Anushka Shetty: 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో అనుష్క, అసలు తగ్గలేదుగా!
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో అనుష్క సందడి చేసింది.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకి అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి రోజే ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. సినిమాలో ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉండడం, ఎన్టీఆర్-రామ్ చరణ్ లను ఒకే తెరపై చూసే ఛాన్స్ రావడంతో ఎవరూ సినిమాను మిస్ అవ్వడం లేదు. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సినిమా.
దీంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసింది. పైగా ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో రెండు ఈవెంట్స్ కలిసొచ్చేలా ఓ పార్టీ ప్లాన్ చేసింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. దిల్ రాజు కూడా వచ్చాయి. ఈ మధ్యకాలంలో బయట ఎక్కడా కనిపించని అనుష్క కూడా ఈ ఈవెంట్ కి రావడం విశేషం.
అయితే అనుష్కను చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఆమె తెరపై కనిపించి చాలా ఏళ్లవుతోంది. చివరిగా 'నిశ్శబ్దం' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. తన శరీర బరువు బాగా పెరగడంతో తగ్గే పనిలో పడింది అనుష్క. అందుకే తన ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించిన ఫొటోలు బయట ఎక్కడా లీక్ అవ్వకుండా చూసుకుంటుందని అభిమానులు భావించారు. తన అప్ కమింగ్ సినిమాల కోసం అనుష్క స్లిమ్ గా మారుతుందని అనుకున్నారు.
కానీ ఆమె మరింత లావుగా కనిపించి షాకిచ్చింది. ఆమెని చూస్తుంటే వెయిట్ పెరిగిందేమో అనిపిస్తుందే కానీ తగ్గినట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. అనుష్క మరింత లావుగా మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ బ్యూటీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న సినిమాలో కనిపించనుంది. ఇందులో నవీన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు.
Also Read: పాపం, ఈసారి సరయుకి డేంజర్ తప్పేలా లేదు!
Charan - Anushka 😎 pic.twitter.com/2ZtgwJcHRe
— He Scares Me MORE 👮 🔥 (@Hemanthsayz) March 26, 2022
#RamCharan - #SSRajamouli bonding 😍😍 #RRRMovie #RRR pic.twitter.com/QRrEHZy91j
— SSN_Mega (@alwayssMega) March 26, 2022