Weekend Telugu Movies To Watch: ఈ వారం సినిమాల్లో ఏది బెస్ట్? రివ్యూలపై ఓ లుక్ వేయండి
సినిమా ప్రేమికులకు ఈ రోజు బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. నాలుగు తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. ఓటీటీల్లో సినిమాలు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ 'డాక్టర్ స్ట్రేంజ్' ఉంది. వీటిలో ఏ సినిమా బెస్ట్?
తెలుగునాట ఈ వారం థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో చెప్పుకోదగ్గవి నాలుగు ఉన్నాయి. అందులో రామ్ గోపాల్ వర్మ 'మా ఇష్టం' సినిమాకు చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు లభించలేదు. ఆ సినిమాపై ప్రేక్షకులూ పెద్దగా ఆసక్తి చూపించలేదు. మిగతా మూడు సినిమాలు... విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కళ్యాణం', సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ', శ్రీవిష్ణు 'భళా తందనాన'. ఈ మూడు ఎలా ఉన్నాయో చూద్దాం!
Ashoka Vanam lo Arjuna Kalyanam Movie Review: విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కథ కంటే క్యారెక్టరైజేషన్స్ వల్ల మంచి ఫన్ జనరేట్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? అనేది పూర్తి రివ్యూ కింద లింక్ క్లిక్ చేయండి.
Also Read: 'అశోక వనంలో అర్జున కళ్యాణం' రివ్యూ : పెళ్లి కోసం ఇన్ని తిప్పలు పడాలా? విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?
Jayamma Panchayathi Movie Review: స్టార్ యాంకర్, టీవీ హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జయమ్మ పంచాయతీ'. పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సుమ నటన హైలైట్ గా నిలిచింది. అంచనాలు లేకుండా వెళితే... ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువ. పూర్తి రివ్యూ కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
Also Read: 'జయమ్మ పంచాయితీ' రివ్యూ - సినిమా ఎలా ఉందంటే?
Bhala Thandanana Movie Review: ఎప్పుడూ సరికొత్త కథాంశాలతో సినిమాలు చేసే హీరో శ్రీవిష్ణు. 'భళా తందనాన' అంటూ యాక్షన్ థ్రిల్లర్ జానర్ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'బాణం', 'బసంతి' సినిమాలు తీసిన చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవడానికి కింద రివ్యూ లింక్ క్లిక్ చేయండి.
Also Read: భళా తందనాన రివ్యూ: శ్రీ విష్ణు ‘భళా’ అనిపించాడా?
Keerthy Suresh's Chinni Movie Review: ఓటీటీలో విడుదలైన సినిమాల్లో ఈ వారం కీర్తీ సురేష్ 'చిన్ని' (తమిళంలో 'సాని కాయిదం') ఉంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. కీర్తీ సురేష్ నటన, సినిమా థీమ్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. ఇంకా సినిమా గురించి మరింత తెలుసుకోవడానికి కింద ఉన్న రివ్యూ లింక్ క్లిక్ చేయండి.
Also Read: 'చిన్ని' రివ్యూ : కీర్తీ సురేష్ సినిమా ఎలా ఉందంటే?
Doctor Strange in the Multiverse of Madness Review: హాలీవుడ్ సినిమాలను ఫాలో అయ్యేవాళ్ళకు మార్వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్వెల్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్'. ఈ సినిమా రివ్యూ కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
Also Read: డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ రివ్యూ: మార్వెల్ మంత్రం పని చేసిందా?