అన్వేషించండి

Alia Bhatt Saree: అయోధ్య వేడుకలో ఆలియా ధరించిన ‘రామాయణం’ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

Alia Bhatt Saree: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలో బాలీవుడ్ నటి ఆలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించి చీర ప్రత్యేకతను తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Alia Bhatt Ramayan Themed Saree: ఏళ్ల నిరీక్షణ అనంతరం అయోధ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు దీరాడు. ఈ నెల 22న బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ వేడుకకు 10 వేలకు పైగా మంది ప్రముఖులు హాజరయ్యారు. చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొని పులకించిపోయారు. స్వామివారి ప్రాణ ప్రతిష్ట అనంతరం బాల రాముడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.

అయోధ్య వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా ఆలియా

ఈ వేడుకకు పలువురు సినీ తారలు హాజరయ్యారు. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్, తన భర్త, నటుడు రణబీర్ కపూర్ తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ధరించి మైసూర్‌ సిల్క్‌ శారీ అందరినీ భలే ఆకట్టుకుంది. వాస్తవానికి ఆలియా ఏ కార్యక్రమానికి వెళ్లినా వస్త్రధారణలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటుంది.  అందులో భాగంగానే అయోధ్య వేడుకకు కూడా రామాయణ ఇతివృత్తం ఆధారంగా  ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన చీరను ధరించి ఆకట్టుకుంది.

ఆలియా చీరపై రామయణ గాథ

ఆలియా ధరించిన లైట్ గ్రీన్ రంగు సిల్క్‌ చీర కొంగు అంచుపై రామాయణాన్ని కళ్లకు కట్టేలా రూపొందించారు డిజైనర్లు. పల్లుపై రామసేతు, హనుమాన్‌, రాముడు శివ ధనుస్సును విరవడం, రాముడి వనవాసం, గంగానదిపై వంతెన, బంగారు జింక, సీతను అపహరించడం సహా పూర్తి రామాయణాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొంగుపై పూర్తిగా చేత్తో డిజైన్‌ చేయడం విశేషం. ఆలియా భట్ కట్టకున్న ఈ అద్భుతమైన సిల్క్ చీరను మాధుర్య క్రియేషన్స్ వాళ్లు డిజైన్ చేశారు. నిజానికి ఈ చీరను తయారు చేయడానికి చాలా సమయం పడుతుందట. అయితే, ఆలియా రిక్వెస్ట్ తో కేవలం 10 రోజుల్లోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చీర ఖరీదు సుమారు రూ. 45 వేలు అయినట్టు తెలుస్తోంది.ఈ చీర ఫొటోలను మాధుర్య క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. బాల రాముడి ప్రతిష్టాత్మక ప్రాణ ప్రతిష్ట వేళ రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించిన అలియా భట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ABP Desam (@abpdesam)

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

అటు బాలీవుడ్ లో బ్యూటీఫుల్ స్టార్ కపుల్ గా కొనసాగుతున్న రణబీర్, ఆలియా. ఇద్దరూ సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప. గత ఏడాది  ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే మూవీతో హాలీవుడ్ లోకి ఆలియా అడుగు పెట్టింది. అటు సంజయ్ లీలా భన్సాలీతో ‘బైజూ బావ్రా’, ‘జీ లే జరా’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది. ఆమె భర్త రణబీర్ కపూర్ ‘యానిమల్’ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అటు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ మూవీలో రాముడి పాత్ర పోషిస్తున్నాడు.

Read Also: ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్ డేట్, తారక్ పాత్ర అలా ఉంటుందట

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Advertisement

వీడియోలు

సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
రికార్డులు బద్దలు కొట్టీన సఫారీలు ఆసీస్, భారత్‌తో టాప్‌ ప్లేస్‌లోకి..
ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
సఫారీలతో రెండో వన్డేలో భారత్ ఘోర ఓటమి
Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Putin in India: ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
ఢిల్లీలో రష్యా అధ్యక్షుడు పుతిన్ - ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతం పలికిన ప్రధాని మోదీ
Andhra Investments :  ఏపీలో  మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
ఏపీలో మరో రూ. 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం - 45 రోజుల్లోగా మెజార్టీ ఎంఓయూలు గ్రౌండింగ్
Deputy CM Pawan Kalyan: వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా వేస్ట్ - చిత్తూరులో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
Loan Apps Ban: 87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
87 లోన్ యాప్స్‌ను బ్యాన్ చేసిన కేంద్రం - ఇప్పుడు అప్పు తీసుకున్న వాళ్లందరూ ఎగ్గొట్టవచ్చా?
Akhanda 2 Nizam Bookings: అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
అప్పుడు వీరమల్లు... ఇప్పుడు అఖండ 2... టికెట్ రేట్స్ కోసం భారీ రిస్క్!
US warning to Pakistan:  ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
ఇమ్రాన్ ను వదిలి పెట్టాలని మునీర్‌పై అమెరికా ఒత్తిడి - ఆంక్షలకు సిద్దమవ్వాలని హెచ్చరిక
Putin Religion: లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
లౌకిక దేశమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మతాన్ని పాటిస్తారు? దేవుడిపై నమ్మకం ఉందా?
Gen-Z Budgeting Hacks : జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
జెన్-జీ పాటించే స్మార్ట్ మనీ హ్యాబిట్స్.. నెలవారీ ఖర్చు తగ్గించే సీక్రెట్స్
Embed widget