అన్వేషించండి

Meera Jasmine: ఆ కారణంతోనే కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యా - మీరా జాస్మిన్‌

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న మీరా జాస్మిన్, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. తాజాగా తను ఎందుకు ఇంతకాలంగా మూవీస్ దూరంగా ఉండాల్సి వచ్చిందో వెల్లడించింది.

మీరా జాస్మిన్.. ఒకప్పుడు తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలలో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. టాప్ హీరోలతో కలిసి పని చేసింది. ఈమె ఏడాదికి అర డజన్ కు పైగా సినిమాల్లో నటించిన సందర్భాలున్నాయి. కన్నడ, మలయాళ సినిమాలు కూడా చేసింది. 2010 తర్వాత సినిమాలు చేయడం తగ్గించింది. కొద్ది కాలం తర్వాత పూర్తిగా సినిమాలకే దూరం అయ్యింది. సుమారు దశాబ్దం తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది మీరా. రీసెంట్ గా ‘టెస్ట్’ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె, తను సినిమా పరిశ్రమకు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో వివవరించే ప్రయత్నం చేసింది.

సినిమాలకు ఎందుకు దూరం అయ్యానంటే? 

హీరోయిన్ గా చక్కటి ప్రయాణాన్ని కొనసాగించినట్లు మీరా జాస్మిన్ తెలిపింది. “హీరోయిన్ గా చాలా చక్కటి ప్రయాణాన్ని కొనసాగించాను. నటిగా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకోవడం చాలా గొప్పగా ఫీలవుతున్నాను. సినిమాలకు దూరం కావడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు. వ్యక్తిగతంగా నన్ను నేను మెరుగుపరుచుకోవాలి అనే ఉద్దేశంతోనే సినిమాలు చేయలేదు. ప్రస్తుతం మళ్లీ సినిమాలు చేస్తున్నాను. నటిగా నా ప్రయాణం మళ్లీ మొదలైనట్లు భావిస్తున్నాను” అని చెప్పింది.

‘టెస్ట్’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది!

ఇక ‘టెస్ట్‌’ సినిమా గురించి మీరా జాస్మిన్ పలు విషయాలు వెల్లడించింది. “మాధవన్‌, సిద్ధార్థ్‌తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే వారితో కలిసి పని చేశాను. మరోసారి వారితో నటించడం మంచి అనుభూతిని కలిగిస్తోంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతారతో కలిసి తొలిసారి నటిస్తున్నాను. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గొప్పగా భావిస్తున్నాను. దర్శకుడు శశికాంత్ నాకు ఈ సినిమా కథను చెప్పగానే చాలా నచ్చింది. వెంటనే ఓకే చెప్పాను. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో కొనసాగుతుంది. ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.

‘రన్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం

మీరా జాస్మిన్ ఇప్పటికే ‘రన్‌’, ‘యువ’ సినిమాల్లో మాధన్ తో కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అటు సిద్దార్థ్ తోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘యువ’ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించిన చివరి తమిళ చిత్రం ‘విజ్ఞాని’. 2014లో వచ్చిన సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వాస్తవానికి డబ్బింగ్ మూవీగా వచ్చిన ‘రన్’ చిత్రంతో మీరా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘అమ్మాయి బాగుంది’ సినిమాతో డైరెక్టుగా తెలుగు సినిమా చేసింది. ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. తొలి చిత్రంతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మీరాకు వరుస అవకాశాలు వచ్చాయి. ‘గుడుంబా శంకర్‌’, ‘భద్ర’, ‘రారాజు’, ‘మహారథి’, ‘బంగారు బాబు’ లాంటి సినిమాలతో అద్భుత విజయాలు అందుకుంది. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది.  సుమారు దశాబ్దం తర్వాత రీసెంట్ గా ‘విమానం’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఎయిర్ హోస్టెస్ గా ఆకట్టుకుంది. పాత్ర నిడివి తక్కువే అయినా, చక్కటి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది.   

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meera Jasmine (@meerajasmine)

Read Also: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత, ఆరు నెలలు చాలా కఠినమంటూ సెల్ఫీతో షాకిచ్చిన సామ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget