లాస్ట్ డే షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ప్రభాస్ కథానాయకుడిగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ప్రాజెక్ట్ కె'. అందులో అమితాబ్ బచ్చన్ ఓ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్ అంటే పవన్ కల్యాణ్‌కు అభిమానం. గతంలో చాలాసార్లు అన్నయ్య చిరంజీవి కాకుండా అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టమని పవన్ చెప్పారు. అభిమాన హీరో రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నారని తెలిసి, ఆయన్ను పవన్ కలిశారట. అక్కడే ప్రభాస్ కూడా ఉన్నారు. ముగ్గురూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారని సమాచారం.
Also Read: అదీ అల్లు అర్జున్ క్రేజ్, ఔరంగాబాద్‌లో 'పుష్ప'రాజ్ విగ్రహం రెడీ!
మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు 'సైరా నరసింహారెడ్డి'లో అమితాబ్ బచ్చన్ నటించారు. ఆ సినిమా టీజర్ కోసం పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.
Also Read: 'భీమ్లా నాయక్' - ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న ఆర్ఆర్ఆర్?
View this post on Instagram