అన్వేషించండి

Anchor Rashmi: ‘జబర్దస్త్’ షో నుంచి తీసేస్తామని ముందే చెప్పారు: యాంకర్ రష్మీ

‘జబర్దస్త్‘ కామెడీ షో నుంచి తనను తొలగించి సౌమ్యరావును యాంకర్ గా తీసుకోవడంపై రష్మీ గౌతమ్ మరోసారి స్పందించింది. తనను ఈ షో నుంచి తొలగిస్తామని ముందే చెప్పారని, అందుకే బాధ పడలేదని చెప్పుకొచ్చింది.

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి పెద్దగా చెప్పనసరం లేదు. ‘జబర్దస్త్’ షోలో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇక జంతు ప్రేమికురాలు అయిన రష్మీ గౌతమ్, మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. ఆయా అంశాలపై ఆమె చేసిన ట్వీట్లు తీవ్ర దుమారం రేపిన సందర్భాలు ఉన్నాయి. కాసేపు ఈ విషయాలను పక్కన పెడితే, తనను ‘జబర్దస్త్‘ యాంకర్ పోస్టు నుంచి తొలగించి సౌమ్య రావును తీసుకురావడంపై రష్మీ మరోసారి స్పందించింది. ఆమె యాంకర్ గా రావడం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది.  

అనసూయ వెళ్లిపోవడంతో రెండు షోలకు యాంకర్ గా రష్మీ!

వాస్తవానికి అప్పటి వరకు ‘జబర్దస్త్’ యాంకర్ గా కొనసాగిన అనసూయ ఈ షో నుంచి వెళ్లిపోయింది. వెంటనే కొత్త యాంకర్ ను తీసుకురావాలని షో నిర్వాహకులు భావించారు. కానీ, అప్పటికప్పడు కొత్త యాంకర్ ను సెట్ చేయడం అంటే  కుదరని పని అని భావించారు. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ యాంకర్ గా ఉన్న రష్మీని ఈ షోకు కూడా యాంకర్ గా చేసేశారు. రెండు షోకు యాంకర్ గా చేసి మంచి పేమెంట్ తీసుకుంది. కొద్ది రోజుల పాటు రెండు షోలకు రష్మి యాంకర్ గా కొనసాగాక, కన్నడ బ్యూటీ సౌమ్యరావును ‘జబర్దస్త్’ యాంకర్ గా తీసుకొచ్చారు. సౌమ్య రావడంతో రష్మీ మళ్లీ ‘ఎక్స్ట్రా జబర్దస్త్’కు పరిమితం అయ్యింది.    

సౌమ్యరావు రాకపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు!

రీసెంట్ గా నెటిజన్లతో ఇంటరాక్ట్ అయిన రష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది. అదే సమయంలో ఓ నెటిజన్ ‘జబర్దస్త్’ యాంకర్ గా మిమ్మల్ని తీసేసి సౌమ్యరావును తీసుకురావడంపై మీ స్పందన ఏంటి? అని ప్రశ్నించాడు.  దీనికి రష్మి స్పందించింది. షో నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. “నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ‘జబర్దస్త్’ యాంకర్ గా ఉండేది కొన్ని వారాలే అని ముందే చెప్పారు. కొత్త యాంకర్ వచ్చాక వెళ్లిపోవాలని అప్పుడే అన్నారు. సో, ఈ షో నుంచి వెళ్లిపోతానని నాకు ముందే తెలుసు. అలాంటప్పుడు నాకు ఎందుకు అభ్యంతరాలు ఉంటాయి?” అని వెల్లడించింది.   

అటు నెటిజన్లు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. మూగ జీవాలకు ఇబ్బంది కలిగితే తాను తట్టుకోలేనని వెల్లడించింది. డైరెక్టుగా, ఇన్ డైరెక్టుగా అవి ఎలా ఇబ్బంది పడినా తనకు బాధ కలుగుతుందన్నారు. ఇక 2020 తర్వాత సినిమాల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడిందని చెప్పింది. అయినా, ట్రయల్స్ కొనసాగుతున్నట్లు వివరించింది. సినిమాలు అని కాదు, డిజిటల్ కంటెంట్ కోసం పని చేస్తున్నట్లు వివరించింది. ఇక తనకు తానే ప్రేరణ అని చెప్పుకొచ్చింది రష్మి.

Read Also: ఆ కారణంతోనే కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యా - మీరా జాస్మిన్‌

ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget