Allu Arjun: యాడ్ షూట్ కోసం బన్నీ లుక్ - ఊర మాస్!
ఓ పైప్స్ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు బన్నీ. తాజాగా దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ ను నిర్వహించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం బ్రేక్ మోడ్ లో ఉన్నారు. 'పుష్ప'(Pushpa) సినిమా తరువాత బన్నీ తన ఫ్యామిలీతో కలిసి సమయం గడుపుతున్నారు. భార్యా, పిల్లలతో వెకేషన్ కి వెళ్లారు. రీసెంట్ గా ఇండియా తిరిగొచ్చారు. వచ్చిన వెంటనే ఓ యాడ్ షూట్ కోసం థాయిలాండ్ కి వెళ్లారు బన్నీ. ఒక సాఫ్ట్ డ్రింక్ కి సంబంధించిన యాడ్ లో పాల్గొన్నారు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ తో కలిసి మరో యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు బన్నీ.
ఇప్పుడు ఓ పైప్స్ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు బన్నీ. తాజాగా దీనికి సంబంధించిన యాడ్ షూటింగ్ ను నిర్వహించారు. దీన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేశారు. ఈ యాడ్ షూట్ లో బన్నీ లుక్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. చెవిపోగు, చేతిలో సిగార్, మాస్ హెయిర్ స్టైల్ తో బన్నీ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం ఈ హీరో 'పుష్ప' పార్ట్ 2 కోసం రెడీ అవుతున్నారు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అలానే అనసూయ, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ లో, లేదంటే వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?
Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?
Icon Staar @alluarjun steals the show in his new braided look from a brand new ad campaign of @AstralPipes directed by powerful director @harish2you. pic.twitter.com/DnIRiVyk0G
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 29, 2022
A part of the forever fashionable @alluarjun's look revealed in another BTS photo from the sets. When @harish2you directs he elevates the look and feel to the next level. The Icon Star has been synonymous with style & his fashion game has always been strong.
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 28, 2022
📷 :@avigowariker pic.twitter.com/DLhnz1qyqG
Icon Staar @AlluArjun is teaming up with director @harish2you and DOP Sudeep Chatterjee for an ad shoot for @AstralPipes being shot in Hyderabad. The actor has a busy week with multiple brand endorsements lined up. He is reinventing and pushing it further with every ad shoot. pic.twitter.com/0bLjyIZa0v
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 28, 2022