Ammayi garu Serial Today November 27th: కోమలి గురించి నిజం చెప్పడానికి సూర్య వద్దకు వచ్చిన విరూపాక్షి మర్డర్ కేసులో ఎలా ఇరుక్కుంటుంది..?
Ammayi garu Serial Today Episode November 27: ఎమ్మెల్యే విరూపాక్షి మర్డర్ కేసులో ఎవరు ఇరికించారు. ఇంతకీ కోమలి గురించిన నిజం సూర్యాకు తెలిసిందా లేదా..?

Ammayi garu Serial Today Episode: రాజు, రూప ఆశ్రమ నిర్వాహకులను తీసుకుని ఇక్కడికే వస్తున్నారని తెలిసి పారిపోతున్న కోమలిని చూసి ఎక్కడికని సీఎం అడుగుతాడు. ఓ ప్రెండ్‌కు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేసిందని ఆమెను కలవడానికే తాను వెళ్తున్నాని చెబుతుంది. సరే నేను కూడా తోడుగా వస్తానని ఆయన అనడంతో కోమలికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంత చిన్న విషయానికి మీరు రావడం ఎందుకు అని వద్దు అంటుంది. బయటకు వెళ్లినా దొరికిపోతాను...ఇంట్లో ఉన్నా దొరికిపోతానని కోమలి ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన విజయాంబిక...కోమలికి ఫోన్ చేస్తుంది. నువ్వు బయటకు వెళ్లడం కన్నా ఇంట్లో ఉండటమే మంచిదని సలహా ఇస్తుంది. విరూపాక్షి వచ్చేలోగా ఏదో ఒకదారి వెదుకుదాం అంటుంది. తన ప్రెండ్ ప్రాబ్లం తీరిపోయిందని అబద్ధం చెప్పి కోమలి కూడా లోపలికి వెళ్లిపోతుంది. విజయాంబిక కోమలి రూమ్‌లోకి రాగా...ఆమె వారిద్దరిపై మండిపడుతుంది. తనకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకుంటామని ఇక్కడికి తీసుకొచ్చారని...ఇప్పుడు నా ప్రాణాం మీదకు వచ్చినా మీరు ఏం మాట్లాడం లేదని మండిపడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని విజయాంబికాను, దీపక్‌ను నిలదీస్తుంది. ఇంతలో విరూపాక్షి ఆశ్రమం జనాలను తీసుకుని అక్కడికి వస్తుంది. బయటకు వెళ్లిపోవాలనుకున్న కోమలి కాస్త వారిని చూసి ఆగిపోతుంది. వాళ్లను చూసి విజయాంబికతోపాటు దీపక్ కూడా ఉలిక్కిపడతాడు. విరూపాక్షి జనాలను వేసుకునిరావడం చూసి సీఎం కూడా ఇంటి బయటకు వెళతాడు. ఏం జరిగిందని రాజును సూర్య అడుగుతాడు. అప్పుడు విరూపాక్ష కల్పించుకుని వీళ్లంతా తాను నడుపుతున్న అనాథ ఆశ్రమం నుంచి వచ్చారని చెబుతుంది.ఎందుకు వచ్చారంటూ సీఎం సూర్య ప్రశ్నిస్తాడు. ఇన్నాళ్లు కోమలి ఎవరో మేం చెబితే నమ్మలేదు కాబట్టి వీరితో చెప్పిస్తే నమ్ముతావని నేనే తీసుకొచ్చాని చెబుతుంది. సరిగ్గా అప్పుడే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. వచ్చీరాగానే వాళ్లు విరూపాక్షిని చూస్తూ...మేం మీకోసమే వచ్చమని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు. ఈ ఊహించని చర్యతో విరూపాక్షితోపాటు రాజు, రూప కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని రాజు నిలదీయగా....విరూపాక్ష మేడం ఓ చిట్‌ఫడ్ సంస్థ మేనేజర్‌ను కాల్చి చంపారని చెబుతారు.
తాను ఎవరినీ చంపలేదని విరూపాక్ష చెప్పగా...ఆధారాలతో సహా న్యూస్‌లో వస్తుందని సీఐ బదులిస్తాడు. అసలు ఏం జరిగిందని సీఎం సూర్య ప్రశ్నించగా....మేడంగారు బస్తీలో కొందరికి ఆటోలు కొనిస్తామని చెప్పి ఓ చిట్‌ఫండ్ కంపెనీలో డబ్బులు కట్టించారని...ఆ డబ్బు మొత్తం తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయమని మేనేజర్‌ను బెదిరించారని...అతను ఒప్పుకోకపోవడంతో కాల్చి చంపారని చెబుతాడు. దీనికి విరూపాక్షి బదులిస్తూ...వాడిని బెదిరించిన మాట వాస్తవమేనని కానీ తాను చంపలేదని చెబుతుంది. దీంతో సూర్య సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఎక్కడికి వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అంటూ నిలదీస్తాడు. ఎమ్మెల్యే విరూపాక్షి ప్రజల కోసం పనిచేసే మనిషి అంటూ సీఎం సూర్య అంటాడు. తనతో గొడవపడి మరీ బస్తీవాళ్లకు ఇళ్లు కట్టిస్తోందని...అలాంటి ఎమ్మెల్యే బస్తీవాళ్ల ఆస్తి కొట్టేయడమేంటని నిలదీస్తాడు. కోట్లరూపాయల ఆస్తి వదిలేసుకున్న ఆమె....పేదలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కోసం ఆశపడుతుందంటే నేను నమ్మను అంటాడు.
విరూపాక్షి గురించి సూర్య అలా మాట్లాడటం చూసి విజయాంబిక ఆశ్చర్యపోతుంది. పోలీసులు వచ్చి ఆమె మర్డర్ చేసిందని చెబుతున్నా...కనీసం అనుమానించకుండా వెనకేసుకోస్తున్నాడేంటి అని అనుకుంటుంది. వెంటనే కలుగుజేసుకుని మా తమ్ముడు అడుగుతున్నాడు కదా మాట్లాడరేంటి సీఐగారు అంటూ ముందుకు దూకుతుంది. అందరి ముందు విరూపాక్షిని దోషి అని అన్నారు కదా నిరూపించండి అని నిలదీస్తుంది విజయాంబిక. ఆమె తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు సీఐ కల్పించుకుని మర్డర్ చేసిన ప్రాంతంలో ఆధారాలన్నీ ఎమ్మెల్యే విరూపాక్షిగారు చేసినట్లే ఉన్నాయని చెబుతాడు. అక్కడ దొరికిన బుల్లెట్ సీఎంకు చూపిస్తూ....ఇది ఎమ్మెల్యేగారి గన్‌లోని బుల్లెట్ అని చెబుతాడు. అలాగే అక్కడ ఉన్న సీసీకెమెరా పుటేజ్ సైత చూపిస్తాడు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి సార్ అంటాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా....రూప,రాజు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పోలీసులను వెళ్లిపోమని చెప్పాలంటూ రూప తన తండ్రిని వేడుకుంటుంది.అమ్మ ఎలాంటి తప్పు చేయదని చెప్పమంటుంది. తండ్రి ఏం మాట్లాడకపోయే సరికి విరూపాక్షి పోలీసుల వెంట వెళ్తుంది. కోమలి బండారం బయటపెట్టడానికి వచ్చిన వారికి ఈ విధంగా జరిగే సరికి లోలోపల విజయాంబిక సంతోషపడుతుంది...





















