Chiranjeevi-Ram Charan: 'నన్ను గర్వపడేలా చేశాడు' చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
ఈరోజు రామ్ చరణ్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో సెలబ్రిటీలు రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటిరోజే రెండొందల కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమనిపిస్తుంది. ఈ సినిమాను రిపీట్ మోడ్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మెగా, నందమూరి ఫ్యాన్స్.
ఇక ఈరోజు రామ్ చరణ్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీంతో సెలబ్రిటీలు రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చెర్రీకి బర్త్ డే విషెస్ చెప్పారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడు రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. రామ్ చరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పటం వింతగా ఉందంటూ రాసుకొచ్చారు చిరు.
అయితే ఈ అకేషన్ లో రామ్ చరణ్ ఫొటో ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది అంటూ చరణ్ చిన్నప్పటి ఫొటోను షేర్ చేశారు చిరు. అందులో చిరు.. చరణ్ ను ఒళ్లో కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఆ ఫొటో పక్కనే 'ఆచార్య' సినిమాలో చిరు-చరణ్ కలిసి ఉన్న ఫొటోని యాడ్ చేశారు. కొడుకుగా రామ్ చరణ్ తనను గర్వపడేలా చేస్తున్నాడని.. చరణ్ తనకు గర్వకారణమని చిరు రాసుకొచ్చారు.
Also Read: స్టార్ హీరో విజయ్ చనిపోయాడంటూ ట్రోలింగ్, యాంటీ ఫ్యాన్స్ దారుణమైన కామెంట్స్
View this post on Instagram