Bhala Thandanana Telugu Movie Review: భళా తందనాన రివ్యూ: శ్రీ విష్ణు ‘భళా’ అనిపించాడా?

Bhala Thandanana Rating: శ్రీ విష్ణు, కేథరిన్ ట్రెసా జంటగా నటించిన భళా తందనాన ఎలా ఉందంటే?

FOLLOW US: 

సినిమా రివ్యూ: భళా తందనాన
రేటింగ్: 2.5/5
నటీనటులు: శ్రీ విష్ణు, కేథరిన్ ట్రెసా, గరుడ రామ్, సత్య తదితరులు
ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్
సినిమాటోగ్రఫీ: సురేష్ రగుటు
సంగీతం: మణిశర్మ
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: చైతన్య దంతులూరి
విడుదల తేదీ: మే 6, 2022

శ్రీ విష్ణు, కేథరిన్ ట్రెసా జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘భళా తందనాన’. బాణం, బసంతి వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన చైతన్య దంతులూరి మొదటిసారి యాక్షన్ సినిమాను తెరకెక్కించడం, కొత్త తరహా కథలు ఎంచుకునే శ్రీ విష్ణు ఇందులో హీరో కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఆసక్తికరంగా కట్ చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? శ్రీ విష్ణు హిట్టు కొట్టాడా?

కథ: శశి రేఖ (కేథరిన్ ట్రెసా) ఒక ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. తన దృష్టికి వస్తే ఎంత పెద్ద స్కామ్‌నైనా ఎవరికీ భయపడకుండా జనం ముందు పెట్టే ధైర్యమున్న వ్యక్తి. తనకు అనుకోకుండా అనాథాశ్రమంలో అకౌంటెంట్‌గా పనిచేసే చందు (శ్రీ విష్ణు) పరిచయం అవుతాడు. ఇంతలో సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యల వెనుక హవాలా కింగ్ ఆనంద్ బాలి (గరుడ రామ్) ఉన్నట్లు శశిరేఖ కన్ఫర్మ్ చేసుకుంటుంది. దీన్ని డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో చందు, శశిరేఖ అందులో ఇరుక్కుంటారు. అక్కడ్నుంచి ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుంది? చందు, శశిరేఖలు అందులో నుంచి ఎలా బయటపడ్డారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: బలమైన కథ కంటే దాన్ని నడిపించే కథనానికే పెద్ద పీట వేస్తున్న రోజులు ఇవి. కథనం సరిగ్గా లేకపోతే ఎంత గొప్ప కథనైనా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. చిన్న లైన్ తీసుకున్నా స్క్రీన్ ప్లే సరిగ్గా వండుకుంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. కథ, ప్రీ-రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి చెప్పినట్లు ట్విస్ట్ రివీల్ చేసే విధానం బాగానే ఉన్నప్పటికీ... ఈ సినిమా పూర్తిగా చూసి బయటకు వచ్చాక స్క్రీన్‌ప్లేలో లోపాలi పంటి కింద రాళ్లలా అనిపిస్తాయి. మంచి హైవే మీద కారులో 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటప్పుడు సడెన్‌గా స్పీడ్ బ్రేకర్ వస్తే ఎలా ఉంటుంది? పోన్లే ఒకటే కదా అని మళ్లీ వేగం పుంజుకునేటప్పుడు మరో స్పీడ్ బ్రేకర్ వస్తే! ప్రయాణమే చిరాకనిపించదూ.

భళా తందనాన సినిమా చాలా ఆసక్తికరంగా మొదలు అవుతుంది. ప్రారంభంలో వచ్చే కిడ్నాపింగ్ సీక్వెన్స్‌ను చైతన్య దంతులూరి అద్భుతంగా రాశారు, తీశారు. అయితే ఆ తర్వాత కథ రొటీన్ బాట పడుతుంది. హీరోకు ఒక కామెడీ ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, పాటలు సినిమాలో స్పీడ్ బ్రేకర్లలా అడ్డు పడుతూనే ఉంటాయి. శ్రీ విష్ణు ఫ్లాష్ బ్యాక్‌లో కొంతవరకు కామెడీ పండింది. ఎప్పుడైతే సిటీలో హత్యలు జరగడం మొదలవుతాయో అక్కడ నుంచి సినిమా మళ్లీ స్పీడ్ అందుకుంటుంది. ఊహించగలిగేదే అయినా ఇంటర్వెల్ సీక్వెన్స్ సెకండాఫ్‌పై ఆసక్తిని మరింత పెంచుతుంది.

ఇక్కడ చైతన్య దంతులూరిలోని స్క్రీన్‌ప్లే రైటర్ మళ్లీ డ్యూటీ ఎక్కాడు. ఇంటర్వెల్ నుంచి ప్రీ-క్లైమ్యాక్స్ వరకు కథ పరుగులు పెడుతుంది. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సీట్ ఎడ్జ్ మీద కూర్చుని చూసేలా చైతన్య ఈ సన్నివేశాలను తెరకెక్కించారు. సత్య ఇన్నోసెంట్ కామెడీ సినిమాకు పెద్ద ప్లస్. తన పాత్రకు రాసిన వన్ లైనర్స్ బాగా పేలతాయి.  కానీ క్లైమ్యాక్స్ సినిమా గ్రాఫ్‌ను కొంచెం కిందకు తీసుకొస్తుంది. కొత్తగా ఉంటుందని డిజైన్ క్లైమ్యాక్స్ అంతగా ఆకట్టుకోదు. సింపుల్‌గా ముగించేయాల్సిన సినిమాను కాంప్లికేట్ చేశారేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం చూశాక కథకు అసలు కన్‌క్లూజన్ ఇచ్చారా అనే సందేహం కూడా వస్తుంది. దాన్ని ఎలివేట్ చేయడానికా అన్నట్లు చివర్లో సీక్వెల్‌కు హింట్ కూడా ఇచ్చారు.

మణిశర్మ అందించిన పాటల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సోసోగానే ఉంది. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా ఉండాల్సింది. సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే... ఇటువంటి పాత్రలో నటించడం శ్రీ విష్ణుకు పూర్తిగా కొత్త. పాత్రలో కొంచెం గ్రే షేడ్స్ కూడా ఉండటంతో తను తెర మీద కొంచెం కొత్తగా కనిపిస్తాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రోల్‌లో కనిపించిన కేథరిన్ ట్రెసా తన పాత్రకు న్యాయం చేసింది. కమెడియన్ సత్య సినిమాలో ఫన్ పార్ట్ మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు. సీరియస్ సన్నివేశాల్లో కూడా బాడీ లాంగ్వేజ్, టిపికల్ టైమింగ్‌తో నవ్విస్తాడు. విలన్ పాత్ర చేసిన గరుడ రామ్ సినిమా అంతా ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తాడు. తన మేకప్ చాలా అసహజంగా ఉంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... యాక్షన్, థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడేవారు ఈ సినిమాను ఒక్కసారి చూడవచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి సినిమా అయ్యేది.

Published at : 06 May 2022 09:24 AM (IST) Tags: ABPDesamReview Bhala Thandanana Bhala Thandanana Review Bhala Thandanana Rating Bhala Thandanana Story Sree Vishnu New Movie

సంబంధిత కథనాలు

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

F3 Movie Review  - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Top Gun Maverick Movie Review - 36 ఏళ్ళ తర్వాత సీక్వెల్ - 'టాప్ గన్: మావెరిక్' ఎలా ఉంది? టాప్ ప్లేస్‌లో ఉంటుందా? లేదా?

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

టాప్ స్టోరీస్

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !

3 Years of YSR Congress Party Rule :   జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !