Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఢీ’ కొట్టేందుకు వచ్చేస్తున్న బన్నీ

త్వరలోనే 'ఢీ' సీజన్ 13 గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోని తీసుకొస్తున్నారు.  

FOLLOW US: 

ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ షో 'ఢీ' సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పన్నెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదమూడవ సీజన్ లో ఉంది. 'కింగ్స్ వర్సెస్ క్వీన్స్' అంటూ అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ షోలో సెమీఫైనల్ పోరు నడుస్తోంది. త్వరలోనే గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేకు అతిథిగా టాలీవుడ్ స్టార్ హీరోని తీసుకొస్తున్నారు. అతడు మరెవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 

ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ల డాన్స్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఢీ సీజన్ 12 గ్రాండ్ ఫినాలేకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. ఇప్పుడేమో స్టైలిష్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నారు. సెమీ ఫైనల్ పోరులో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ నుంచి నలుగురు సభ్యులు ఎంపిక అవుతారు. వీరిలో అల్లు అర్జున్ చేతుల మీదుగా ఢీ13 టైటిల్ ఎవరు అందుకుంటారో చూడాలి. 

త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో యాంకర్ ప్రదీప్.. అల్లు అర్జున్ గురించి గొప్పగా మాట్లాడుతూ.. కొన్ని క్లిప్పింగ్స్ ను చూపించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని బుల్లితెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షోకి టీఆర్పీ ఓ రేంజ్ లో రావడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Allu Arjun Dhee 13 Show Kings vs Queens Dhee 13 Dhee 13 latest promo Dhee 13 allu arjun promo

సంబంధిత కథనాలు

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

KGF 2: 'కేజీఎఫ్2' ఓటీటీ రిలీజ్ - ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు!

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Pooja Hegde: వెంకటేష్ చెల్లెలిగా పూజాహెగ్డే - ఏ సినిమాలో అంటే?

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ

NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు

TRS vs BJP Politics: కమలంను ఢీ కొట్టేందుకు గులాబీ వ్యూహం ఇదేనా? బీజేపీకి కళ్లెం వేసేందుకు టీఆర్‌ఎస్‌ దూకుడు