అన్వేషించండి
Advertisement
Jayamma Panchayathi Movie Review: 'జయమ్మ పంచాయితీ' రివ్యూ - సినిమా ఎలా ఉందంటే?
సుమ ప్రధాన పాత్రలో 'జయమ్మ పంచాయితీ' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం!
జయమ్మ పంచాయితీ
ఫ్యామిలీ ఎంటర్టైనర్
Director
విజయ్ కుమార్ కలివరపు
Starring
సుమ, దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని
నటీనటులు: సుమ, దేవి ప్రసాద్, దినేష్ కుమార్, కదంబాల షాలిని, కొండెపూడి జాయ్, నికిత, గణేష్ యాదవ్, భువన్ సాలూరు ,గేదెల త్రినాధ్, అమ్మ రామకృష్ణ, మాయానంద్ ఠాకూర్ రెడ్డి మహేశ్వర రావు, డి హేమ
నిర్మాత : బలగ ప్రకాష్
దర్శకత్వం : విజయ్ కుమార్ కలివరపు
సంగీతం : ఎం.ఎం. కీరవాణి
విడుదల తేదీ : మే 6, 2022
బుల్లితెరను మహారాణిలా ఏలుతోన్న యాంకర్ సుమ పలు టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో చాలా బిజీగా ఉంటుంది. కెరీర్ బిగినింగ్ లో నటిగా ఆమె సినిమాలు చేసింది కానీ ఆ తరువాత బుల్లితెరకే పరిమితమైంది. ఇంతకాలానికి సుమ ప్రధాన పాత్రలో 'జయమ్మ పంచాయితీ' అనే సినిమాను తెరకెక్కించారు. విజయ్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
కథ:
జయమ్మ(సుమ) తన భర్త(దేవీ ప్రసాద్) పిల్లలతో కలిసి శ్రీకాకుళంలో జీవిస్తుంటుంది. సంతోషంగా సాగిపోయే వారి జీవితాల్లో కొన్ని కష్టాలు ఏర్పడతాయి. జయమ్మ భర్తకు జబ్బు చేస్తుంది. అతడు బ్రతకాలంటే ఆపరేషన్ చేయించాల్సి ఉంటుంది. దానికి చాలా డబ్బు అవసరం పడుతుంది. డబ్బు కోసం జయమ్మ కొన్ని ప్లాన్స్ వేసినా వర్కవుట్ అవ్వవు. దీంతో ఆమె తన సమస్యను పరిష్కరించమని గ్రామ పంచాయితీను ఆశ్రయిస్తుంది. అక్కడ జయమ్మ సమస్యను విన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. అదే సమయంలో గ్రామ పెద్దలు వేరే సమస్యను పరిష్కరించడంలో బిజీ అవుతారు. దీంతో జయమ్మ తన సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందేనని ఊరి పెద్దలతో గొడవకు దిగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
సినిమా మొత్తం పల్లెటూరి నేపథ్యంలోనే సాగుతుంది. తన కథలోని పాత్రలను పరిచయం చేయడానికి దర్శకుడు చాలానే సమయం తీసుకున్నారు. అయినప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కామెడీ సన్నివేశాలు, గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకి బలమైన పాయింట్ అనేది లేదనిపిస్తుంది. జయమ్మ భర్త అనారోగ్యంతో ముడిపడి ఉన్న సంఘర్షణ చాలా సింపుల్ గా అనిపిస్తుంది.
గ్రామ పంచాయితీ సీన్స్, హెల్తీ కామెడీ సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోయింది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ ఎక్కువగా ఉండడంతో.. ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంత సాగతీత కూడా ఉండడంతో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ పెద్దగా కనెక్ట్ అవ్వదు. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా నార్మల్ గా అనిపిస్తాయి.
జయమ్మ పాత్రలో సుమ కనకాల జీవించేసింది. పాత్ర తీరుతెన్నులను అర్ధం చేసుకొని చాలా హుందాగా నటించింది. శ్రీకాకుళంలో యాసలో డైలాగ్స్ బాగానే చెప్పింది. కొన్ని చోట్ల ఆమె మాటలకు జనాలు బాగా నవ్వుకుంటారు. జయమ్మ భర్త పాత్రలో నటించిన దేవీప్రసాద్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
దర్శకుడు విజయ్ కుమార్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను హ్యాండిల్ చేశారు. చాలా డీసెంట్ గా సినిమాను రూపొందించారు. జయమ్మ పంచాయితీ అనే సినిమా ఒక్క జయమ్మ జీవితానికి మాత్రమే సంబంధించింది కాదని.. కులం, పెద్దల పరువు గురించి అని చాలా బాగా చెప్పారు. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ సినిమాటోగ్రఫీ అందించారు అనుష్ కుమార్. ఎం.ఎం.కీరవాణి సంగీతం సినిమాకి హైలైట్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎసెట్. మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి కష్టపడ్డాయి. చివరిగా చెప్పాలంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే కచ్చితంగా నచ్చుతుంది.
Also Read: ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ - ఫొటో వైరల్
Also Read: పాపులర్ నటికి వేధింపులు - దర్శకుడు అరెస్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement